palaparthi cover

జ్.. జ్.. సిగ్నల్ పోయింది

అమ్మ గంటనించీ పిలుస్తోంది పాపని.
స్నానానికి పదమని.
ఆటలాడుతోంది పాప.
ఎన్నిసార్లు పిలిచినా
ఆకుంతున్నాను!
ఇప్పుడే వస్తా!
అంటోంది గానీ రానే రావడం లేదు.
అమ్మ అలా పిలుస్తూ ఉండగానే
రెండు వైపులా తెరిచి ఉన్న అట్ట పెట్టెని మోసుకుంటూ వంటింట్లోకి వచ్చింది.
అందులో పడుకుని దూరిపోయి తల బయటపెట్టి
నేను ఇప్పుడు తీవీలో నూస్ మాన్ ని!
నా దగ్గర చాలా చాలా చాలా నూస్ ఉంది!
తెలుసా?
అన్నది.
అహా! ఏవిటో నూసు? అంది అమ్మ.
మొన్న అక్కడ చాల పెద్ద మంతలు వచ్చాయి.
అప్పుడు ఫైర్ మాన్ వాల్లు వచ్చారు.
మల్లీ..
ఇంకా బేరే చోత పెద్ద వానలు వచ్చాయి.
అప్పుడు చెత్తులన్నీ కింద పప్పోయాయి.
మల్లీ..
బేరే చోత బెద్ద రైలు పక్కకి పప్పోయింది.
అప్పుడు అందరూ హాస్పితల్ కి వెల్లారు.
ఆ.. మల్లీ..
ఇంకో చోత..
ఆ..
ఆ మల్లీ..
జ్.. జ్ జ్..
జ్ జ్…
అయిపోయాయా తమరి న్యూసులు?
ఇంక స్నానానికి దయ చేయండి
అన్నది అమ్మ విసుగ్గా.
జ్.. జ్ జ్..
జ్ జ్…
జ్ జ్ ఏవిటి నీ మొహం?
ఆటలు చాలు.
పద ఇంక
అంది అమ్మ అసహనం ప్రదర్శిస్తూ.
ఇంకా

చాలా చాలా చాలా

నూస్ ఉంది.
తీవీ సిగ్ నల్ పోయింది.

తెలీదా?

అంది పాప కోపంగా.
 *

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, డిసెంబర్, సీరియల్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.