cover

పదనిష్పాదన కళ (27)

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

II పట్టణసంబంధి పదాలు

౧. ఊరు

పట్టణం – పూ, పురి, నగరి, పుటభేదనం

పేట – నిగమం

శాఖానగరం – ప్రధాన నగరానికి దగ్గర్లో దాని కంటే వేఱుగా ఏర్పడ్డ చిన్నపట్టణం Satellite township

వేశ్యలుండే పేట – వేశం

దుకాణం (కొట్టు) – ఆపణం, నిషద్య shop

అంగడివీథి – విపణి Market, downtown

ఊళ్ళోని మార్గం – రథ్య, ప్రతోళి, విశిఖ

మార్గం – అయనం, వర్త్మ, అధ్వం (అధ్వన్), పంథా, పదవి, సృతి, సరణి, పద్ధతి, పద్య, వర్తని, ఏకపది

బాగా లేని దారి – వ్యధ్వం, దురధ్వం, విపథం, కదధ్వం, కాపథం

నాలుగుదార్లు కలిసే కూడలి – శృంగాటకం , చతుష్పథం Crossroads

ఊళ్ళోని ప్రధాన రాజమార్గం – ఘంటాపథం Thoroughfare

సభాగృహం – శాల Town assembly

సభ – సమజ్య, పరిషత్తు (ద్), గోష్ఠి, సమితి, సంసద (ద్), ఆస్థాని, ఆస్థానం, సదం (స్)

సభికుడు – సభ్యుడు, సభాస్తారుడు, సదస్యుడు

మండువా ఇల్లు (చుట్టూ గదులుండి వాటి మధ్యలో ఖాళీస్థలమున్న భవనం) – చతుశ్శాల

మునులు కట్టుకునే ఆకుటిల్లు – పర్ణశాల, ఉటజం hermitage

బౌద్ధాలయం – చైత్యం, ఆయతనం

గుఱ్ఱాల శాల – అశ్వశాల, మందుర stables

ఎంజినీరింగ్ వృత్తులు చేసేవారి పనుల కొట్టం (Work shop) – ఆవేశనం, శిల్పిశాల

చలివేంద్రం – ప్రప, పానీయశాల

మద్యం తయారుచేసి అమ్మే కొట్టు – గంజ, మదిరాగృహం tavern

పురుటిల్లు – అరిష్టం, సూతికాగృహం labour room

పదిమంది గుమిగూడి వేడుకలు నిర్వహించే భవనం – మండపం

దేవతల/రాజుల భవనం – ప్రాసాదం mansion

రాజభవనం – సౌధం, ఉపకార్య, ఉపకారిక

అంతఃపురం – స్త్ర్యగారం, అవరోధనం, అవరోధం, శుద్ధాంతం seraglio or harem

ధనికుల భవనం – హర్మ్యం A castle

పల్లెటూరు – గ్రామం, సంవసథం

శివారుప్రాంతం – ఉపశల్యం suburb

గొల్లపల్లె – ఘోషం, ఆభీరపల్లి

బోయవారి పల్లె – పక్కణం

పొలిమేర, (గ్రామపు) సరిహద్దు – సీమ (సీమన్)

౨. ఇల్లు

ఇల్లు – గృహం, గేహం, ఉదవసితం, వేశ్మం (వేశ్మన్), సద్మం (సద్మన్), నికేతనం, నిశాంతం, వస్త్యం, సదనం, భవనం, అగారం, మందిరం, నికాయ్యం, నిలయం, ఆలయం, ధిష్ణ్యం, ఓకం (ఓకస్/ఓకో), నివసనం, స్థానం, అవసథం, వాస్తు, సంస్త్యాయం, ఉటజం, ధామ, నివేశం, నివేశనం, శరణం, క్షయం

ఇల్లు కట్టదగ్గ చోటు – వేశ్మభూమి

గోడ – భిత్తి, కుడ్యం

ఇటుక – ఇష్టిక

సున్నం – చూర్ణం

కప్పు – ఛది, పటలం

గచ్చు (కట్టిన నేల) – కుట్టిమం, స్థండిలం

కిటికీ – వాతాయనం, గవాక్షం

ద్వారం – ప్రతీహారం

కడప – దేహళి

అరుగు/ తిన్నె – వితర్ది, వేదిక

తలుపు – కవాటం, అరరం

గడియ – విష్కంభం, అర్గళం

మెట్టు (తాప) – ఆరోహణం, సోపానం

ఇంటిముందటి నడవ (Corridor) – ప్రఘాణం, ప్రఘణం, అళిందం

౩. ఇంటిలోని వస్తువులు

నిచ్చెన – నిశ్రేణి

చీపురు – సమ్మార్జని, శోధని

మంచం – పర్యంకం, తల్పం, ఖట్వ

పడక – శయ్య

పఱుపు – శయనీయం

దిండు (తలగడ) – ఉపధానం, ఉపబర్హం

బంతి – కందుకం, గేందుకం

దీపం – ప్రదీపం

కుర్చీ – పీఠం, ఆసనం

తమ్మపడిగ (ఉమ్మివేసే తొట్టి) – ప్రతిగ్రాహం, పతద్గ్రహం

దువ్వెన – కంకతిక, ప్రసాధని

అద్దం – ముకురం, దర్పణం, ఆదర్శం

విసనకఱ్ఱ – వ్యజనం, తాళవృంతకం, ధవిత్రం

కుండ – స్థాళి, ఉఖ, కుంభం, పిఠరం

ఊయల – డోల, ప్రేంఖ

రోకలి – అయోగ్రం, ముసలం

ఱోలు – ఉదూఖలం, ఉలూఖలం

చేట – ప్రస్ఫోటన, శూర్పం

జల్లెడ – చాలని, తితఉవు

గంప – కండోలం, పిటం

బుట్ట – స్యూతం, ప్రసేవం

చాప – కటం, కిలింజకం

వంటిల్లు – రసవతి, పాకస్థానం, మహానసం

పొయ్యి – అశ్మంతం, ఉద్ధానం, అధిశ్రయణి, అంతిక

కుంపటి – అంగారధాని, అంగారశకటి, హసంతి

బాణలి (బూర్లెమూకుడు) – భ్రాష్ట్రం, ఋజీషం

పెనం – కందువు, స్వేదని

నీళ్ళు కాచుకునే కాగు (డేక్సా) – అళింజరం, మణికం

నీళ్ళ కుండ – ఘటం, కుటం, నిపం

మూకుడు – శరావం

గిన్నె – కంసం

గరిటె (గంటె/ తెడ్డు) – దర్వి, కంబి, ఖజాక

కవ్వం – వైశాఖం, మంథం, మంథానం

త్రాడు – శుల్బం, వటారకం, వటి, రజ్జువు

ఉద్ఘాటనం – బావిలోంచి గానీ, చెఱువులోంచి గానీ నీళ్ళు తోడే ఏతాము లేదా గిలకలాంటి సాధనం

పెట్టె – పేటకం, పేట, మంజూష

చిన్నపెట్టె – పేటిక

చెప్పు – పాదుక, ఉపానహం (ఉపానత్), పాదువ

నవ్వారు – నధ్రి, వర్ధ్రి, వరత్ర

కత్తెర – కృపాణి, కర్తరి

కప్పు లేదా గ్లాసు – చషకం, సరకం

చిన్నపీట – పీఠిక

III. వ్యావసాయిక పదాలు

౧. పొలం

పొలం – క్షేత్రం

వఱి పండే నేల – కేదారం

రైతు – క్షేత్రాజీవుడు, కర్షకుడు, కృషీవలుడు, హాలికుడు

నాగలి – హలం, గోదారణం, సీరం

పశువుల కొట్టం – గోష్ఠం, గోస్థానకం

౨. పంటలు

వఱి – వ్రీహి

బియ్యం – తండులాలు

యవలు – శితశూకాలు

ఆళ్ళు – కోరదూషాలు, కోద్రవాలు

అడవిపెసలు – మకుష్టకాలు, మయుష్టకాలు, వనముద్గాలు

ఆవాలు – సర్షపాలు

నల్ల ఆవాలు – రాజిక, కృష్ణిక, ఆసురి

గోధుమలు – గోధూమాలు, సుమనాలు

అడవిగోధుమలు – గవేధువు, గవేధుక

కాఱుమినుములు – యావకాలు, కుల్మాషాలు

సెనగలు – చణకాలు, హరిమంథకాలు

కొఱ్ఱలు – కంగువులు, ప్రియంగువులు

జనుము – భంగ, మాతులాని

ధాన్యం – వ్రీహి, స్తంబకరి

ధాన్యపు ముల్లు – కింశారువు

ధాన్యపు పొత్తు (కండె) – కణిశం

అఱవై రోజులకు పండే ధాన్యాలు – షష్టికాలు

తృణధాన్యాలు – నీవారాలు

తింత్రిణీకం – చింతపండు

మిరియాలు – వేల్లజం, మరీచం, కోలకం, కృష్ణం, ఊషణం

జీలకఱ్ఱ – జీరకం, జీరణం, అజాజి, కణా

నల్లజీలకఱ్ఱ – సుషవి, కారవి, పృథ్వి, పృథువు, కాలోపకుంచిక

అల్లం – ఆర్ద్రకం, శృంగబేరం

కొత్తిమెర/ ధనియాలు – ఛత్ర, వితున్నకం, కుస్తుంబురువు, ధాన్యాకం

శొంఠి – శుంఠి, మహౌషధం, విశ్వం, నాగరం, విశ్వభేషజం

ఇంగువ – హింగువు, సహస్రవేది, జతుకం, బాహ్లికం, రామఠం

పసుపు – కాంచని, పీత, హరిద్ర, వరవర్ణిని

సముద్రపుటుప్పు – లవణం, అక్షీబం, వశిరం

సైంధవ లవణం – శీతశివం, మాణిబంధం

పంచదార (చక్కెర) – శర్కర, సిత

జున్ను – కూర్చిక

పేలాలు – లాజలు

అటుకులు – పృథుకాలు, చిపిటకాలు

ఏలక్కాయలు (ఏలకులు) – ఏల, ఏలకి, పృథ్వీక, చంద్రబాల, నిష్కుటి, బహుళ,

సన్న ఏలకులు – సూక్ష్మోపకుంచిక, తుత్థ, కోరంగి, త్రిపుట, త్రుటి

మాచిపత్రి – గ్రంథిపర్ణం, శుకం, బర్హం, స్థౌణేయం, కుక్కురం

నువ్వులు – తిలలు

౩. పూల చెట్లు

పొన్న – పున్నాగం, కేసరం, దేవవల్లభం

పారిజాతం – పారిభద్రం

మోదుగు – పలాశం, కింశుకం, పర్ణం, వాతపోథం

ఇప్ప – మధూకం, మధుద్రుమం, గుడపుష్పం, వానప్రస్థం, మధుష్ఠీవం

ఎఱ్ఱగన్నేరు – నిచుళం, హిజ్జలం

దిరిసెన – శిరీషం, కపీతనం, భండిలం

సంపెంగ – చంపకం, చాంపేయం, హేమపుష్పకం

మల్లె – మల్లిక, భూపది

అడవిమల్లె – ఆస్ఫోట

జాజి – జాతి, సుమనసం (సుమనస్), మాలతి

విరజాజి – సప్తల, నవమాలిక

మంకెన – రక్తకం, బంధూకం

పెద్దగోరింట – అమ్లానం, మహాసహ

చిన్నగోరింట – సహ, కుమారి, తరణి

దాసాని – ఉడుపుష్పం, జప

గన్నేరు – కరవీరం, ప్రతిహాసం, శతప్రాసం, చండాతం, హయమారకం

ఉమ్మెత్త – మదనం, మాతులం, ధుత్తూరం, కితవం, ధూర్తం, కనకం

మరువం – మరువకం, సమీరణం, ప్రస్థపుష్పం, ఫణిర్జకం

తక్కువ ఎఱుపూ, ఎక్కువ సుగంధమూ గల కలువపూవు – సౌగంధికం, కహ్లారం (కల్హార)

ఎక్కువ ఎఱ్ఱగా ఉండే చెంగలువ – హల్లకం, రక్తసంధ్యకం

కలువకూ, పద్మానికీ సామాన్యవాచకాలు = ఉత్పలం, కువలయం

నల్లకలువ – ఇందీవరం

తెల్లకలువ – కుముదం, కైరవం

తెల్లకలువతీగె – కుముదిని, కుముద్వతి

తామరపూవు – తామరసం, పద్మం, నళినం, అరవిందం, మహోత్పలం, సహస్రపత్రం, శతపత్రం, కమలం, కుశేశయం, పంకేరుహం, సారసం, సరసీరుహం, బిసప్రసూనం, రాజీవం, పుష్కరం, అంభోరుహం

తెల్లతామర – పుండరీకం

ఎఱ్ఱతామర – రక్తోత్పలం, కోకనదం

తామరతూడు – బిసం, మృణాళం, నళిని, పద్మిని

జలపుష్పాల దుంప – శాలూకం

౪. పండ్లూ, కూరగాయలూ

రావి – అశ్వత్థం, బోధిద్రుమం, పిప్పలం

వెలగ – కపిత్థం, దదిత్థం, గ్రాహి, మన్మథం

మేడి (అత్తి) – ఉదుంబరం, యజ్ఞాంగం, హేమదుగ్ధం

మునగ – శోభాంజనం, శిగ్రువు

మామిడి – ఆమ్రం, చూతం, రసాలం, సహకారం

రేగు – కర్కంధువ, బదరం, బదరి, కోలం, కోలి, ఘోంట, సౌవీరం

నారింజ – ఐరావతం, నాగరంగం

చింత – తింత్రిణి, చించ, అమ్లిక

జీడి – వీరవృక్షం, అరుష్కరం, అగ్నిముఖి, భల్లాతకి

ఉసిరి – ఆమలకి, తిష్యఫల, అమృత, వయస్థ

రాచ ఉసిరి (నేల ఉసిరి) – ఝట, తామలకి

పనస – పణసం, కంటకిఫలం

పొగడ – వకుళం

దానిమ్మ – దాడిమం

మాదీఫలం – ఫలపూరం, బీజపూరం, రుచకం, మాతులుంగం

ద్రాక్ష – మృద్వీక, గోస్తని, స్వాద్వి, మధురస

అరటి – కదళి, మోచ, రంభ, అంశుమత్ఫల, వారణబుస, కాష్ఠీల

పొట్ల – పటోలిక, జాలిక, జ్యోత్స్ని

తమలపాకు తీగె – తాంబూలవల్లి, తాంబూలి, నాగవల్లి

లవంగపు – త్వక్పత్రం, ఉత్కటం, భృంగం, త్వచం, చోదం, వరాంగకం

తాడి – తృణరాజం, తాళం

కొబ్బరి – నాళికేరం, లాంగలి (లాంగలిన్)

పోక – ఘోంట, పూగం, క్రముకం, గువాకం, ఖపురం

ఖర్జూరం – ఖర్జూరం

ఈత – ఖర్జూరి

నిమ్మ – జంబీరం, దంతశఠం, జంభం, జంభళం

గజనిమ్మ – లకుచం, లికుచం, డహువు

నేరేడు – జంబూఫలం

పొన్నగంటి కూర – బ్రాహ్మి, మత్స్యాక్షి, వయస్థ, సోమవల్లరి

దొండ – తుండికేరి, బింబిక, బింబం, రక్తఫల, పీలుపర్ణి

పాలకూర – జీవంతి, జీవని, జీవ, జీవనీయ, మధుస్రవ

ఎఱ్ఱ నీరుల్లి – పలాండువు, సుకందం

పచ్చని నీరుల్లి – లతార్కం, దుర్ద్రుమం

వెల్లుల్లి – మహౌషధం, మహాకందం, లశునం, గృంజనం, రసోనకం

కాకర – కారవేల్లం, కటిల్లకం

చేదుపొట్ల – కులకం, పటోలం, తిక్తకం, పటువు

గుమ్మడి – కూష్మాండం, కర్కారువు

దోస – ఉర్వారువు, కర్కటి

సొర (ఆనపకాయ) – తుంబి, అలాబువ

చేదుసొర – ఇక్ష్వాకువు, కటుతుంబి

కంద – కందం, అర్శోఘ్నం, సూరణం

తీగెబచ్చలి – కలంబి

దుంపబచ్చలి – ఉపోదకి

వంగ – వార్తాకం

చెఱకు – ఇక్షువు, పుండ్రకం, కాంతారకం

IV మనుషులూ, వావివరుసలూ, వృత్తులూ, స్థితులూ, మనస్తత్త్వాలూ

౧. మనుషులు

మనుషులు – మానవులు, మనుష్యులు, మనుజులు, మర్త్యులు, నరులు, విశులు

గుంపు – సమూహం, నివహం, వ్యూహం, సందోహం, విసరం, వ్రజం, స్తోమం, ఓఘం, నికరం, వ్రాతం, వారం, సంఘాతం, సంచయం, సమవాయం, చయం, సంచయం, గణం, సంహతి, బృందం, నికురుంబం, కదంబకం, పూగం, వితానం, ప్రకరం, మండలం, చక్రం, చక్రవాళం, పటలం, జాలం, వర్గం, కులం, శ్రేణి, సమాజం, సంఘం, నికాయం, రాశి, కూటం, సమాహారం, పుంజం, ఉత్కరం

మగవాడు – పురుషుడు, పూరుషుడు, నరుడు, పుంసుడు, పుమానుడు పుమాంసుడు, పంచజనుడు

ఆడది – స్త్రీ, మహిళ, నారి, వనిత, అబల, అంగన, యోషిత్తు (యోషిత్), యోషిత, వధువు, సీమంతిని, వామ, ప్రతీపదర్శిని, కామిని, కాంత, ప్రమద, మానిని, లలన, నితంబిని, రమణి, రామ

గృహిణి – కుటుంబిని, పురంధ్రి, కులాంగన, కులపాలిక

ముత్తైదువ – చిరంటి, సువాసిని

పతివ్రత – సుచరిత, సుచరిత్ర, సతి, సాధ్వి

సమర్తాడని పడుచు – నగ్నిక

పెండ్లికాని పడుచు – కన్య, కుమారి

అశిశ్వి – పిల్లలు లేని స్త్రీ

అవీర – భర్తా, బిడ్డలూ లేని స్త్రీ

భర్తను పోగొట్టుకున్న స్త్రీ – విధవ, వితంతువు, విశ్వస్త

భర్త గల స్త్రీ – పతివత్ని, భర్తృమతి, సభర్తృక

రజస్వల – ఆత్రేయి, స్త్రీధర్మిణి, మలిని, పుష్పవతి, ఋతుమతి

ముట్లుడిగిన స్త్రీ – నిష్కళ, గతార్తవ, విగతార్తవ

గర్భిణి చూలాలు) – ఆపన్నసత్త్వ, గుర్విణి, అంతర్వత్ని

పసిబిడ్డ – ఉత్తానశయుడు, డింభుడు, స్తనపుడు, స్తనంధయి

బాలుడు – మాణవకుడు

యువకుడు – వయస్థుడు, తరుణుడు, యువ (యువన్),

ముదుసలివాడు – ప్రవయసుడు (ప్రవయస్ / ప్రవయో), స్థవిరుడు, వృద్ధుడు, జీనుడు, జీర్ణుడు, జరంతుడు (జరన్) వర్షీయసుడు (వర్షీయస్/ వర్షీయో), దశమి (దశమిన్), జ్యాయసుడు (జ్యాయస్/ జ్యాయో)

ముదుసలి స్త్రీ – ప్రవయస్క, స్థవిరి, వృద్ధ, జీన, జీర్ణ, జరంతి, వర్షీయసి, దశమిని, జ్యాయసి

 ౨. వావివరుసలు

తండ్రి – పిత (పితృ), తాతుడు, జనకుడు, జనయిత (జనయితృ)

తల్లి – మాత (మాతృ), జనయిత్రి, జనని, ప్రసువు (ప్రసూ)

సంతానం – అపత్యం, తోకం, సంతతి

కొడుకు – సుతుడు, పుత్రుడు, కుమారుడు, అత్మజుడు, తనయుడు, తనూజుడు, సూనువు

కూతురు – సుత, దుహిత (దుహితృ) పుత్రి, పుత్రిక, కుమారి, తనయ, తనూజ, ఆత్మజ

సోదరుడు – భ్రాత (భ్రాతృ)

అన్న – అగ్రజుడు, పూర్వజుడు

తమ్ముడు – అనుజుడు, జఘన్యజుడు, కనీయుడు, కనీయసుడు (కనీయస్/ కనీయో), యవీయుడు, యవీయసుడు (యవీయస్/ యవీయో)

సోదరుడి భార్య (వదిన) – ప్రజావతి

సోదరి – స్వస (స్వసృ), భగిని

అక్క – అగ్రజ, పూర్వజ

చెల్లెలు – అనుజ, అవరజ, అవర

తండ్రికి తండ్రి – పితామహుడు

పితామహుడి తండ్రి (ముత్తాత) – ప్రపితామహుడు

తల్లికి తండ్రి – మాతామహుడు

మాతామహుడి తండ్రి – ప్రమాతామహుడు

తండ్రికి తల్లి – పితామహి

తల్లికి తల్లి – మాతామహి

కొడుకు కొడుకు – పౌత్రుడు

పౌత్రుడి కొడుకు – ప్రపౌత్రుడు

పౌత్రుడి కూతురు – ప్రపౌత్రి

కొడుకు కూతురు – పౌత్రి

కూతురి కొడుకు – దౌహిత్రుడు

కూతురి కూతురు – దౌహిత్రి

మనవడు – నప్త (నప్తృ)

మనవరాలు – నప్త్రి

తల్లి సోదరుడు (మేనమామ) – మాతులుడు, మాతృవ్యుడు

తల్లిసోదరుడి భార్య (అత్త) – మాతులాని

తల్లి సోదరి (పిన్ని లేదా పెద్దమ్మ) – మాతృష్వస, (మాతృష్వసృ), మాతృవ్య

తండ్రి సోదరుడు బాబాయి లేదా పెదనాన్న) – పితృవ్యుడు

తండ్రి సోదరి (మేనత్త) – పితృష్వస (పితృష్వసృ), పితృవ్య

తండ్రిసోదరుడి కొడుకు – పితృవ్యజుడు cousin brother

(భారతదేశంలో ‘కజిన్స్’ అందఱూ సోదరులుగా పరిగణించబడరని ఈ ఇండియన్ ఇంగ్లీషువాడుక సూచిస్తుంది. ఎందు కంటే ఒక తరహా ‘కజిన్స్’ ని మనం వివాహోపయుక్తులైన బావలుగా, మఱదళ్ళుగా పరిగణిస్తాం. కనుక cousin bro-ther అనే వాడుక ఆంగ్ల భాషలో లేకపోయినా ని ఈ సందర్భానికి మాత్రం దాన్ని ఆమోదించి వాడడమైనది)

తండ్రి సోదరుడి కూతురు – పితృవ్యజ cousin sister

తండ్రి సోదరి (మేనత్త) కొడుకు– పితృష్వస్రీయుడు

తండ్రిసోదరి కూతురు (మఱదలు) – పితృష్వస్రీయ

తల్లిసోదరుడి కొడుకు (బావ) – మాతులేయుడు

తల్లి సోదరుడి కూతురు (మఱదలు) – మాతులేయి

తల్లిసోదరి కొడుకు – మాతృష్వస్రీయుడు

తల్లిసోదరి కూతురు – మాతృష్వస్రీయ

సవతి – సపత్ని

సవతికొడుకు – వైమాత్రేయుడు, విమాతృజుడు

సోదరి కుమారుడు (మేనల్లుడు) – భాగినేయుడు

సోదరి కుమార్తె (మేనగోడలు) – భాగినేయి

భార్య – జాయ, కళత్రం, దార (దారాః), పత్ని, గేహిని, పాణిగృహీతి, ద్వితీయ, సహధర్మిణి

భర్త – పతి, ధవుడు, వల్లభుడు, దయితుడు, విభుడు

శ్వశురుడు – మామగారు

శ్వశురి – అత్తగారు

అల్లుడు – జామాత (జామాతృ)

కోడలు – స్నుష

భార్య సోదరుడు (బావమఱిది) – స్యాలకుడు

భార్య సోదరి (మఱదలు) – ననంద (ననందృ)

తోడల్లుడు – షడ్డకుడు

తోడికోడలు (ఏరాలు) – యాత (యాతృ)

భర్తసోదరుడు (మఱిది) – దేవరుడు, దేవ (దేవృ)

౩. వృత్తులు

ఉద్యోగం – ఉపాధి, జీవనం, జీవనోపాయం, ఆజీవం, జీవిక, వార్త, వృత్తి,

జీతం – వర్తనం, వేతనం, భృతి

గడన – సంపాదనం, అర్జనం

ధనం – ద్రవ్యం, విత్తం, స్వాపతేయం, రిక్థం, ఋక్థం, ధనం, వసు, ద్రవిణం, ద్యుమ్నం, అర్థం, రై (రా), విభవం, హిరణ్యం (సంస్కృతంలో బంగారపు పర్యాయపదాలన్నీ ధనానికి పర్యాయపదాలుగా వాడతారు)

ఉపాధ్యాయుడు – గురువు, అధ్యాపకుడు, దేశికుడు, ఆచార్యుడు, ఉపదేష్ట, బోధకుడు, శిక్షకుడు

శిష్యుడు – శిష్యుడు, విద్యార్థి, అంతేవాసి, ఛాత్రుడు

ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టినవాడు – శైక్షుడు Beginner

ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టినవారి కోసం వ్రాసిన పుస్తకం – శైక్షకల్పం

ఇప్పటికే కొంత నేర్చుకోవడం వల్ల విద్యలో ముందున్నవారి కోసం వ్రాసిన పుస్తకం – ప్రశ్రుతకల్పం

తమందఱికీ ఒకే గురువు గల విద్యార్థులు – సతీర్థ్యులు, సహాధ్యాయులు Class-mates

యజ్ఞం చేయించేవాడు – అధ్వర్యువు, అగ్నీధ్రుడు, ఋత్విజుడు, యాజకుడు

యజ్ఞం చేసేవాడు – యజమానుడు, హోత (హోతృ)

బ్రహ్మచారి – వర్ణి (వర్ణిన్)

సన్న్యాసి – భిక్షువు, పరివ్రాట్, పరివ్రాజకుడు, కార్మంది, పారాశరి, మస్కరి

రాజు – మూర్ధాభిషిక్తుడు, రాజన్యుడు, రాట్టు (రాట్), విరాట్టు (విరాట్), పార్థివుడు, నృపుడు, భూపుడు, మహీక్షితుడు

అనేకదేశాలకు రాజైనవాడు – సమ్రాట్టు (సమ్రాట్) సార్వభౌముడు, చక్రవర్తి

చిన్నప్రాంతానికి రాజు – మండలేశ్వరుడు, మాండలికుడు

తనకంటే పెద్దరాజుకు లొంగిపోయి కప్పం కడుతున్న చిన్నరాజు – సామంతుడు vassal

మంత్రి (మంత్రిన్) – సచివుడు, ధీసచివుడు, అమాత్యుడు

ఉన్నతాధికారులు – కర్మసచివులు, మహామాత్రులు

పురోహితుడు – పురోధ (పురోధస్), పురోధసుడు

న్యాయమూర్తి – ప్రాడ్వివాకుడు, అక్షదర్శకుడు

వాకిటి కావలివాడు – ప్రతీహారుడు, ద్వారపాలకుడు, ద్వాస్థుడు

భటుడు – రక్షి (రక్షిన్) cop

గ్రామ సర్పంచి – స్థాయుకుడు

బహుగ్రామాలపై అధికారి – గోపుడు

టంకశాల అధికారి – నైష్కికుడు

అంతఃపురాధికారి – అంతర్వంశికుడు

అంతఃపురపు కావలివాడు – సౌవిదుడు, సౌవిదల్లుడు, స్థాపత్యుడు, కంచుకి

సేవకుడు – కింకరుడు, ప్రేష్యుడు, భృత్యుడు, దాసుడు, దాసేరుడు, దాసేయుడు, అనుజీవి, గోప్యకుడు, చేటకుడు, నియోజ్యుడు, భుజిష్యుడు, పరిచారకుడు

జ్యోతిష్కుడు – దైవజ్ఞుడు, జ్యౌతిషికుడు, సాంవత్సరుడు, గణకుడు, మౌహూర్తికుడు, మౌహూర్తుడు, నాక్షత్రికుడు, కార్తాంతికుడు

వ్రాయసకాడు/ గుమాస్తా– లేఖకుడు, లిపికుడు లిపికరుడు, లిపికారుడు, అక్షరచణుడు, అక్షరచుంచువు

దూత – సందేశహరుడు, వార్తాహరుడు

మావటివాడు – హస్తిపకుడు, గజారోహుడు, ఆధోరణుడు, నిషాది (నిషాదిన్)

సారథి – సూతుడు యంత (యంతృ), ప్రాజిత (ప్రాజితృ), క్షత్త (క్షత్తృ)

గుఱ్ఱపు రౌతు – ఆశ్వికుడు, సాది (సాదిన్), అశ్వారూఢుడు

సైనికుడు – భటుడు,

సైన్యాధిపతి – సేనాని

యోధుడు – శస్త్రాజీవుడు, కాండపృష్ఠుడు, ఆయుధీయుడు, ఆయుధికుడు, నైస్త్రింశికుడు

ముందు నడిచేవాడు – నాయకుడు, నేత, పురోగుడు, అగ్రేసరుడు, ప్రష్ఠుడు, అగ్రతస్సరుడు, పురస్సరుడు, పురోగముడు, పురోగామి

భట్రాజు – మాగధుడు, వంది (వందిన్), స్తుతిపాఠకుడు, స్తోత్రపాఠి

ముష్టివాడు – యాచకుడు

వడ్డీవ్యాపారి – కుసీదికుడు, వార్ధుషికుడు, వార్ధుషి, వృద్ధ్యాజీవుడు

వంటవాడు – సూపకారుడు, వల్లవుడు, ఆరాళికుడు, ఆంధసికుడు, సూదుడు, ఔదనికుడు, గుణుడు

వంటింటి అధికారి – పౌరోగవుడు

గొల్లవాడు – గోపుడు, గోపాలుడు, గోపాలకుడు, గోసంఖ్యుడు, గోదుహుడు, ఆభీరుడు, వల్లవుడు

పశుసంపద గలవాడు – గోమంతుడు, గోస్వామి (గోస్వామిన్), గోమి (గోమిన్)

వ్యాపారి – వణిజుడు (వణిక్), వాణిజుడు, వైదేహకుడు, సార్థవాహుడు, నైగముడు, పణ్యాజీవుడు, ఆపణికుడు, క్రయవిక్రయకుడు

అమ్మేవాడు – విక్రేత (విక్రేతృ), విక్రయికుడు

కొనేవాడు – క్రేత (క్రేతృ)

గుమాస్తా – కరణుడు

వైద్యుడు – భిషజుడు (భిషక్), అంబష్ఠుడు, చికిత్సకుడు

విషవైద్యుడు – జాంగలికుడు

పశువైద్యుడు – జాంతవికుడు

పిచ్చికి వైద్యం చేసేవాడు – స్వాంతికుడు

వివిధ ఎంజినీరింగ్ పనివారు – కారువులు, శిల్పులు

ఆ పనివారి నాయకుడు – కులశ్రేష్ఠి (న్)

పూలదండలు గ్రుచ్చి అమ్మేవాడు – మాలికుడు, మాలాకారుడు

కుమ్మరి – కులాలుడు, కుంభకారుడు

సున్నప్పని చేసేవాడు – పలగండుడు, లేపకుడు

సాలె – తంతువాయుడు, కువిందుడు

దర్జి – సౌచికుడు, తున్నవాయుడు

చిత్తరువులూ, బొమ్మలూ వ్రాసేవాడు – చిత్రకరుడు, చిత్రకారుడు, రంగాజీవుడు

చెప్పులు కుట్టేవాడు – పాదూకృత్తు (పాదూకృత్), చర్మకారుడు

లోహప్పనులు చేసేవాడు – లోహకారుడు, వ్యోకారుడు

కంసాలి (అగసాలి) – స్వర్ణకారుడు, నాడింధముడు, కళాదుడు, రుక్మకారుడు

వడ్రంగి – తక్ష (తక్షన్), తక్షణుడు, వర్ధకి, త్వష్ట, రథకారుడు, కాష్ఠతట్టు (-తట్ = తష్)

వడ్రంగుల శ్రేణికి గానీ, గ్రామ కాణాచికి గానీ కట్టుబడక స్వతంత్రంగా వడ్రంగప్పని చేసేవాడు – కౌటతక్షుడు

Freelance carpenter

మంగలి – నాపితుడు, దివాకీర్తి, నాపితుడు, క్షురి, ముండి, అంతావసాయి

చాకలి – రజకుడు, నిర్ణేజకుడు

కల్లమ్మేవాడు – శౌండికుడు, మండహారకుడు

మేకలు కాచేవాడు – అజాజీవి (న్), జాబాలుడు

మాయ చేసేవాడు – మాయాకారుకుడు, ప్రాతిహారకుడు

నాట్యకారుడు – శైలాలి (న్), శైలూషుడు, కృశాశ్వి (న్), భారతుడు

వేశ్య – వారవనిత, గణిక, రూపాజీవ, భోగిని

వేశ్యలను విటుల వద్దకు పంపే స్త్రీ – కుట్టని, శంభళి

దేశసంచారం చేసే నట గాయకజనం – చారణులు, కుశీలవులు

స్త్రీవేషాన్ని ధరించే పురుష నర్తకుడు – భ్రకుంసుడు, భ్రుకుంసుడు, భ్రూకుంసుడు

నాట్యగత్తె – నర్తకి, లాసిక

పక్షుల్ని వేటాడేవాడు – జీవాంతకుడు, శాకునికుడు

వలవేసి పట్టేవాడు – వాగురికుడు, జాలికుడు

జాలరి(బెస్త) – కైవర్తుడు, దాశుడు, ధ్వరుడు

మాంసం అమ్మేవాడు – వైతంసికుడు, కౌటికుడు, మాంసికుడు

కూలీవాడు – భృతకుడు, భృతిభుజుడు, కర్మకరుడు, వైతనికుడు

ధాన్యాదుల్ని రవాణా చేసేవాడు (పెఱిక) – వార్తావహుడు, వైవధికుడు

బరువులు మోసి జీవించేవాడు – భారవహుడు, భారికుడు

చిన్నప్పట్నుంచి ఉంచుకొని పెంచబడిన సేవకుడు (పెంపుడుబంటు) – పరాచితుడు, పరిస్కందుడు, పరజాతుడు, పరైధితుడు

బోయవాడు – వ్యాధుడు, మృగవధాజీవుడు, మృగయువు, లుబ్ధకుడు

దొంగ – చోరుడు, హారకుడు, ఐకాగారికుడు, స్తేనుడు, దస్యువు, తస్కరుడు, మోషకుడు, ప్రతిరోధి (న్), పరాస్కంది (న్), పాటచ్చరుడు, మలిమ్లుచుడు

౪. మనఃస్థితులూ, మనస్తత్త్వాలూ

స్థితి – అవస్థ, దశ, సంస్థానం

స్వభావం – సంసిద్ధి, ప్రకృతి, శీలం, నిసర్గ, నిసర్గం

సంతోషం – ముదం (ముత్), ప్రీతి, ప్రమదం, ప్రమోదం, ఆమోదం, నమ్మదం, హర్షం, ఆనందం, ఆనందథువు, శర్మ, శాతం, సుఖం

శ్రేష్ఠవాచకాలు – మతల్లిక, మచర్చిక, ప్రకాండం (ప్రకాండుడు), ఉద్ఘం (ఉద్ఘుడు), తల్లజం (తల్లజుడు)

అదృష్టం – సుదైవం, దిష్టం, భాగధేయం, భాగ్యం, నియతి, విధి

మనోనిశ్చయం – చిభావత్తాభోగం, మనస్కారం, నిర్ణయం

చర్చ – సంఖ్య, విచారణ

ఆలోచన – యోచన, అధ్యాహారం

సంశయం – సందేహం, అనుమానం, ద్వాపరం, విచికిత్స

నాస్తికత – మిథ్యాదృష్టి

అపకారం – వ్యాపాదం, ద్రోహం

భ్రమ – భ్రాంతి, మిథ్యామతి

అంగీకారం – సంవిదం (సంవిత్), ఆగువ (ఆగూ), ప్రతిజ్ఞానం, ప్రతిశ్రవం, ఆశ్రవం, సంశ్రవం, అభ్యుపగమం

అజ్ఞానం – అవిద్య

జాలి – కారుణ్యం, కరుణ, ఘృణ, కృప, దయ, అనుకంప, అనుక్రోశం

నవ్వు – హాసం, హాస్యం

ఘోరమైనది – భైరవం, దారుణం, భీషణం, భీష్మం, భయానకం, భయంకరం, ప్రతిభయం

ఉగ్రం – రౌద్రం

భయం – దరం, త్రాసం, భీతి, భీ, సాధ్వసం

అవమానం – అనాదరం, పరాభవం, పరిభవం, పరీభవం, తిరస్క్రియ, తిరస్కారం, రీఢ, అవమానన, అవజ్ఞ, అవహేళనం, అసూర్‌క్షణం

సిగ్గు – మందాక్షం, హ్రీ, త్రప, వ్రీడ, లజ్జ, అపత్రప

(వీటిల్లో త్రప, వ్రీడ అనేవి పురుషముఖావలోకనం చేత స్త్రీలకు కలిగే సిగ్గును సూచిస్తాయి. హ్రీ అనేది తప్పులు చేయడానికి గల సంకోచాన్ని తెలుపుతుంది, inhibition)

ఓర్పు – క్షాంతి, తితిక్ష, సహనం, క్షమ

పరధనాభిలాష – అభిధ్య

మంచి ఉన్నా దాన్ని చెడుగా చేసి మాట్లాడడం – అసూయ

ఓర్వలేనితనం – ఈర్ష్య, అక్షాంతి

శత్రుత్వం – శాత్రవం, వైరం, విరోధం, ద్వేషం

దుఃఖం – మన్యువు, శోకం, శుచం (శుక్/శుచ్), పీడ, బాధ, వ్యథ, ఆమనస్యం, కష్టం, కృచ్ఛ్రం, ఆభీలం

ప్రేమ/స్నేహం – ప్రియత, హార్దం, స్నేహం

స్త్రీపురుషుల మధ్య ఉండేది – అనురాగం

పెద్దలకు పిన్నలయందు ఉండేది – వాత్సల్యం

నమ్మకం – విస్రంభం, విశ్వాసం, ప్రత్యయం

తనకుచితమైన ధర్మం నుంచి చలించడం – భ్రేషం, భ్రంశం

న్యాయం – యుక్తం, ఔపయికం

కోరిక – ఇచ్ఛ, కాంక్ష, స్పృహ, ఈహ, తృట్టు (తృట్/తృష్), తృషం, వాంఛ, లిప్స, కామం, కామన, మనోరథం, దోహదం, అభిలాష, తర్షం

అదే పనిగా ఒకదానిని కోరడం – లాలస

ఒకదానికి మరగడం (addiction) – లౌల్యం, లోలత్వం లంపటత్వం

మనోవ్యథ – ఆధి

యాతన – కారణ

తహతహ – ఉత్కంఠ, ఉత్కలిక

ఉత్సాహం – కార్యాసక్తి

మోసం – కపటం, వంచన, వ్యాజం, దంభం, ఉపధి, ఛద్మ, కైతవం, కుసృతి, నికృతి, శాఠ్యం, ధౌర్త్యం

ఏమరుపాటు – ప్రమాదం, ప్రమత్తత, అనవధానత

అపూర్వవస్తువును గానీ, అనుభవాన్ని గానీ కోరడం – కుతూహలం, కౌతూహలం, కుతుకం, కౌతుకం

స్త్రీపురుషుల సరసాలు – ద్రవం, కేళి, పరీహాసం, క్రీడ, లీల, నర్మం (నర్మన్)

నెపం – వ్యాజం, అపదేశం, లక్ష్యం

హడావుడి – సంవేగం, సంభ్రమం

తృప్తి – సౌహిత్యం, తర్పణం, తృప్తి

ఎప్పుడూ పురుషసంగమాన్ని అభిలషించే స్త్రీ – వృషస్యంతి, కాముకి

అక్రమసంబంధాలు గల స్త్రీ – పుంశ్చలి, ధర్షణి, బంధకి, అసతి, కులట, ఇత్వరి, స్వైరిణి, పాంసుల

తెలివి గల స్త్రీ – ప్రాజ్ఞ, ధీమతి, చతుర

దిగంబరి – నగ్నిక, కోటవి

పండితుడు – విద్వాంసుడు (విద్వాన్), విద్వానుడు, విపశ్చితుడు (విపశ్చిత్), దోషజ్ఞుడు, సంతుడు (సన్), సుధీ, కోవిదుడు, బుధుడు, ధీరుడు, మనీషి(న్), జ్ఞుడు, ప్రాజ్ఞుడు, సంఖ్యావంతుడు (సంఖ్యావత్), కవి, ధీమంతుడు (ధీమత్), సూరి, కృష్టి, లబ్ధవర్ణుడు, విచక్షణుడు

దూరం ఆలోచించేవాడు – దూరదర్శి, దీర్ఘదర్శి

చదువు పూర్తిచేసినవాడు – సమావృత్తుడు

వ్రతభంగమైనవాడు – అవకీర్ణి

తనకు పట్టనట్లుగా ఉండేవాడు (indifferent) – ఉదాసీనుడు

మౌనం వహించినవాడు – తూష్ణీంభావి Silent, mute

వేగం గలవాడు – తరస్వి(న్), త్వరితుడు, ప్రజవి, జవనుడు

బలవంతుడు – ఊర్జస్వలుడు, ఊర్జస్వి(న్), బలి

జయిస్తేనే గానీ తిరిగిరామని ఒట్టుపెట్టుకున్నవాడు – సంశప్తకుడు

తానే వీరుడని భావించేవాడి మనోభావం – అహోపురుషిక

తానే ముందుండాలనే ఉత్సాహం – అహంపూర్విక

నేనంటే నేనని ముందుకు రావడం – అహమహమిక

శుభం చేసేవాడు – క్షేమంకరుడు, అరిష్టతాతి, శివతాతి, శివంకరుడు

పుణ్యాత్ముడు – సుకృతి(న్), ధన్యుడు

దొడ్డమనసు గలవాడు – మహేచ్ఛుడు, మహాశయుడు, హృదయాళువు, సుహృదయుడు

నేర్పరి – ప్రవీణుడు, నిపుణుడు, అభిజ్ఞుడు, విజ్ఞుడు, నిష్ణాతుడు, శిక్షితుడు, వైజ్ఞానికుడు, కృతముఖుడు, కృతి, కుశలుడు, కోవిదుడు

పూజ్యుడు – ప్రతీక్ష్యుడు

సందేహంలో ఉన్నవాడు – సాంశయికుడు

దానశీలి – వదాన్యుడు, స్థూలలక్షుడు, దానశౌండుడు, బహుప్రదుడు

దీర్ఘాయుష్మంతుడు – జైవాతృకుడు

శాస్త్రం తెలిసినవాడు – అంతర్వాణి

పరీక్షించేవాడు – కారణికుడు

వరాలిచ్చే దేవుడు/దేవి – వరదుడు/వరద, సమర్థకుడు/సమర్థకి

సంతోషంలో ఉన్నవాడు – హర్షమాణుడు, వికుర్వాణుడు, ప్రమనుడు (ప్రమనస్/ ప్రమనో), ప్రమనస్కుడు

బాధలో ఉన్నవాడు – దుర్మనుడు (దుర్మనస్/ దుర్మనో), దుర్మనస్కుడు, విమనుడు (విమనస్/ విమనో), విమనస్కుడు, అంతర్మనుడు (అంతర్మనస్/ అంతర్మనో) అంతర్మనస్కుడు

ఆత్రంగా ఉన్నవాడు – ఉత్కుడు, ఉన్మనుడు (ఉన్మనస్/ ఉన్మనో) ఉన్మనస్కుడు

మనసులో కల్మషం లేనివాడు – దక్షిణుడు, సరళుడు, ఉదారుడు

త్యాగమూ, భోగమూ రెండూ గలవాడు – సుకళుడు

ఒకదానియందు ఆసక్తుడు – ప్రసితుడు, తత్పరుడు

ప్రసిద్ధుడు – ప్రతీతుడు, ప్రథితుడు, ఖ్యాతుడు, విత్తుడు, విజ్ఞాతుడు, విఖ్యాతుడు, విశ్రుతుడు, కృతలక్షణుడు, ఆహితలక్షణుడు

ధనికుడు – శ్రీమంతుడు, లక్ష్మీవంతుడు, లక్ష్మణుడు, శ్రీలుడు, ఇభ్యుడు, ఆఢ్యుడు, ధని(న్), అధికర్ధి, సమృద్ధుడు

దరిద్రుడు – అకించనుడు, నిర్ధనుడు, నిఃస్వుడు, దుర్విధుడు, దుర్గతుడు. అశ్రీకుడు

కుటుంబాసక్తుడు (family man) – అభ్యాగారికుడు

అందమైన శరీరం గలవాడు – సింహసంహననుడు

స్థితప్రజ్ఞుడు – నిర్ధార్యుడు

తండ్రిపోలికలు ఎక్కువగా గలవాడు – మనోజవసుడు

స్నేహశీలి (affable) – స్నిగ్ధుడు, వత్సలుడు

జాలిగుండె గలవాడు – దయాళువు, కారుణికుడు, కృపాళువు, సురతుడు

స్వతంత్రుడు – అపావృతుడు, స్వైరి, స్వచ్ఛందుడు, నిరవగ్రహుడు

పరాధీనుడు – పరతంత్రుడు, పరాధీనుడు, పరవంతుడు, నాథవంతుడు, అధీనుడు, నిఘ్నుడు, ఆయత్తుడు, అస్వచ్ఛందుడు, గృహ్యకుడు

ఆలస్యంగా పనిచేసేవాడు – దీర్ఘసూత్రుడు, చిరక్రియుడు Red-tapist

ఆలోచించకుండా పనిచేసేవాడు – జాల్ముడు, అసమీక్ష్యకారి

చాలా నెమ్మదిగా పనిచేసేవాడు – కుంఠుడు

సోమరి – మందుడు, తుందుడు, పరిమృజుడు, అలసుడు, శీతకుడు, అనుష్ణుడు

అనాయాసంగా పనిచేసేవాడు – కర్మక్షముడు, అలంకర్మీణుడు

పనికి పూనుకున్నవాడు – క్రియావంతుడు

ఫలితం ఉన్నా లేకపోయినా పనిచేసే స్వభావం గలవాడు – కార్ముడు, కర్మశీలుడు

ఫలోదయం వఱకు పని చేసే దీక్ష గలవాడు – కర్మశూరుడు, కర్మఠుడు

ప్రతిఫలం పుచ్చుకుని పనిచేసిపెట్టేవాడు – కర్మణ్యభుజుడు, కర్మకరుడు (కూలీ)

కూలి అడక్కుండా పనిచేసేవాడు – కర్మకారుడు

ఆకలివేసినవాడు – బుభుక్షితుడు, క్షుధితుడు, అశనాయితుడు

ఇతరులు వండుకున్న అన్నాన్ని తినేవాడు – పరాన్నభుజుడు, పరపిండాదుడు

తిండిపోతు – ఘస్మరుడు, అద్మరుడు

జీవితానికో లక్ష్యమూ, ఆదర్శమూ లేకుండా ఊరికే జీవించడమే పనిగా గలవాడు – ఔదరికుడు

ఇతరుల సంగతి పట్టించుకోకుండా తన పొట్ట మాత్రం నింపుకునేవాడు – ఆత్మంభరి, కుక్షింభరి, స్వోదరపూరకుడు

ఇది తగును, ఇది తగదు అనకుండా ఏది పడితే అది తినేవాడు – సర్వాన్నీనుడు, సర్వభోజి

ఆశపోతు – గృధ్నుడు, గర్ధనుడు, లోలుపుడు

పిచ్చిపట్టినవాడు – ఉన్మాది, సోన్మాదుడు, ఉన్మదిష్ణువు

అహంకారి – అహమ్యువు, అవినీతుడు, సముద్ధతుడు, గర్వి (న్), అవలిప్తుడు, స్మయి(న్), స్మయవంతుడు

మత్తెక్కినవాడు – మత్తుడు, శౌండుడు, ఉత్కటుడు, క్షీబుడు

కాముకుడు – కమితుడు, అనుకుడు, కమ్రుడు, కమిత (కమితృ), కామయిత (తృ), అభికుడు, ఆభీకుడు, కమనుడు, కామనుడు

అణకువ గలవాడు – విధేయుడు, వినీతుడు, ఆశ్రవుడు, వశ్యుడు, ప్రణేయుడు, నిభృతుడు, ప్రశ్రితుడు

దిట్టతనం (గడుసుదనం) గలవాడు (aggressive) – ధృష్టుడు, ధృష్ణువు, వియాతుడు

మెతకమనిషి – శాలీనుడు

సృజనాత్మక మేధావి – ప్రగల్భుడు

ఆశ్చర్యపోయినవాడు – విస్మితుడు, విలక్షుడు

దిగులుపడినవాడు – అధీరుడు, కాతరుడు

పిఱికివాడు – త్రస్నువు, భీరువు, భీరుకుడు, భీలుకుడు

లేనిది వస్తుందని ఆశిస్తున్నవాడు – ఆశంసువు, ఆశంసిత (ఆశంసితృ)

పుచ్చుకునే (స్వభావం గల) వాడు (receptive, recipient) – గ్రహయాళువు, గ్రహీత (తృ)

శ్రద్ధ గలవాడు – శ్రధ్ధాళువు, శ్రద్దధానుడు

పడేవాడు – పతయాళువు, పాతుకుడు

సిగ్గరి/ బిడియం గలవాడు/ మొహమాటస్థుడు – లజ్జాశీలుడు, అపత్రపిష్ణువు

మ్రొక్కేవాడు/ నమస్కారం చేసేవాడు – వందారువు

హింసాపరుడు/ చంపే స్వభావం గలవాడు – శరారువు, ఘాతుకుడు, హింస్రుడు, నృశంసుడు, క్రూరుడు, పాపుడు

పెంపొందేవాడు/ పెంపొందుతున్నవాడు – వర్ధమానుడు, వర్ధనుడు, వర్ధిష్ణువు

ఎత్తుకు ఎగసేవాడు – ఉత్పతిష్ణువు, ఉత్పతిత (తృ)

అలంకరించే/ అలంకరించుకునేవాడు – మండనుడు, అలంకరిష్ణువు

(ఒకటి) కాగలవాడు – భూష్ణువు, భవిష్ణువు, భవిత (తృ) [ఈ పదాల్ని స్వతంత్రంగా కాక వేఱే ఏదైనా విశేష్యంతో కలిపి ప్రయోగించాలి. ఉదా :- ఛాత్రీభవిష్ణువు – శిష్యుడు కాగోరేవాడు ఇత్యాది]

ప్రవర్తించేవాడు – వర్తిష్ణువు, వర్తనుడు

[పైదానిలాగే వర్తిష్ణు శబ్దాన్ని కూడా ఇతరపదాల తరువాత, ముఖ్యంగా అవ్యయాల తరువాత కలిపి ప్రయోగించాలి. ఉదా :- ప్రియం వర్తిష్ణువు – ఇష్టమయ్యేలా నడచుకునేవాడు. వర్తనుడనే పదాన్ని మటుకు ఏదైనా ఓ విశేషణానికి తరువాత, సమాసంలో చివఱి అవయవంగా ప్రయోగించవచ్చు. ఉదా :- ఋజువర్తనుడు – ముకుసూటిగా నడచుకునేవాడు]

తిరస్కరించేవాడు – నిరాకరిష్ణువు, క్షిప్నువు

గాఢమైనది (దట్టమైనది) – స్నిగ్ధం, సాంద్రం, మేదురం

తెలిసినవాడు – జ్ఞాత (తృ), విదురుడు, విందువు

సమర్థుడు – దక్షుడు, చతురుడు, కుశలుడు, పేశలుడు, పటువు, క్షముడు, ఉత్థానుడు, ఉష్ణుడు

వికసించే స్వభావం గలది – వికస్వరం

వ్యాపించే (పఱచుకునే) స్వభావం గలది – విసృత్వరం, విసృమరం, ప్రసారి, విసారి

ఓర్చుకునేవాడు – సహిష్ణువు, సహనుడు, క్షంత (తృ), తితిక్షువు, క్షమిత (తృ), క్షమి (న్)

కోపించేవాడు – క్రోధనుడు, కోపి, కోపనుడు, అమర్షణుడు

మహాకోపిష్టి – చండుడు

మేలుకుని ఉండేవాడు – జాగరూకుడు, జాగరిత (తృ)

కునికిపాట్లుపడేవాడు – ఘూర్ణితుడు, ప్రచలాయితుడు

నిద్రపోతు – స్వప్నజుడు (స్వప్నక్/ స్వప్నజ్), శయాళువు, నిద్రాళువు

పెడమొహంగా ఉన్నవాడు – పరాఙ్ముఖుడు, పరాచీనుడు (స్త్రీ. పరాఙ్ముఖి, పరాచి)

తలొంచుకున్నవాడు – అవాంచుడు (అవాక్/ అవాఙ్), అధోముఖుడు (స్త్రీ. అవాఙ్ముఖి, అవాచి)

దేవతల్ని పూజించేవాడు – దేవద్రీచుడు (దేవద్ర్యఙ్) (స్త్రీ. దేవద్రీచి)

అన్నిదిక్కులా వ్యాపించినవాడు – విష్వద్రీచుడు (విష్వద్ర్యఙ్) (స్త్రీ. విష్వద్రీచి)

ఒకఱితో కలిసి వెళ్ళేవాడు – సధ్రీచుడు (సధ్ర్యఙ్) (స్తీ. సధ్రీచి)

అడ్డంగా నడిచేవాడు – తిరీచుడు (తిర్యఙ్) (స్త్రీ. తిరీచి. నపుం. తిరీచం)

వాగేవాడు – వదుడు, వదావదుడు, వాచాలుడు, జల్పాకుడు, వాచాటుడు

బాగా ప్రసంగించేవాడు – వాగీశుడు, వాక్పతి, వాగ్మి, వావదూకుడు

బహిరంగంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నవాడు – ఉపన్యాసకుడు

తియ్యగా మాట్లాడేవాడు – ప్రియంవదుడు, శ్లక్ష్ణుడు

అనిష్టాలు మాట్లాడేవాడు – దుర్ముఖుడు, అబద్ధముఖుడు, ముఖరుడు

అర్థం కాకుండా మాట్లాడేవాడు – లోహలుడు, అస్ఫుటాలాపి

కటువుగా అశుభాలు మాట్లాడేవాడు – గర్హ్యవాది, కద్వదుడు

నాంది పలికేవాడు – నాందీవాది, నాందీకరుడు

ప్రతిస్పందన లేనివాడు – జడుడు

మాట్లాడడం రానివాడు – అనేడమూకుడు

కావాలని, లేదా తన స్వభావరీత్యా మాట్లాడకుండా ఊరుకునేవాడు – తూష్ణీకుడు, తూష్ణీంశీలుడు, తూష్ణీంభావి

వెళ్ళగొట్టబడ్డవాడు – నిష్కాసితుడు, అవకృష్టుడు

ధిక్కరించబడినది – ధిక్కృతం, అపధ్వస్తం, ఆత్తగంధం, అభిభూతం

తిరస్కరించబడ్డవాడు – ప్రత్యాఖ్యాతుడు, ప్రత్యాదిష్టుడు, నిరస్తుడు, నిరాకృతుడు, తిరస్కృతుడు, నికృతుడు, విప్రకృతుడు

మోసపోయినవాడు – వంచితుడు, విప్రలబ్ధుడు

అభ్యంతరపెట్టబడినది – అధిక్షిప్తం, ఆక్షిప్తం, ప్రతిక్షిప్తం

చొప్పించబడినది – ప్రక్షిప్తం

బంధించబడినవాడు – బద్ధుడు, కీలితుడు, సంయతుడు

ఆపదలో ఉన్నవాడు – ఆపన్నుడు, విపన్నుడు

శత్రుభయాదుల వల్ల స్వదేశం నుంచి పారిపోయినవాడు – కాందిశీకుడు

నేఱారోపణ రుజువై నిందించబడ్డవాడు (convicted) – ఆక్షారితుడు, క్షారితుడు, అభిశస్తుడు, అభిశంసితుడు

దేనిలోనూ నిలకడ లేనివాడు (Unsettled vagabond) – సంకసుకుడు

జనాన్ని చంపేవాడు (Arsonist) – ఆతతాయి

వ్యసనపరుడు – వ్యసని, వ్యసనార్తుడు, ఉపరక్తుడు

భయశోకాదుల చేత మనశ్శరీరాలు స్వాధీనంలో లేనివాడు – విక్లబుడు, విహ్వలుడు, వ్యాకులుడు, విహస్తుడు, వివశుడు

కశ్యుడు – కొరడాదెబ్బలకు తగినవాడు

చంపదగినవాడు – వధ్యుడు

విషంతో చంపదగినవాడు – విష్యుడు

సత్ప్రవర్తన గలవాడు – శిశ్విదానుడు

చెడ్డవాడు – దుర్జనుడు, కుజనుడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఖలుడు

తప్పులనే ఎంచేవాడు – దోషైకదృశుడు (దోషైకదృక్), దోషైకదర్శనుడు, పురోభాగి

కానరాకుండా అపకారం చేసేవాడు – శఠుడు, నికృతుడు, అనృజువు

చాడీలు చెప్పేవాడు – కర్ణేజపుడు, పిశునుడు, సూచకుడు

మోసగాడు – ధూర్తుడు, వంచకుడు, కపటి(న్)

నీచుడు/ అల్పుడు – హీనుడు, తుచ్చుడు, జాల్ముడు, క్షుల్లకుడు, క్షుద్రుడు, అపశదుడు

మూర్ఖుడు – అజ్జుడు, మూఢుడు, యథాజాతుడు, వైధేయుడు, బాలిశుడు

పిసినారి – కదర్యుడు, కృపణుడు, క్షుద్రుడు, కింపచానుడు, మితంపచుడు

అడుక్కునేవాడు – యాచకుడు, వనీపకుడు, మార్గణుడు, అర్థి

తపస్వి – తాపసుడు, పారికాంక్షి (న్)

మౌనవ్రతం గల సాధకుడు – మౌని (న్), ముని, వాచంయముడు

సత్యవ్రతాన్ని పాటించే తత్త్వదర్శి – ఋషి

ఇంద్రియనిగ్రహం గల సాధకుడు – యతి, దాంతుడు

V. శరీరావయవాలు

శరీరం – దేహం, గాత్రం, వపువు (వపుష్), సంహననం, వర్ష్మం (వర్ష్మన్), విగ్రహం, కాయం, మూర్తి, తనువు (తనూ/ తనుష్)

౧. శరీరం బయట కనిపించే భాగాలు

అవయవం – అంగం, ప్రతీకం, అపఘనం, భాగం

ఇంద్రియం – హృషీకం, విషయి

చర్మం – త్వచం (త్వక్/త్వచ్), అసృగ్వర

మొహం – ముఖం, వదనం, ఆస్యం, వక్త్రం, ఆననం ( సంస్కృతంలో నోటిక్కూడా ఇవే వాడతారు.)

తల – శిరం (శిరస్), శీర్షం, ఉత్తమాంగం, మస్తకం, మూర్ధం (మూర్ధన్)

తలవెంట్రుకలు – కేశాలు, శిరోజాలు, శిరోరుహాలు, కచం, వాలాలు, కుంతలాలు, చికురాలు, కైశ్యం

కొప్పు – ధమ్మిల్లం, కేశవేశం

స్త్రీల జడ – వేణి, ప్రవేణి

సన్న్యాసుల/ బ్రహ్మచారుల జడ – సట

ముచ్చిలి (మాడు) – బ్రహ్మరంధ్రం

పుఱ్ఱె – కపాలం, కర్పరం, కరోటి, శిరోస్థి

అస్థిపంజరం – కంకాళం

నుదురు (నొసలు) – అలికం, ఫాలం, లలాటం, గోధి

కనుబొమలు – భ్రుకుటి, భ్రూకుటి, భ్రువు (భ్రూ)

కన్ను – నయనం, నేత్రం, లోచనం, ఈక్షణం, చక్షువు (చక్షుష్), అక్షి, దృశం (దృక్/దృశ్), దృష్టి, అంబకం

కనుకొలకు – అపాంగం, కటాక్షం

కనుఱెప్ప – పక్ష్మం

కంటిపాప – తారక, కనీనిక pupil

చెవి – కర్ణం, శ్రోత్రం, శ్రుతి, శ్రవణం, శ్రవం (శ్రవస్), శబ్దగ్రహం

ముక్కు – ఘోణ, నాస, నాసిక, ఘ్రాణం

చెక్కిలి – గండం, కపోలం

దౌడ/ దవడ – హనువు, తాలువు, కాకుదం

గడ్డం – చిబుకం

పెదవి – దశనవాసం (-వాసస్), రదనచ్ఛదం

పైపెదవి – ఓష్ఠం

కింది పెదవి – అధరం

సెలవి (పైపెదవీ, క్రింది పెదవీ కలిసే కొస) – సృక్వి

మీసాలూ, గడ్డాలూ – శ్మశ్రువులు

మెడ – గ్రీవం (గ్రీవన్), శిరోధి, కంధర

ఱొమ్ముపైన, మెడకి ఇఱువైపులా ఉన్న ఎముకలు (collar bones) – జత్రువులు

పెడతల – అవటువు, ఘాట, కృకాటిక

భుజం – భుజం

రెండుభుజాల మధ్యప్రదేశం (సందిలి) – క్రోడం

బాహువు – ప్రవేష్టం, దోషం (దోష్)

చంక – కక్షం, బాహుమూలం

చేయి – హస్తం, పాణి, కరం, శయం

మోచేయి – కపోణి, కూర్పరం

భుజం నుంచి మోచేతి వఱకు – ప్రగండం

మోచేతి నుంచి మణికట్టు వఱకు – ప్రకోష్ఠం

మణికట్టు నుంచి మిగతా చేతి వెలుపలి భాగం – కరభం

మణికట్టు – మణిబంధం

వ్రేలు – అంగుళి, కరశాఖ

గోరు – నఖం, నఖరం, కరరుహం, పునర్భవం

బొటనవేలు – అంగుష్ఠం

చూపుడువేలు – తర్జని, ప్రదేశిని

మధ్యవేలు – మధ్యమ

ఉంగరపు వేలు – అనామిక

చిటికెనవేలు – కనిష్ఠిక

వేలికణుపులు – అంగుళిపర్వాలు

చాచిన వేళ్ళు గల అరచేయి – చపేటం, ప్రతలం, ప్రహస్తం

పిడికిలి – నికుబ్జం, ప్రసృతి

దోసిలి – అంజలి

పిడిమూర – ముష్టి

ఱొమ్ము – ఉరం (ఉరస్), వక్షం (వక్షస్), వత్సం

చన్ను – స్తనం, కుచం, ఉరోజం, వక్షోజం, పయోధరం

చనుమొనలు – చూచుకం, స్తనాగ్రం, కుచాగ్రం

వీపు – పృష్ఠం

మూపు (వీపు పైభాగం) – స్కంధం, భుజశిరం (-శిరస్)

బరులు (చంకల క్రింది భాగాలు) – పార్శ్వాలు

పొట్ట – ఉదరం, కుక్షి, తుందం, జఠరం, పిచండం

కడుపులోని బిడ్డ – భ్రూణం (embryo)

బొడ్డు – నాభి

పొత్తికడుపు – వస్తి

నడుము – మధ్యం, మధ్యమం, అవలగ్నం, వలగ్నం

పురుషుల మొల – కటం, శ్రోణిఫలకం

స్త్రీల మొల – జఘనం

పిఱుదు – నితంబం

మర్మావయవము – ఉపస్థం, ఉపస్థ

యోని – భగం, మదనాలయం

పురుషాంగం – శిశ్నం, మేఢ్రం, శేఫం (శేఫస్), మేహనం, మదనదండం

వృషణం – అండం, అండకోశం, ముష్కం

వీర్యం – రేతం (రేతస్), బీజం, ఇంద్రియం, తేజం (తేజస్) sperm

మర్మావయవానికీ, గుదానికీ మధ్య ప్రదేశం – సీవని perinium

ఆసనద్వారం – గుదం, అపానం, పాయువు

గజ్జలు (పొత్తికడుపూ, తొడలూ కలిసే చోట్లు) – వంక్షణాలు

మోకాలు – జానువు, అష్ఠీవత్తు

తొడ (మోకాళ్ళ పైభాగాలు) – ఊరువు, అంకం, సక్థి

పిక్క (calf – మోకాళ్ళ కింద కాళ్ళ వెనక ఉండే లావుపాటి భాగం) – జంఘ (తెలంగాణలో కొందఱు పిక్కని తొడ అనే అర్థంలో వాడతారు. కాని ఆ రెండూ ఒకటి కావు)

చీలమండ – గుల్ఫం, ఘుటిక

పాదం – పదం (పత్), చరణం, అంఘ్రి

మీగాళ్ళు – ప్రపదం, పాదాగ్రం

మడమ – పార్‌ష్ణి

పుట్టుమచ్చ – పిప్లువు, జడులం, తిలకం, కాలకం, తిలకాలకం,

౨. శరీరం లోపలి భాగాలు

మాంసం – తరసం, మాంసం, పిశితం, పలలం, క్రవ్యం, ఆమిషం, జాంగలం

నెత్తురు – రుధిరం, అసృజం (అసృక్/ అసృజ్), లోహితం, అస్రం, రక్తం, క్షతజం, శోణితం

గుండె – హృదం, హృది (హృత్/ హృద్), హృదయం

గుండెలోకి రక్తం ప్రవేశిస్తూ, నిర్గమిస్తూ ఉండే ద్వారాలు – హృదయకవాటాలు

మంచిరక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళికలు – ధమనులు

చెడురక్తాన్ని మోసుకెళ్ళే రక్తనాళికలు – సిరలు

తీపి పదార్థాల్ని జీర్ణం చేసే రసాలను స్రవించే గ్రంథి – క్లోమం (క్లోమన్), తిలకం

మెదడు – మస్తిష్కం, గోర్దం

ప్రేగు – ఆంత్రం, పురీతత్తు (పురీతత్)

Spleen – ప్లీహం (ప్లీహన్)

కాలేయం – కాలఖండం, యకృత్తు (యకృత్)

కండరం (tendon) – స్నాయువు, వస్నస

నరాలు – నాడులు

క్రొవ్వు – మేదస్సు (మేదస్), వప

ఎముక – కీకసం, కుల్యం, అస్థి

వెన్నెముక – పృష్ఠాస్థి, కశేరుక

పక్కటెముక – పర్శుక

నాలుక – జిహ్వ, రసజ్ఞ, రసన

పన్ను – దంతం, దత్తు (దత్), దశనం, రదనం

౩. శరీరధర్మాలు

ఆహారం – భోజనం, జగ్ధి, జేమనం, నిఘసం, న్యాదం

సంభోగం – మైథునం, వ్యవాయం, నిధువనం, గ్రామ్యధర్మం, సురతం

ఆవులింత – జృంభణం, జృంభం

నిద్ర – నిద్ర, శయనం, స్వాపం, సుషుప్తి, సంవేశం

కల – స్వప్నం

మెలకువ – ఉత్థానం, జాగరణం, జాగృతి

సంతానోత్పత్తి – ప్రజననం

పెఱుగుదల – అభ్యుదయం, వర్ధనం, ఏధనం

మరణం – పంచత, పంచత్వం, కాలధర్మం, అంతం, దిష్టాంతం, అత్యయం, నిధనం, నాశం, మృత్యువు, దీర్ఘనిద్ర, ప్రమీలనం

శోష – తంద్రి, ప్రమీల

వణుకు – వేపథువు, కంపం

ఒళ్ళు గగుర్పొడవడం – రోమాంచం, రోమహర్షణం

౪. శరీర దోషాలూ, మలినాలూ

మలినం – కిట్టం, మలం, మలీమసం, కచ్చరం

పైత్యం – మాయువు, పిత్తం

కఫం – శ్లేష్మం (న్)

చొంగ – లాల, సృణీక, స్యందిని

ఉమ్మి – నిష్ఠీవనం, నిష్ఠీవం

పుసి – దూషిక

కన్నీరు – అశ్రువు, అస్రువు, అస్రం, రోదనం,

గులిమి (గుబిలి) – సింజూషం

చీమిడి – శింఖాణం

చెమట – స్వేదం, ఘర్మజలం, నిదాఘం

మూత్రం – ప్రస్రావం

మలం – పురీషం, ఉచ్చారం, అవస్కరం, శమలం, శకృత్తు, వర్చస్కం, విష్ఠ, విట్టు (విట్/ విష్)

ముట్టురక్తం – ఆర్తవం

౫. విలక్షణాలూ, వికృతులూ, వైకల్యాలూ, రోగాలూ

బక్క (సన్న) వాడు – ఛాతుడు, అమాంసుడు, దుర్బలుడు

బలమైనవాడు – మాంసలుడు, అంసలుడు

లావుపాటివాడు – తుందిలుడు, తుందిభుడు, తుంది, పిచండిలుడు, స్థూలకాయుడు

చప్పిడిముక్కువాడు– అవటీటుడు, అవనాటుడు, అవభ్రటుడు

బుఱ్ఱముక్కువాడు – ఖురణసుడు

ముడతలుపడ్డ చర్మం గలవాడు – వలినుడు, వలిభుడు

వికలాంగుడు – పోగండుడు

పొట్టివాడు – ఖర్వుడు, హ్రస్వుడు

దొడ్డికాళ్ళవాడు – ఊర్ధ్వజ్ఞువు, ఊర్ధ్వజానువు

వీపు వంకర చేత వంగిపోయినవాడు – కుబ్జుడు, గడులుడు

మఱుగుజ్జు – పృశ్ని

బట్టతలవాడు – ఖల్వాటుడు

మెల్లకంటివాడు – వలిరుడు, కేకరుడు

గ్రుడ్డి – అంధుడు

చెవిటి – బధిరుడు, ఏడుడు

కుంటివాడు – పంగువు, ఖంజుడు, ఖోడుడు

జబ్బు – రుజం, రుజ, ఉపతాపం, రోగం, రుగ్ణత, వ్యాధి, గదం, ఆమయం

రోగి – వ్యాధితుడు, అపటువు, గ్లానుడు, గ్లాస్నువు, ఆమయావి, ఆతురుడు, అభ్యమితుడు, అభ్యాంతుడు

ఆరోగ్యం – అనామయం

ఆరోగ్యవంతుడు – వార్తుడు, నిరామయుడు, కల్యుడు

జబ్బునుంచి కోలుకున్నవాడు – ఉల్లాఘుడు

వైద్యుడు – రోగహారి, అగదంకారుడు, అగదంకరుడు, భిషజుడు (భిషక్), చికిత్సకుడు

మందు – భేషజం, ఔషధం, భైషజ్యం, అగదం, జాయువు

క్షయ – యక్ష్మ, శోషం

జలుబు – పీనసం, ప్రతిశ్యాయం

తుమ్ము – క్షుతం, క్షవం

దగ్గు – కాసం, క్షవథువు

వాపు – శోఫం, శోథం, శ్వయథువు

చర్మం మీది మచ్చలు – కిలాసం, సిధ్మ

గజ్జి – కచ్ఛువ (కచ్ఛూ), పామం. పామ, విచర్చిక

దుఱద – కండువ (కండూ), ఖర్జువ (ఖర్జూ), కండూయ, కండూతి

బొబ్బ – విస్ఫోటం, పిటకం

పుండు – వ్రణం, ఈర్మం, అరుష్షు

సెగ్గడ్డ – నాడీవ్రణం

బొల్లి – శ్విత్రం

ఎఱ్ఱబొల్లి – కోకం, మండలకం

మొలలు – దుర్నామకం, అర్శం, అర్శ (అర్శస్/ అర్శో)

అతిసారం – గ్రహణి, ప్రవాహిక

కక్కులు/ డోకులు – ప్రచ్ఛర్దిక, వమి, వమథువు

Abscess – విద్రధి

Fistula – భగందరం

బట్టతల – ఇంద్రలుప్తకం

బోదకాలు (ఏనుగుకాలు) – శ్లీపదం

మూత్రపిండాల్లో ఱాళ్ళు – మూత్రకృచ్ఛ్రం, అశ్మరి

దద్దుర్లు – దద్రువులు

ఆకలి – అశనాయ, బుభుక్ష, క్షుత్తు (త్)

దాహం – ఉదన్య, పిపాస, తృట్టు (తృట్/ తృష్), తర్షం

ముసలితనం – జర, వార్ధకం, వార్ధక్యం, స్థావిర్యం, విస్రస

యౌవనం – తారుణ్యం

IV వివిధ పదార్థాలు

౧. వండనివి

అమృతం – పీయూషం, సుధ

కుంకుమ – కాశ్మీరికం, అగ్నిశిఖం, వరం, బాహ్లికం, పీతనం, పిశునం, ధీరం, లోహితం

లక్క – లాక్ష, రాక్ష, జతువు, యావం, అలక్తం, ద్రుమామయం

అగరు – వంశకం, అగురువు, రాజార్హం, క్రిమిజం, జోంగకం

నల్ల అగరు – కాలాగురువు

కస్తూరి – మృగనాభి, మృగమదం

కర్పూరం – హిమవాలుకం, సితాభ్రం, ఘనసారం

చందనం – గంధసారం, మలయజం, భద్రశ్రీ

హరిచందనం – తైలపర్ణికం, గోశీర్షం

ఎఱ్ఱచందనం – తిలపర్ణి, పత్రాంగం, రంజనం, కుచందనం

మైపూత – వర్ణకం, విలేపనం

లోహం (Metal) – తైజసం

బంగారం – స్వర్ణం, సువర్ణం, కనకం, హిరణ్యం, హేమం (హేమన్), హాటకం, తపనీయం, శాతకుంభం, గాంగేయం, భర్మం (భర్మన్), కర్బురం, చామీకరం, జాతరూపం, మహారజతం, కాంచనం, రుక్మం, కార్తస్వరం, జాంబూనదం, అష్టాపదం.

రత్నం – మణి, వారిజం

పగడం, విద్రుమం – ప్రవాళం

వెండి – రజతం, రూప్యం, దుర్వర్ణం, ఖర్జూరం, శ్వేతం

రాగి – తామ్రం, తామ్రకం, శుల్బం, మ్లేచ్ఛముఖం, ద్వ్యష్టం, వరిష్ఠం, ఉదుంబరం

ఇనుము – లోహం, అయస్సు (అయస్/ అయో), కాలాయసం, శస్త్రకం, తీక్ష్ణం, అశ్మసారం

ఇనప త్రుప్పు – మండూరం, సింహాణం

ఇత్తడి – ఆరకూటం, రీతి

గాజు (glass) – కాచం

పాదరసం – పారదం, చపలం, రసం, సూతం,

సీసం – నాగం, సీసం, యోగేష్టం, వప్రం

తగరం – త్రపువు, పిచ్చటం

మైలుతుత్తం – తుత్థాంజనం, శిఖిగ్రీవం, మయూరకం, కర్పరి

దూది – పిచువు, తూలం

దారం – సూత్రం

మైనం – మధూచ్ఛిష్టం, సిక్థకం

విషం – క్ష్వేళం, గరళం

విషాల్లో రకాలు – హాలాహలం (హలాహలం), కాకోలం, కాలకూటం, సౌరాష్ట్రికం, శౌక్లికేయం, బ్రహ్మపుత్రం, ప్రదీపనం, దారదం, వత్సనాభం

౨. వండినవి

వంటకం – భిస్స, భక్తం, అంధం (అంధస్, అన్నం, మోదనం, దీదివి

భోజనం – ఆహారం, జగ్ధి, జేమనం, నిఘసం, న్యాదం

ఊరగాయ – అవదంశం

పాలు – దుగ్ధం,క్షీరం, పయస్సు (పయస్/ పయో)

జున్నుపాలు – పీయూషం

పయస్యం – పాలతో చేసిన తిండిపదార్థం (milk product)

పాయసం – పరమాన్నం

పెఱుగు – దధి

మజ్జిగ – దండాహతం, కాలశేయం, గోరసం, తక్రం, ఉదశ్విత్తు (త్), మథితం

మీగడ – మండం, మస్తువు

వెన్న – నవనీతం, మ్రక్షణం

గొడుగెత్తిన పెఱుగు – ఆమిక్ష (ఇది గాలితోనూ, కఱుడుగట్టిన బుడగలతోనూ, దుర్వాసనతోనూ కూడి తినడానికి పనికిరాకుండా ఉంటుంది. చాలా వేడిగా ఉన్న పాలని తొందఱపడి తోడుపెడితే ఇలా జఱుగుతుంది)

మజ్జిగపులుసు – తేమనం, నిష్ఠానం

ఉప్పు – లవణం

మరమరాలు – ధానాలు

పిండివంట – పూపం, అపూపం, పిష్టకం

ముద్ద – గ్రాసం, కబళం

ఎంగిలి – ఫేల

కల్లు – సుర, హలిప్రియ, హాల, పరిస్రుత్తు (త్), పరిస్రుత, వారుణి, వరుణాత్మజ, గంధోత్తమ, ప్రసన్న, ఇర, కాదంబరి, మదిర, కశ్యం

ఇప్పపూలతో చేసిన కల్లు – మధ్వాసవం, మాధవకం, మధువు

ద్రాక్షసారా – మార్ద్వీకం

వివిధ పదార్థాల్ని కలిపి చేసిన సారా – మైరేయం, ఆసవం, శీధువు

నోటివాసనను ఇంపుగా చేసే పదార్థం – ఆమోది Mouth freshener

VII. సాధనాలూ, ఆయుధాలూ

వీణ – వల్లకి, విపంచి, పరివాదిని

మద్దెల – మృదంగం, మురజం

ఢక్క – యశం (స్), పటహం

పెద్దడప్పు – భేరి, దుందుభి

తప్పెట – ఆనకం

పిల్లనగ్రోవి – వేణువు

వల – ఆనాయం, జాలం

వలత్రాడు – శణసూత్రం,

చేపల బుట్ట – కువేణి, మత్స్యాధాని

గాలం – బడిశం

నేలను త్రవ్వే సాధనం – ఖనిత్రం, అవదారణం

కొడవలి – దాత్రం, లవిత్రం

పశువుల మెడకు కట్టే పలుపుతాడు – యోక్త్రం

పశువుల్ని కట్టే కొయ్య – శివకం, కీలకం

దర్భాసనం – బృసి

మృగచర్మం – అజినం, కృత్తి

వింజామర – చామరం

సింహాసనం – భద్రాసనం

గొడుగు – ఛత్రం, ఆతపత్రం

భృంగారం – బంగారుబిందె

బంధనార్థం మెడకు వేసే ఇనపగొలుసు – అందుకం, నిగళం

అంకుశం – సృణి

వాహనాల్ని లాగే పెంపుడుజంతువుల్ని తోలే ముల్లుకఱ్ఱ – తోత్రం, తోదనం, ప్రాజనం

ఏనుగు మీద పఱిచే రత్నకంబళి – ప్రవేణి, పరిస్తోమం, కుథం

కళ్లెం – కవిక, ఖలీనం

బండి – యానం, శకటం, గంత్రి, వాహనం, యుగ్యం, ధోరణం, అనస్సు (స్)

పల్లకి – శిబిక

ఉయ్యాల – డోల, ప్రేంఖ

రథం – స్యందనం

రథపు భాగాలు – అవస్కరాలు (accessories)

రథపు కాడులను బిగించడం కోసం ముందుభాగంలో ఏర్పాటుచేసిన కొయ్య (నొగ) – కూబరం, యుగంధరం

ఇఱుసు – అక్షం, అణి

బొమిడికం (helmet) – శిరస్త్రాణం, శీర్షకం, శీర్షణ్యం

కవచం – తనుత్రం, వర్మ, వర్మం (వర్మన్), దంశనం, ఉరశ్ఛదం, కంకటకం, జగరం

కాలిబంట్ల సైన్యం – పదాతి

ఆయుధం – ప్రహరణం, శస్త్రం, అస్త్రం

డాలు – చర్మం (చర్మన్), ఫలకం

విల్లు – ధనువు, ధనుస్సు (ష్), చాపం, ధన్వం, ధన్వ (న్), శరాసనం, బాణాసనం, కోదండం, కార్ముకం, ఇష్వాసం

వింటి అగ్రం – కోటి

వింటి మధ్యం (దాన్ని పట్టుకునే చోటు) – లస్తకం handle

విలుకాఱు తమ చేతికి దెబ్బ తగలకుండా తొడుక్కునే తోలుతొడుగులు – గోధలు Gloves

బాణం – పృషత్కం, విశిఖం, అజిహ్మగం, ఆశుగం, కలంబం, మార్గణం, శరం, పత్రి (న్), రోపం, ఇషువు, సాయకం, నారాచం

అంబులపొది – తూణం, తూణి, తూణీరం, ఉపాసంగం, నిషంగం, ఇషుధి

కత్తి – ఖడ్గం, నిస్త్రింశం, చంద్రహాసం, అసి, రిష్టి (ఋష్టి), కౌక్షేయకం, మండలాగ్రం, కరవాలం, కృపాణం

కత్తిపిడి –త్సరువు

చిన్న ఖడ్గం – ఈళి, కరవాలిక

కత్తివాదర (అంచు) – పాళి, అశ్రి, కోటి, కోణం

చాకు (కైజారు) – ఛురిక

ఈటె (బల్లెం) – ప్రాసం, కుంతం

గొడ్డలి – పరశువు, పరశ్వథం, స్వధితి, కుఠారం

చిన్నగొడ్డలి – కుఠారిక

జెండా – పతాకం, వైజయంతి, కేతనం, ధ్వజం

బొమ్మ – పాంచాలిక, పుత్త్రిక

కావడిబద్ద – విహంగిక

ఉట్టి – శిక్యం

పశుపక్ష్యాదుల్ని పట్టడానికి ఉపయోగించే ఉచ్చు మొదలైన సాధనాలు – వితంసం

ఉన్మాథం – బోను

కొరడా – కశ, తాడని

త్రాసు – నారాచి, ఏషణిక, తుల

సానఱాయి – శాణం, నికషం, కషం

ఆకుఱాయి – వృశ్చనం, పత్రపరశువు

మూస – మూష

కొలిమితిత్తి – భస్త్ర

ఉలి – టంకం

ఱంపం – క్రకచం, కరపత్రం

కుంచె – ఈషిక, తూలిక

VIII. నగలూ, శరీరప్రసాధన

శరీరాలంకరణ – ప్రసాధనం, పరిస్పందం

నగ – భూషణం, విభూషణం, అలంకారం, ఆభరణం, పరిష్కారం, పరిచ్ఛదం, మండనం

కిరీటం – మకుటం, కోటీరం

తలమానికం – చూడామణి, శిరోరత్నం

చెవులకు గానీ, తలకు గానీ పెట్టుకునే అలంకారం – అవతంసం

హారంలో నాయకమణి – తరళం

పాపటబొట్టు – పత్రపాశ్య, లలాటిక

చెవుల కమ్మ – కర్ణిక

మెడలో వేసుకునే నగ – గ్రైవేయకం

మెడలోంచి వేళ్ళాడుతున్న నగ – లంబనం, లలంతిక

కాసుల పేరు – ప్రాలంబిక

ముత్యాల హారం – ఉరస్సూత్రిక

ముత్యాల దండ – హారం, ముక్తావళి

నూఱుపేటల ముత్యాల హారం – దేవచ్ఛందం, శతయష్టికం

కడియం – ఆవాపకం, పారిహార్యం, కటకం, వలయం

బాహుపురి – కేయూరం, అంగదం

ఉంగరం – అంగుళీయకం, ఊర్మిక

కడియం కంటే సన్నగానూ, గాజు కంటే లావుగానూ ఉండే కరభూషణం – కంకణం

స్త్రీల మొలనూలు (ఇప్పుడు వాడుకలో లేదు) – మేఖల, కాంచి, సప్తకి, రశన, సారసనం

కాలి పెండేరం – పాదాంగుదం, తులాకోటి, మంజీరం, నూపురం, హంసకం, పాదకటకం

గజ్జె – కింకిణి

బట్ట – వస్త్రం, వసనం, వాసం (స్), చేలం, ఆచ్ఛాదనం, అంశుకం, పటం

నారబట్ట – వాల్కం

ప్రత్తివస్త్రం – ఫాలం, కార్పాసం, బాదరం

పట్టుబట్ట – కౌశేయం

జంతురోమాలతో చేసిన శాలువ, దుప్పటి, కోటు లాంటివి – రాంకవం

కొత్తబట్ట – అనాహతం, నవాంబరం, తంత్రకం, నిష్ప్రవాణి

సిల్కుబట్ట – క్షౌమం, దుకూలం

పాతబట్ట (చిఱిగినది) – పటచ్చరం

తుడుచుకునే బట్ట – నక్తకం, కర్పటకం

పడకమీద పఱిచే బట్ట (bedsheet) – నిచోళం

దుప్పటి – నీశారం, ప్రావరణం

కంబళి – రల్లకం, కంబళం

శాలువ – శాటి

ప్రధానంగా కట్టుకున్న బట్ట (చీర/ ధోవతి) – అంతరీయం, ఉపసంవ్యాసం, పరిధానం

ఉత్తరీయం – ప్రావారం, ఉత్తరాసంగం, బృహతిక, సంవ్యానం,

ఱవికె – చోళం, కూర్పాసకం

పందిరిమంచపు కప్పుదల – వితానం, ఉల్లోచం

తెఱ – ప్రతిసీర, యవనిక, తిరస్కరిణి

స్నానంలో ఒంటికి పూసుకునే పదార్థం – స్థాసకం

పూలదండ – స్రజం (స్రక్), మాల్యం, మాల, మాలిక

మెడలోంచి గుండెల మీద వేళ్ళాడేలా వేసుకున్న దండ – వైకక్షకం

తలమీద చుట్టబడిన దండ – ఆపీడం, శేఖరం

IX కొన్ని విశేషణాలు

సంస్కృతంలో విశేషణాలు అనంతం. నిజానికి ప్రతి నామవాచకాన్నీ కొన్ని లాక్షణిక ప్రక్రియలతో విశేషణంగా మార్చుకొని ప్రయోగించవచ్చు. అయినా కొన్ని ప్రాథమిక విశేషణాలు తెలిసి ఉండడం నూతన పదనిష్పాదనకు ఉపకరిస్తాయనే భావన తో ఈ క్రింద ఇవ్వడం జఱుగుతోంది.

చిన్న – లఘువు

పెద్ద – గురువు

పొడవు – దీర్ఘం

పొట్టి – హ్రస్వం

ఎక్కువ స్థలం కలిగిన – విశాలం, ఆయతం

ఇఱుకు – సంబాంధం

సన్నపాటి – తను

లావు – స్థూలం

గొప్ప – మహాంతం, మహా, మహాన్

బహుచిన్నది – అణుప్రాయం, సూక్ష్మం

మంచి – సత్, సు

చెడు – దుర్, దుస్, దుష్

దట్టమైన – సాంద్రం, గాఢం

పల్చని – విరళం, పేలవం

చీకటి గల – తమిస్రం

వెలుగు గల – ప్రకాశవంతం

రహస్యం – రహస్, రహో

బహిరంగం – బాహాటం

దగ్గఱ – సమీపం, నికటం, ఆరాత్

దూరం – దూరం

గట్టి – కఠినం, దృఢం

మెత్తని – మృదు, పేశలం

రుచి గల – స్వాదు, రుచ్యం

రుచిలేని – అరుచ్యం

సులభం – సలీలం

కష్టం – కష్టం

త్వర – రంహం (స్), తరస్సు (స్), రయం, స్యదం, జవం

త్వరగా – శీఘ్రం, త్వరితం, లఘువు, క్షిప్రం, అరం, ద్రుతం, సత్వరం, చపలం, తూర్ణం, అవిలంబితం, ఆశు

నెమ్మదిగా – మందం, అలసం

వెంటనే – సద్యస్, సద్యో

ఎల్లప్పుడూ – సతతం, సంతతం, అనారతం, అనవరతం, అవిరతం, అశ్రాంతం, అనిశమ్, నిత్యం, అజస్రం

చాలా ఎక్కువ – బహు, అతిశయం, అతివేలం, భృశం, అత్యర్థం, అతిమాత్రం, ఉద్గాఢం, నిర్భరం, తీవ్రం, ఏకాంతం, నితాంతం, గాఢం

తీక్ష్ణం – తీవ్రం, తిగ్మం, ఖరం

తీపి – మధురం

చేదు – తిక్తం

వగరు – తువరం, తూవరం, కషాయం

ఉప్పదనం – లవణం

కారం – కటువు

పులుపు – అమ్లం

మంచి వాసన గలిగిన – సమాకర్షి, నిర్హారి, సురభి, ఘ్రాణతర్పణం, ఇష్టగంధం, సుగంధి

దుర్వాసన గలిగిన – పూతిగంధం

పచ్చివాసన గలిగిన – విస్రం

ఈ క్రింద ఉదాహరించిన 11 విశేషణాలు వాక్కులకు అన్వయిస్తాయి.

గ్రుచ్చుకునే – నిష్ఠురం, పరుషం

ఓదార్చే – సాంత్వం

సత్యమైన – సూనృతం

అబద్ధమైన –ఆహతం, మృషార్థకం, వితథం, అనృతం

త్వరత్వరగా – నిరస్తం

అక్షరాలూ, పదాలూ సరిగా పలక్కుండా మింగేస్తున్న – గ్రస్తం

మాట్లాడకూడని – అనక్షరం, అవాచ్యం

తుంపురులతో కూడిన – అంబూకృతం, సనిష్ఠేవం

ఒకదానికొకటి పొసగని – సంకులం ambiguous or contradictory

దెప్పిపొడుస్తున్న – సోల్లుంఠనం, సోత్ప్రాసం

అస్పష్టమైన – మ్లిష్టం

(ధ్వని) మెల్లనైన – మంద్రం subdued, faintly heard, low-noise

బిగ్గఱ – తారం, ఉచ్చైస్, ఉచ్చైర్, ఉచ్చైష్ loud

(నీళ్ళు మొ||) నిర్మలమైన – అమలం, అచ్ఛం, ప్రసన్నం

కలగిన, కల్లోలమైన – ఆవిలం turbid

లోతు తక్కువగా ఉన్న – ఉత్తానం

బాగా లోతు గల – అగాధం

(భూమి) దున్నని – అప్రహతం

(దారి) పోవడానికి శక్యం కాని – దుర్గమం

రాబోయే/ కాబోయే – ఏష్యం, భవిష్యం

గెలిచే – జిష్ణువు

చాలినంత/ కావాల్సినంత – ప్రకామం, నికామం, పర్యాప్తం

పోలి ఉన్న – నిభం, సంకాశం, నీకాశం, ప్రతీకాశం, ఉపమం (వీటిని లింగానుగుణంగా నిభుడు, నిభ అని మార్చుకోవాలి)

సమానమైన – సమం, తుల్యం, సదృశం, సదృక్షం

సాటియైన/ సాటివచ్చే – ప్రతిమానం, ప్రతిమం, ప్రతిచ్ఛాయం

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.