palaparthi cover

చెరువులో చెంబెడు నీళ్ళు

అమ్మ, పాప అమ్మమ్మ,తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. 
పాపకి అమ్మమ్మా వాళ్ళ ఊరికి రావడం అంటే చాలా చాలా ఇష్టం. 
అక్కడైతే
ఆవులుంతాయి
గేదెలుంతాయి
మేకలుంతాయి
కుక్కలుంతాయి
కోడులు ఉంతాయి
ఇంకా గడ్డి కూడా ఉంతుంది
ఇంకా చాలా బెద్ద చెత్తులు,పువ్వులు ఉంతాయి
చెరువు కూడా ఉంతుంది
అందుకని.
వంటింట్లో కత్తిపీట ముందు కూచుని వంకాయలు తరుగుతోంది అమ్మమ్మ.
అమ్మ అంటోంది.
అమ్మమ్మ వింటోంది.
పాప కూడా వింటోంది.
ఇంటికి వచ్చే దారిలో మన​ ఊరి ​ చెరువును చూసానమ్మా.
నీళ్ళన్నీ ఎటుపోయాయో?
ఇది వరకు ఎంత నిండుగా ఉండేదీ?
ఆ చల్లని నీళ్ళు
తామర పూలూ
ఎటుపోయాయోనమ్మా?
అంటూ
ఆ తర్వాత
ఇంకా ఎవిటేవిటో
ఊరి విషయాలు
అమ్మా అమ్మమ్మా
అమ్మామ్మా అమ్మా
మాట్టాడేసుకుం​టూ ఉన్నారు.
ఇంతలో ఒక్కసారిగా గుర్తొచ్చింది ఇద్దరికీ.
ఈ పిల్లేది?
పిల్లేదమ్మా?
పిల్లేదీ?
ఇప్పటిదాకా ఇక్కడే ఉంది.
ఇంతలోనే ఎటుపోయిందమ్మా?
వాళ్లలా వెతుకుతుండగానే వచ్చింది దొడ్లోంచి వచ్చింది పిల్ల.
పెద్ద ఇత్తడి చెంబు నిండా నీళ్ళు మోస్తూ.
కొంచెం వంగి
రెండు చేతులతో అంచులు పట్టుకుని
అతి కష్టంగా నడుస్తూ
నీళ్ళు తొణికిపోయేలా
వంటిల్లంతా మడుగు చేస్తూ
తక్కుతూ
తారుతూ
వస్తోంది.
అయ్యో తల్లీ! ఎందుకే అంత కష్టం?
అన్నది అమ్మమ్మ.
ఎక్కడికీ నీళ్ళన్నీ?
ఇల్లంతా మడుగు చేస్తూ?
చిరాకు పడింది అమ్మ.
​చెరూ​లో పోద్దమని వెల్తున్నాలే​!​​
చెరూలో నీల్లన్నీ పోయాయి చెప్పావు కదా  అంది పాప.    ​
అమ్మ అమ్మమ్మ
హ హ్హ హ్హ అని నవ్వేరు.
మల్లీ మల్లీ మల్లీ మల్లీ
చాలా చాలా చాలా

​చాలా

నీల్లు పో​సామనుకో ​
చెరువు మొత్తం ఫుల్లవుతుంది​!​
తెలీదా?
​అరిచింది  పాప
ఆయాసపడుతూ​

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, నవంబర్, సీరియల్ and tagged , , , , , .

2 Comments

  1. ఇంద్రాణి గారు, మీ ఈ సిరీస్ కొబ్బరి నీళ్ళు తాగుతున్నంత హాయిగా కమ్మగా ఉంది. ప్రతి కథలోనూ మా పాపాయి కనిపిస్తూనే ఉంది. ఈ సిరీస్ అయిన తర్వాత పుస్తకం ప్రచురించగలిగితే మంచిది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.