palaparthi cover

దెయ్యానికి దెయ్యం

నిద్ర లేస్తూనే పాపకి ఓ అయిడియా వచ్చింది.

తన తెల్ల దుప్పటీని మీద కప్పుకుని నెమ్మదిగా నడుస్తూ వచ్చింది.

ఊ..ఊ..ఊ..

ఊ.. ఊ.. ఊ..

గోడలు పట్టుకుంటూ

దుప్పటి కాళ్ళకి తట్టుకుంటూ

హాల్లోకి

హాల్లోంచి వంటింట్లోకి

దుప్పట్లో నడిచొచ్చింది పాప.

అమ్మ వెనకాలే వచ్చింది నెమ్మదిగా.

నేను దెయ్యాన్ని..

ఊ..ఊ..ఊ..

రెండు దుప్పట్టి చేతులూ పైకి పెట్టి ఊగుతూ అన్నది పాప.

ఊ..ఊ..

ఊ..ఊ..

గుతుక్కుమని మింగేస్తా..

ఊ..ఊ..

పని చేసుకుంటున్న అమ్మ వెనక్కి తిరిగి

ఓ! దెయ్యం! అమ్మో భయం వేస్తోంది! అన్నది.

దుప్పటిలోంచే పాప

హా హా హా!

నేనమ్మా! అన్నది.

అహ్హ హ్హ!!

పాపా?

నేనింకా నిజం దెయ్యం అనుకుని భయపడ్డాను రా! అన్నది అమ్మ.

అమ్మా!

ఇప్పుడు నిజ్జం దెయ్యం వస్తే పాపని చూసి

అమ్మో! ఇది నిజ్జం దెయ్యం! బేరే బెద్ద దెయ్యం! 

అనుకుని బిం పడి పారిఫోతుంది కదమ్మా!

అన్నది పాప ఆనందంగా దుప్పట్లోంచి.

 *

Download PDF ePub MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, నవంబర్, సీరియల్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.