cover

ముందుమాట – డిసెంబర్ 2014 సంచిక

Download DECEMBER 2014 Total Issue as PDF

డిసెంబరు 2014

ఈ సంచికతో ఏడాది పూర్తవుతోంది. పత్రిక మొదలుపెట్టినపుడు మా ఉద్దేశాలు: కొత్త గొంతులకు చోటివ్వాలని, మారిపోతున్న వెబ్ ప్రపంచానికి తగ్గట్టు ప్రెజెంటేషన్ లో కూడా అనువుగా ఆధునికంగా కనపడాలని, రచయితకున్న పేరూ నిబద్ధతా లాంటి ఇతరేతరాలు రచన ఎంపికను ప్రభావితం చేయకుండా ఉండాలని, వేర్వేరు భాషల సాహిత్యం తెలుగువైపుకు వచ్చేటట్టుగా తలుపులు తీసి ఉంచాలని. అనుకున్నవాటిలో కొన్ని నెరవేరాయి, కొన్నింటి విషయంలో చాలా ప్రయత్నం మిగిలివుంది. మరిన్ని ఆకాంక్షల్ని ముందుంచుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. మంచి రచనలు పంపి పత్రిక ఇలా నిలబడేందుకు సహకరించిన రచయితలకు కృతజ్ఞతలతో, డిసెంబరు సంచికకు స్వాగతం.

కథలు:

> కుప్పిలి పద్మ – ‘అజేయ’

> గోపి గారపాటి – అనంతం

> ఆనంద్ గుర్రం – తెల్లారొద్దు…

> పూర్ణిమ తమ్మిరెడ్డి – #witchORbitch

> కనక ప్రసాద్ – ఐ డోంట్ మి

కవితలు:

> వంశీధర్ రెడ్డి – ఏం చేయగలం

> నరేష్ నున్నా – అభావప్రాప్తి

మ్యూజింగ్స్:

> పూడూరి రాజిరెడ్డి – నా పదకొండు రోజుల మార్కెటింగ్ అనుభవాలు

> మానస చామర్తి – సాంధ్యరాగం

> ఇంద్రాణి పాలపర్తి – చిట్టి చిట్టి మిరియాలు:-

అల్మరా అందుతుంది

జ్.. జ్.. సిగ్నల్ పోయింది

5 డేస్ తర్వాత

self నెత్తిన పాలు

> శ్రీశాంతి దుగ్గిరాల – పెళ్ళిపందిరి

పాట:

> కనక ప్రసాద్/ శ్రీ విద్య బదరీ నారాయణన్ – కళ్యాణ వసంతం వర్ణం

సీరియల్:

> చిత్తర్వు మధు – నీలీ – ఆకుపచ్చ (1, 2, 3)

> ఆచార్య మహాసముద్రం దేవకి – ఇర్లచెంగికథలు:-

మా నాయినేసే పామ్మంత్రం

పల్లి పాటల తల్లి – వల్లి

> రవి ఇ.ఎన్.వి – పద్మ ప్రాభృతకమ్ (8, 9, 10, 11)

> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ (27, 28, 29)

అనువాదం:

> ఇంటర్‌సెక్షన్ – వెంకట్ సిద్ధారెడ్డి (లియు యీ-చాంగ్ కథకు)

వ్యాసం/ ఫీచర్:

> కనక ప్రసాద్ – అజాత

> అదొక బెరుముడా ట్రయాంగిల్ – శ్రీరమణ

> రాజధానిలో రోజర్ – పూర్ణిమ తమ్మిరెడ్డి

> నాకు ఈ ఏడాది నచ్చిన పుస్తకం (ఈ ఏడాది చదివిన పుస్తకాల్లో తమకు నచ్చిన పుస్తకం గురించి కొందరు రచయితలు, పాఠకులు.)

సమీక్షలు:

> కోసూరి ఉమాభారతి “ఎగిరేపావురమా” పై – కొల్లూరి సోమశంకర్

ఇవిగాక:

> కొత్తపుస్తకాలు వగైరా.

కినిగె పత్రిక్కి రాయండి *

Download DECEMBER 2014 Total Issue as PDF

Posted in 2014, డిసెంబర్, ముందుమాట.

One Comment

 1. కినిగె పత్రికకు ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కినిగె అంతర్జాల పత్రిక ద్వారా తెలుగు సాహితీ ప్రపంచంలో అద్బుతాలు, మాయాజాలాలు, హరివిల్లుల వొరవడిని సృష్టిస్తున్న కినిగె పత్రిక రచయితలు, పాఠక దేవుళ్లకు కృతజ్ఞతలు, అభినందనలు. యీ ఆనందం ఇలా కలకాలం కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము. యీ సందర్భంలో మరుపురాని కొన్ని శీర్షికలను స్మరించాలనిపిస్తున్నది.

  కథలు శీర్షిక : స.వెం. రమేశ్ గారి “కతల గంప”; డా. వంశీధర్ రెడ్డి గారి “కీమో“, “జిందగి”; శిరిష్ ఆదిత్య గారి “అస్తిత్వం”; పూడూరి రాజిరెడ్డి గారి “రెక్కల పెళ్లాం”; రమా సుందరి గారి “చూపు”; మధు పెమ్మరాజు గారి “డోరాదార్”; కనక ప్రసాద్ గారి “చెక్కా వారి పెండ్లి పిలుపు”; కాశీభట్ల వేణుగోపాల్ గారి “ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ”; వై. విశారద గారి “తరళ మేఘచ్ఛాయ, తర్వాతి ఎడారి” , నరేష్ నున్నా గారి మొపాసా కధలు, అవినేని భాస్కర్ గారి తమిళ అనువాద కధలు

  ఇంటర్వ్యూలు శీర్షిక : శ్రీరమణ, కాశీభట్ల వేణుగోపాల్, తల్లావజ్ఝల శివాజీ, హెచ్చార్కె, రమణజీవి గార్లతో మెహర్ గారు చేసిన ఇంటర్వ్యూలు

  పుస్తక సమీక్ష శీర్షిక : “మూలింటామె గురించీ, నామిని గురించీ…” మెహెర్; “తెగిపడిన ఆ చెయ్యి’ మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంది” రమా సుందరి; “ఇతని ఆగ్రహానికి ఒక ధర్మం ఉంది. ఈ యుద్ధానికి ఒక అనివార్యత ఉంది” రమా సుందరి; పాలపర్తి ఇంద్రాణి నవలిక “ఱ” ~ చావు నెపంతో జీవితాన్ని తడిమే “ఱ”~ మెహెర్; “ప్రపంచాన్ని మమేకం చేసిన ఏకాంతం” శిరీష్ ఆదిత్య.

  కవితలు శీర్షిక : “ఎవరెవరు” బివివి ప్రసాద్; “మానుషం”, “అమ్మ చేతి ముద్ద” గోపి గారపాటి; గాలి నాసరరెడ్డి హైకూలు; “అంతిమ మంతనం” నామాడి శ్రీధర్;

  M..S. నాయుడు గారి ‘ఒక వెళ్ళిపోతాను’ కవిత సంపుటి “అస్పర్శ”; కధల పరిచయం “అజాత” కనక ప్రసాద్; బుచ్చిబాబు రచనల్లో కనిపించే ‘జీవనకళ ‘ డా. రాయదుర్గం విజయలక్ష్మి; ప్రముఖ ఉర్దూ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌, ప్రేమకథ ‘జమీల్యా’ దుగ్గిరాల శ్రీశాంతి

  మ్యూజింగ్స్ శీర్షిక : “అనుకోకుండా” బండ్లమూడి స్వాతి కుమారి, ‘సప్త’స్వర వినోదం శీర్షిక : ఇశైతట్టు గారు.
  కినిగె పత్రికలో రచనలు చేసిన వారందరికీ మరొక్క సారి నెనర్లు. హార్దిక అభినందనలు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.