cover

నవంబర్ నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు

నవంబర్ నెల ‘సప్త’స్వర వినోదానికి ఇద్దరు జవాబులు చెప్పారు. అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులు ఇక్కడ ఇస్తున్నాం.

1.
ఎందుకీ సందెగాలి
సందెగాలి తేలి మురళి
తొందర తొందరలాయే…
విందులు విందులు చేసే…
చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా (1968)
2.
అందెను నేడే అందని జాబిల్లీ
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
చిత్రం: ఆత్మగౌరవం (1965)
3.
సన్నజాజి సొగసుంది
జున్నులాంటి వయసుంది
నిన్ను చూస్తే కరిగిపోయే
వెన్నలాంటి మనసుంది.
ఇంతకు మించి ఏమి లేదురా బావా
ఈ బతుకే ఇంక నీదిరా
చిత్రం: కాలం మారింది (1972)
4.
కన్నె వధువుగా మారేదీ
జీవితంలో ఒకేసారి
ఆ… వధువు వలపే విరిసేది
ఈనాడే తొలిసారి
అందుకే… అందుకే… తొలిరేయి
అంత హాయి… అంత హాయి

చిత్రం: శారద (1973)

5.

మల్లెకన్న తెల్లనా మా సీత సొగసు
వెన్నెలంత చల్లన మా సీత సొగసు
ఏదీ.. ఏదీ.. ఏదీ..
తేనె కన్న తీయన మా బావ మనసు
తెలుగంత కమ్మన మా బావ మనసు
చిత్రం: ఓసీతకథ (1974)
పాట ఈ లింక్‌లో వినవచ్చు.
6.
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మది నిండా నీవె ఉంటే
ఒక మాటైనా రాకుంటే –
చిత్రం: చిన్ననాటి కలలు (1975)
7.
పచ్చ పచ్చని చిలకా
ఓ చిలకా… పంచ వన్నెల చిలకా
చల్ల చల్లని వేళ మెల్ల మెల్లగ చేర
రావేమె నా రామచిలక
చిత్రం: కలిసొచ్చిన అదృష్టం (1968)
 పాట ఈ లింక్‌లో వినవచ్చు.
అంతఃసూత్రం: ఈ పాటలున్న చిత్రాలన్నిటికీ దర్శకుడు కె. విశ్వనాథ్ కావడం.

*

అన్నిటికీ సరైన జవాబులు పంపినవారు బి. బాలసుబ్రహ్మణ్యం, రాధ మండువ.

ఈ శీర్షికను ఇంతటితో ముగిస్తున్నాము. ఇన్నివారాల పాటు ఈ శీర్షిక విజయవంతంగా నడవటానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు.

Posted in 2014, డిసెంబర్, స్వరం and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.