palaparthi cover

అమ్మమ్మ ఉత్తరం

అమ్మా లడ్డూ పెత్తు అడిగింది పాప.
అమ్మ  డబ్బాలోంచి ఒక లడ్డూ  తీసి ఇచ్చింది.
లడ్డూ తీసుకుని పాప ఎగురుకుంటూ ఆడుకోడానికి వెళ్ళిపోయింది.
కొంచెం సేపు అయ్యాక మళ్ళీ వచ్చింది.
అమ్మా! ఇంకో లడ్డూ పెత్తు అంది.
ఇందాకేగా ఇచ్చాను.
ఇంక చాల్లే తల్లీ! అన్నది అమ్మ.
ఇంక ఒక్కటే పెత్తు. పీజ్! పీజ్! అడిగింది పాప.
సరే! మళ్ళీ అడక్కు! అంటూ ఇంకో లడ్డూ తీసి ఇచ్చింది అమ్మ.
ఆ లడ్డూ కూడా తినేసి మళ్ళీ వచ్చేసింది పాప.
అమ్మ ఇంక ఒక్కటే లడ్డూ పెత్తుతావా? పీజ్? అంది.
పీజ్ లేదు. గీజ్ లేదు.
కడుపులో నెప్పి వస్తుంది.
ఇంక చాలు.
మళ్ళీ అడిగావో! అన్నది అమ్మ కోపంగా.
అ ఆ ఇ ఈ అలమరలో
ఉ ఊ ఋ ౠ లడ్డూలున్నాయ్!
ఎ ఏ ఐ
ఒ ఓ ఔ
మనం చూస్తే కాలీ  అవుతాయ్!
అం!అః!
అం!అః!
మనం చూస్తే కాలీ  అవుతాయ్!!
అని పాడింది పాప.
అమ్మ నవ్వింది.
అయితే లడ్డూ పెత్తు అంది పాప.
లడ్డూ లేదు గిడ్డూ లేదు.
వెళ్ళి ఆడుకో.
లేకపోతే ఏ బీ సీ లు రాయి.
పో!  అంది అమ్మ.
ఏ బీ సీ ల మాట వినగానే మాట్లాడకుండా వెళ్ళిపోయింది పాప.
కొంచెం సేపు అయ్యాక అమ్మ హాండ్ బాగ్ తగిలించుకుని వచ్చింది.
పోస్తు!! పోస్తు!! పోస్తు మేను వాడు వచ్చాడండీ! అంది.
పనిలో ఉన్న అమ్మ పాప వైపు తిరిగి చూసి, ఓ! పోస్ట్ మాన్ ఆటా? అంది.
అవునండీ. నేను పోస్తు మేను వాడిని! మీకు పోస్తు వచ్చిందండీ ! అన్నది.
సరే.ఇవ్వండి అంది అమ్మ.
పాప బాగులోనించి ఒక మడత పెట్టిన కాగితం తీసి ఇచ్చింది.
అమ్మమ్మ ఉత్తరం రాసిందండీ ! అన్నది పాప.
అహా. సరే. ఇంక వెళ్ళండి అంది అమ్మ ఆ కాగితాన్ని పక్కన పడేస్తూ.
 చదవండీ  ఉత్తరం! అంది పాప అక్కడనుండి కదలకుండా.
అమ్మ పని పక్కన పెట్టి విసుగ్గా ఉత్తరం తీసింది.
ఏవిటీ సున్నాలు? ఏవిటీ  బ్రహ్మ రాత? అంది.
 ammamma uttaram1
పాపని ఎప్పుడూ కోప్పడకూదు.

చాలా చాలా చాలా చాలా చాలా చాలా

చాలా చాలా చాలా చాలా చాలా చాలా

చాలా

లడ్డూలు పెత్తాలి! అని  ఉత్తరం రాసింది అమ్మమ్మ.
తెలీదా?
అన్నది పాప.

*

Download PDF ePub MOBI

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, నవంబర్, సీరియల్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.