cover

పద్మప్రాభృతకమ్ (6)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

కిమాహ భవాన్ – “స్థానే ఖలు సా పుంశ్చలీ శబ్దశీఫరమాభాషితా రుష్టా” ఇతి | తత్కేయం పుంశ్చలీతి ? కిం బ్రవీషి – “ప్రియా నామ కేనోచ్యతే” ఇతి (విమృశ్య) ఆ విదితమ్ రశనావతికా ఏతచ్చార్హతి | నాతశ్చ భూయః కష్టతరం యత్సా ప్రచురపాదపాంతరచారిణీవ కోకిలా స్వభావఖరం బిల్వపాదమాశ్రితా | కష్టం భోః మహదిదం పరిహాసవస్తు, ఆస్వాదయిష్యామస్తావత్ |

వయస్య దత్తకలశే, ఏవం స్వభావదక్షిణస్య భవతః కథం కామినీ విరక్తేతి పరం మే కుతూహలం శ్రోతుమ్ | ఏతదుచ్యతాం తావత్ విస్తరతః | కిమాహ భవాన్ – “సాధు సా పుంశ్చలీ పూర్వేద్యుః పర్వకాలే వేశకోష్టకముపేత్య రిరంసయా మాం హవిర్జుహూషన్తం జిఘృక్షతీవోపాసీదత్ | తతోऽహమేనామవోచమ్ – వృషలి హవిర్జుహూషన్తం మా మా స్ప్రాక్షీః “ ఇతి | హన్త! ఇదం తత్ దుష్టగాన్ధర్వం నామ | సుకుమారః ఖలు కామినీసంపరిగ్రహః | కలహోऽయముపచారో ను | మా తావదలోకజ్ఞ యుక్తం నామ త్వయా ప్రణయోపగతాం కామినీం విరాగయితుమ్ | స్త్రీజనోऽపి త్వయా కష్టశబ్దనిష్టురాభిర్వ్యాకరణ విస్ఫులింగాభిర్వాగ్నిరుత్త్రాసయితవ్యో భవతి | ఇదమపి న త్వయా శ్రుతపూర్వమ్ –

రత్యర్థినీం రహసి యః సుకుమారచిత్తాం కాన్తాం స్వభావమధురాక్షరలాలనీయమ్ |

వాగర్చిషాం స్పృశతి కర్ణవిరేచనేన రక్తాం స వాదయతి వల్లకిముల్ముకేన ||

ఏమంటిరి మీరు – “ నా మధురమైన పలుకులకు లొంగని యది ఖచ్చితంగా రంకులాడి” అనియా? ఎవరా రంకులాడి? ఏమంటిరి – “ప్రియురాళ్ళ గురించి ఎవరు చెప్పుదుర” నియా? (ఆలోచించి) ఆ, తెలిసినది. రశనావతికా మీ మాటకు తగినది. ఎందుకంటే, తను ఎల్లప్పుడూ చరించుటకు అందమైన చెట్లనాశ్రయించిన ఆ కోకిల స్వభావవిరుద్ధంగా, కష్టతరముగ మారేడు చెట్టునాశ్రయించినది. కష్టమైన ఈ విషయం కూడా పరిహాసవస్తువయింది. సరే, దీనిని ఆస్వాదింతును. మిత్రమా, దత్తకలశా, మీ వంటి కరుణాస్వభావుని పట్ల ఆ కామిని ఎందుకు విరక్తురాలయింది అని వినడానికి ఆసక్తికరముగా నున్నది. విశదంగా చెప్పుము. “ఆ రంకులాడి నిన్న పొద్దున చక్కగా ముస్తాబై, అగ్నికార్యంలో ఉన్న నన్ను సమీపించింది. నేనా రంకుటాలిని – ‘అగ్నికార్యంలో ఉన్న నన్ను తాకకు’ అన్నాను” అన్నారా? ధిక్. కార్యం చెడడమంటే అదే. కామినులను సొంతం చేసుకోవడం సున్నితమైన విషయం కదా. ప్రణయోపగతులైన కామినులను విరాగులుగ చేయుట మీ యలోకజ్ఞతకు ఋజువు. నిష్టురమైన మాటలతో, వ్యాకరణవిస్ఫులింగాల మాటలతో అమ్మాయిలు అలసిపోగలరు. ఇది మీరు విని ఉండకపోవచ్చు.

యః = ఎవడు, సుకుమారచిత్తాం = మార్దవమైన హృదయం గలదానిని, రత్యర్థినీం = రమింపగోరుదానిని, స్వభావమధురాక్షరలాలనీయాం = స్వభావసుందమైన వాక్కులతో లాలించవలసిన దానిని, కాన్తాం = సుందరిని, రహసి = ఏకాంతమున, కర్ణవిరేచనేన = చెవి పగిలే, వాగర్చిషా = వాక్కులతో, స్పృశతి = స్పర్శించునో, సః = అతడు, రక్తాం వల్లకీం = రాగాలు పలికించు వీణను, ఉల్ముకేన = మండుతున్న కట్టెతో, వాదయతి = మీటుచున్నవాడు.

తాత్పర్యము: ఎవడు మృదుహృదయ అయి రమింపగోరుదానిని, స్వభావమధురముగ లాలించవలసిన తరుణిని ఏకాంతములో చెవి పగిలే మాటలతో పలుకరించునో, వాడు రాగయుక్తమైన వీణను మండుతున్న కట్టెతో మీటుతున్నవాడు.

సర్వథా దుష్కరకారిణీ ఖలు రశనావతికా, యా భక్తమనేన కల్పయతి | అథవా తు తస్యాః శాపః | వయస్య దత్తకలశే శ్రుతం శ్రోత్రరసాయనమ్ | స్వస్తి భవతే | సాధయామ్యహమ్ | (పరిక్రమ్య)

ఇదమపరం మనుష్యకాన్తారముపస్థితమ్ | ఏష హి ధర్మాసనికపుత్రః పవిత్రకో నామ ప్రచ్ఛనపుంశ్చీలకో అచౌక్షః చౌక్షవాదితః రాజమార్గేऽవిదితజనసంస్పర్శే పరిహరన్నివ సంగృహీతార్ద్రవసనః సంకుచిత సర్వాంగో నాసికాద్వయమంగుళీద్వయేన పిధాయ చత్వరశివపీఠికామాశ్రిత్యస్థితః | హాస్యః ఖల్వేష తపస్వీ | యథా తావదయం మత్తకాశిన్యా దుహితరం వారుణికాం నామ బంధకీమనురక్త ఇతి శ్రూయతే | తదిదానీం కిమయమాకులే భవతి | ఇదమస్యా వినయప్రచారపుస్తకముద్ఘాట్యతే |

విశేషములు: విషమాలంకారము. వసంతతిలకం – త భ జ జ గ గ. రక్తా – వీణ తరపున రాగములొలికించునది అని తరుణి తరపున అనురక్త అయినదని ఊహించనగును.

ఎప్పుడూ కష్టము కలిగించేదే కదా ఈ రశనావతిక, ఇటు వంటి వాడితో స్నేహం చేస్తూంది. లేక, అది ఆమె విషయమున శాపమేమో. మిత్రమా, దత్తకలశా, మీ శ్రోత్రరసాయనమును వింటిని. శుభమగుగాక. నేను ముందుకేగుచున్నాను.

(ముందుకు నడిచి)

ఇది మరొక జనారణ్యము. ఇక్కడ ఉన్నది ధర్మాసనికపుత్రుడైన పవిత్రకుడనే గుట్టుగా రంకుపనులు చేసెడువాడు. అశుద్ధుడైనా శుద్ధుడని చెప్పుకొను వాడు. రాజమార్గములో తెలిసిన వాళ్ళనుండి తప్పుకుందుకు తడిబట్టలను కట్టుకుని, శరీరభాగాలన్నిటిని ముడుచుకుని, రెండు వ్రేళ్ళతో ముక్కును మూసుకుని, కూడలి దగ్గర శివపీఠికదగ్గర నిలబడి ఉన్నాడు.

(అచౌక్షః చౌక్షవారితః – దీని పాఠాంతరము

అచోక్షః చోక్షవాదితః. – చౌక్ష, చోక్ష శబ్దాలకి పవిత్రుడని అర్థమట. ఇది భాగవత వైష్ణవసాంప్రదాయవిశేషమని, అభినవగుప్తుని నాట్యశాస్త్రవ్యాఖ్యానము అభినవభారతి యందు

చోక్షా భాగవతవిశేషా యే ఏకాయనా ఇతి ప్రసిద్ధాః |

అని నిర్దేశింపబడినది.)

ఈ తాపసుని చూసి నవ్వు వచ్చుచున్నది. మత్తకాశిని కూతురైన వారుణిక అనే ఒక రంకులాడిపై ఆశతో ఉన్నాడని విన్నాను. మరి ఇప్పుడిలా గాభరా పడుతున్నట్టుగా ఉన్నాడు. ఈతని వినయప్రచారపుస్తకాన్ని తెరిచి చూస్తాను.

అహో పవిత్రక, కిమిదముష్ణస్థలీకూర్మలీలయా స్థీయతే | కిం బ్రవీషి – “రాజమార్గే సులభమవిదితజనసంస్పర్శం పరిహరామి” ఇతి | అఘో, అవిజ్ఞాతజనసంస్పర్శో నామ పరిహ్రియతే భవతా | వారుణీజఘనపాత్రం జాహ్నవీ తీర్థమివ పరమపవిత్రం నను | కిం బ్రవీషి – “నైతదస్తి” ఇతి | కిమిదం గోపాలకులే తక్రవిక్రయః క్రియతే |

కితవేష్వపి నామ కైతవమారభ్యతే | కిం బ్రవీషి – “సాధు మర్షయతు భవాన్ నిపుణః ఖలు తే చారః “ ఇతి | కస్య చారః ? కుతశ్చారః ? న సూర్యో దీపేనాంధకారం ప్రవిశతి | నహి మే చారకృత్యమస్తి | సహస్రచక్షుషో హి వయమీదృశేషు ప్రయోజనేషు | తదపనయ శఠప్రచారకంచుకమ్ | ఆకృతిమాత్రభద్రకో భవాన్ మిథ్యాచారవినీతోహ్యసి | అఘో సజ్జనసబ్రహ్మచారిన్ విటపారశవ. చౌక్షపిశాచో వేశ్యాప్రసంగశ్చేతి ఆచారవిరుద్ధమేతత్ విరుద్ధాశనమివ మాం ప్రతిభాతి | అపి చ చౌక్షోపచారయంత్రితః తాముపగృహ్ణన్ సందంశేన నవమాలికామపచినోషి | కిం బ్రవీషి – “సర్వథా నివృత్తోऽస్మి విభ్రమాత్” ఇతి | పాయసోపవాసమివ క ఏతత్ శ్రధాస్యతి | కిం బ్రవీషి – యద్యేవం సుప్రసన్నోసి శిష్యత్వే నిష్పాదయతు మా భవాన్” ఇతి | దిష్ట్యా భవాన్ సత్పథమారూఢః | యది చ విటత్వే కృతో నిశ్చయః శీఘ్రమేవ వేశయువతిప్రణయపరిఘభూతమిథ్యాచారకంచుకముద్ఘాట్యతామ్ | ఘుష్యతాం విటశబ్దః | కిమాహ భవాన్ – “ప్రణతోऽస్మి” ఇతి | హన్తేऽదానీం దత్తః ప్రదేయకః స్వైరమయన్త్రితశ్చాచారః | అయమిదానీమాశీర్వాదః -

అహో పవిత్రక. ఈ ఎండలో ఇసుకపైన తాబేలులా నిలబడ్డావు? ఏమంటావు – “రాజమార్గంలో తెలిసిన వాళ్ళనుండి తప్పుకుందుకు” అనియా? అహో, పవిత్రజనసంస్పర్శను పరిహరిస్తున్నట్టుంది నీ వాలకం. వారుణీజఘనపాత్రం గంగాతీరంలా పవిత్రం కాదోయి. ఏమంటావు – “అదేమీ లేద”నా? యాదవుల ఇళ్ళకు పాలమ్ముట ఏల?

(ఉష్ణస్థలీకూర్మలీలా – తాబేలు తన శరీరాన్ని ఎండబెట్టుకుందుకు గట్టు మీద ఇసుకపైకి వచ్చి తన తలను, శరీరాంగాలను, లోపలికి, బయటకు జరుపుతూ వేడి పుట్టించుకుంటుందట. అలా ఈ బ్రాహ్మణుడు తన తువాలును ముడవడమూ, సాగతీయడమూ చేస్తున్నాడని ఎగతాళి)

ధూర్తులతో ధూర్తత చూపటం వద్దు. ఏమంటావు – “చాలు బాబు, నీ చారత్వం గొప్పది. నన్నిలా వదిలేయి” అనియా? ఎవని చారత్వం? ఎక్కడి చారత్వం? సూర్యుడు దీపాన్నుంచుకుని చీకట్లోకి వెళ్ళడు. నాకు అలా వెనకల దారుల్లేవు. ఈ వ్యవహారాల్లో నేను వేయికళ్ళవాణ్ణి. నీ ధూర్తప్రచారం చేసే వేషాలు విడిచిపెట్టు. ఆకారం తో మటుకు నీవు పవిత్రమైన వాడివి. మిగతావన్నీ మిథ్యాచారాలే. అరే, సజ్జనసహాధ్యాయి విటుడా, శుద్ధత్వము, వేశ్యాప్రసంగమూ పరస్పరవిరుద్ధాలు.శుద్ధత్వాన్నితీసుకుని సందేశాలతో నవమాలిక కూరుస్తున్నావు. ఏమంటావు – “ఇవన్నీ వదిలేశానిప్పుడు” అనియా? పాయసోऽపవాసం వంటి ఈ విషయాన్ని ఎవడు విశ్వసిస్తాడు? ఏమంటావు – “ ఈ విషయంలో కాస్త నా మీద దయతలిస్తే నన్ను మీ శిష్యునిగా చేసుకోండి” అనియా. ఆహా, సన్మార్గం లోకి వచ్చినందుకు శుభాకాంక్షలు. విటత్వం మీద నిశ్చయుడైతే త్వరగా వేశ్యలప్రణయానికి అడ్డంకి అయినా నీ మిథ్యాచారసహితమైన దుస్తులు వీడుము. విటత్వాన్ని ప్రేమించు. ఏమన్నావు – “నమస్కరిస్తున్నాను” అనియా? హా. ఇప్పుడు నీ విశృంఖలాచారమునిచ్చావుగా. ఇదిగో కొనుమాశీర్వాదము -

ఆక్షిప్తస్రస్తవస్త్రాం ప్రశిథిలరశనాం ముక్తనీవీం విహస్తాం

హస్తవ్యత్యాసగుప్తస్తనవివరవళీమధ్యనాభిప్రదేశామ్ |

లజ్జాలీనోపవిష్టాం నహి నహి విసృజేత్యేవమాక్రన్దమానాం

శయ్యామారోప్య కాన్తాం సురదసముదయస్యాగ్రసస్యం గృహాణ ||

కిం బ్రవీషి – “ఉపస్కారితం శ్రేయః, చికిత్సితోऽస్మి” ఇతి | యద్యేవమాచార్యదక్షిణేదానీమేష్టవ్యా | కిం బ్రవీషి – “నన్వయమంజలిః” ఇతి | భో నన్వయమతివ్యయః | భవతు | ఇదానీం నిష్పన్నశిష్యాః స్మో వయమ్ | భవానిదానీమాచార్యో న శిష్యః | సగర్వం స్వైరమయన్త్రితశ్చర | సాధయామ్యహమ్ | (పరిక్రమ్య)

ఆక్షిప్తస్రస్తవస్త్రాం = తొలగించబడిన అస్తవ్యస్తమైన వస్త్రములు కలదానిని, ప్రశిథిల రశనాం = బాగా శిథిలమైన మొలనూలుకలిగినదానిని, ముక్తనీవీం =వీడిన పోకముడిదానిని, విహస్తాం = విడివడిన చేతులదానిని, హస్తవ్యత్యాస గుప్తస్తన వివర వళీమధ్య నాభిప్రదేశాం = కుడి స్తనముపై ఎడమయరచేతిని, ఎడమ స్తనముపై కుడు అరచేతిని కప్పుటవలన నడుమున గల ముడుతలను తెలియబర్చు దానిని, లజ్జాలీన ఉపవిష్టాం = సిగ్గరితనము చేత కూర్చున్నదియు యైన దానిని, నహి నహి విసృజతు ఇవ ఆక్రందమానాం = వద్దు, వదులుమని కేకలుపెట్టుదానిని, సురతసముదయస్యస్యాం = కోరికపుట్టినయట్టిదానిని, కాన్తాం = సుందరిని, శయ్యామారోప్య = పానుపుపై జేర్చి, అగ్రసస్యం గృహాణ = మొదట యనుభవింపుము.

తాత్పర్యము: తొలగించబడిన అస్తవ్యస్తమైన వస్త్రములు కలదానిని, బాగా శిథిలమైన మొలనూలుకలిగినదానిని, వీడిన పోకముడిదానిని, విడివడిన చేతులదానిని, కుడి స్తనముపై ఎడమయరచేతిని, ఎడమ స్తనముపై కుడి యరచేతిని కప్పుటవలన నడుమున గల ముడుతల వివరములను తెలియబర్చు దానిని, సిగ్గరితనము చేత కూర్చున్నదియు యైన దానిని, వద్దు, వదులుమని కేకలుపెట్టుదానిని, కామము తనయందు జనించిన యట్టిదానిని, కాంతను,పానుపుపై జేర్చి, మొదట యనుభవింపుము.

విశేషము: ఏకదేశవివర్తి రూపకము. స్రగ్ధరా,మ్రభ్నైర్యానాం త్రయేణ త్రిముని యతియుతా స్రగ్ధరా కీర్తితేయమ్||

మ ర భ న య య య అనే గణాలతో కూడుకొని ప్రతి ఏడు అక్షరాలకు యతి కలది స్రగ్ధరా వృత్తము

ఏమంటున్నావు – “సహాయాన్ని గుర్తుంచుకుంటాను. చికిత్సుడనైతిని” అనియా. అలాగయితే ఆచార్యదక్షిణ తప్పక తీసుకోవాలి. ఏమంటివి – “ఇదిగోనిదే నమస్కారమ”నియా. ఇదేం ఖరీదైనది కాదు. కానిమ్ము. మేమిలా శిష్యులను సంపాదించుకొనే వారలమేలే. ఇప్పుడు నీవు గురువ్వే కానీ శిష్యుడివి కావు. స్వేచ్ఛగా గర్వంగా తిరుగు. ముందుకు నడచెదను.

(ముందుకు నడిచి)

హీ, హీ సాధు భో నానాకుసుమసమవాయసంపిండితేన వసన్తమధ్యాహ్నస్వేదావతారస్పర్శసుభగేన ప్రతిహరతి ఇవాహం మాల్యాపణప్రాసాదసంబంధవినిఃసృతేన విపణివాయునా నూనముపస్థితోऽస్మి | (పుష్పవీథీం విలోక్య) మూర్తిమతీవ ననాకుసుమసమవాయాంగప్రత్యంగా వసన్తవధూః | ఇయం హి -

పద్మోత్ఫుల్లశ్రీమద్వక్త్రా సితకుసుమముకుళదశనా నవోత్పలలోచనా

రక్తాశోకప్రస్పందోష్ఠీ భ్రమరరుతమధురకథితా వరస్తబకస్తనీ |

పుష్పపీడాలంకారాఢ్యా గ్రథితశుభకుసుమవసనా స్రగుజ్జ్వలమేఖలా

పుష్పన్యస్తం నారీరూపం వహతి ఖలు కుసుమవిపణిర్వసంతకుటుంబినీ ||

ఆహా, బాగు. అనేకానేక పుష్పాల సుగంధాల మిశ్రమంతో వసంతకాలమధ్యాహ్నపు చెమటలను శీతలంగా స్పర్శిస్తూ, మాలలు కడుతున్న అనేక దుకాణాల తాలూకు విపణివాయువులతో నిలబడి ఉన్నాను. (పూలవీధిని చూచి) వసంతవధువు కుసుమాలను అంగప్రత్యంగాలతో అలంకరించుకుని చూడముచ్చటగనున్నది. ఇదేను -

పద్మ ఉత్ఫుల్ల శ్రీమద్వక్త్రా = వికసించిన తామరవలె శోభనమైన ముఖముగలది, సిత కుసుమ ముకుళ దశనా = తెల్లటి మల్లెమొగ్గ వంటి దంతములది, నవ ఉత్పలలోచనా = ఉదయించిననల్లకవుల కనులది, రక్తాऽశోక ప్రస్పన్దోష్టీ = ఎర్రని అశోకపువ్వు వలె భాసించే ప్రశస్తమైన పెదవి కలది, భ్రమర రుత మధుర కథితా = తుమ్మెదల ఝుంకారాల మధురమైన కథలు కలది, వరస్తవక స్తనీ = చక్కనిపుష్పములగుచ్ఛము వంటి స్తనములు గలది, పుష్పాపీడాలంకారాఢ్యా = పూలతో గట్టిగా కట్టిన అలంకారాలు గలది, గ్రథితశుభకుసుమవసనా = వికసించిన శుభకుసుమాల వస్త్రాలు కలది, స్రగుజ్జ్వలమేఖలా = ప్రకాశించు పుష్పమాలావడ్డాణం కలది, వసంతకుటుంబినీ = వసంతమను కుటుంబమునకు చెందినది, కుసుమవిపణిః = పూలబజారు, పుష్పన్యస్తం నారీరూపం = పూలతో కప్పిన స్త్రీరూపమును, వహతి ఖలు = ధరించినది సుమా!

తాత్పర్యము: వికసితపద్మముఖి, కుందరదనా, కలువకన్నులది, రక్తాశోకము వంటి ఎర్రని పెదవులది. తుమ్మెదల ఝుంకారాలనే కథలు కలది, పూలగుఛ్ఛముల స్తనములది, పూలతో గట్టిగా కట్టిన అలంకారాలు గలది, తెల్లని బట్టలుకట్టినది, వసంతకుటుంబమునకు చెందినదై ఈ పూలబజారు పూలతో కప్పిన స్త్రీరూపమును పొందినది సుమా!

విశేషము: మాలా దీపకము. స్రగ్ధర. పూలబజారును, వసంతవధువునూ సమానముగ చమత్కరించుటచేత సమాసోక్తి అలంకారము.

(తరువాయిభాగం వచ్చేవారం)

Download PDF ePub MOBI

Posted in 2014, నవంబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.