cover

పద్మప్రాభృతకమ్ (9)

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం

స్వప్నాన్తే నఖదన్తవిక్షతమిదం శంకే శరీరం తవ

ప్రీయన్తాం పితరః స్వధాऽస్తు సుభగే వాసో౭పసవ్యం హి తే |

కించాన్యత్త్వరయా న లక్షితమిదం ధిక్ తస్య దుఃశిల్పినో

మోహాద్ యేన తవోభయోశ్చరణయోః సవ్యే కృతే పాదుకే ||

చోరి సహోఢాభిగృహీతా క్వేదానీం యాస్యసి | ఏషా హి ప్రవిశ్యన్తర్గృహముచ్చైః ప్రహసితా సహ రమణేన | (కర్ణం దత్వా) ఏష ఇరిమో వ్యాహరతి – “నను భో ధూర్తాచార్య ప్రవిశ్యతామ్” ఇతి | సఖే కః సురథరథధుర్యయాయోక్తృచ్ఛేదం కరిష్యతి | ఏవమేవావిరతసురతోత్సవోऽస్తు | గార్గీపుత్ర, సాధయామ్యహమ్ |

తవ = నీయొక్క, శరీరం = ఒళ్ళు, స్వప్నాంతే = కల గని లేచిన తర్వాత, (కలలో సురతం జరిగి అని శ్లేష) నఖదన్తవిక్షతమిదం = గోళ్ళ, పంటి నొక్కులకు గురి అయినదిగా, శంకే = అనుకుంటున్నాను. సుభగే = సుందరి, తే = నీ యొక్క, వాసోऽపసవ్యం = ఉత్తరీయం తిరగబడుట (వలన), పితరః, స్వధాః తు = పితరులు, పితృదేవతలు, ప్రీయన్తాం హి = తృప్తినొందుదురు గాక. కించ అన్యత్ = ఇంకనూ, తవ = నీయొక్క, ఉభయోః చరణయోః = రెండుపాదాలలో, యేన = ఎవనిచేత, మోహాత్ = మోహమువలన, తవ = నీయొక్క, పాదుకే = చెప్పులను, సవ్యే కృతే = బాగు చేయబడినదో, తస్య = అతని, దుఃశిల్పినః = పాదరక్షలను బాగుచేయు వాని ని, అనయా = నీచేత, ఇదం = ఇలా బాగు చేయుట, న లక్షితం ధిక్ = గమనింపబడలేదు. అయ్యో!

తాత్పర్యము: సుందరీ! నీ ఒంటిపై గోళ్ళ, పంటి నొక్కులు కలలో జరిగిన శృంగారక్రీడ వల్ల వచ్చినవి లే. నీ ఉత్తరీయం తిరగబడింది. అది పితృదేవతలను తృప్తిపరిచేదానికి అపసవ్యం చేయబడింది లే. అలాగే నీ పాదాల చెప్పులు తారుమారయినందుకు కారణం పాదరక్షకల శిల్పి. అందుకే నీవు దాన్ని లక్ష్యం చేయలేదు.

విశేషములు: శార్దూలవృత్తము. స్వప్నాన్తే = కల చివరన - అంటే కలలో శృంగారక్రీడ జరిగి, ఆ తర్వాత నిద్రలేవగానే, కలలో జరిగిన క్రీడ కారణంగా నొక్కులు వచ్చాయా? అని ఎగతాళి. వాసోపసవ్యం పితరః, స్వధాస్తు ప్రీయన్తాం - శ్రాధ్ధకర్మ (పితృకార్యం) చేసేప్పుడు, జంధ్యమును అపసవ్యదిశలో వేసుకుని జరపడం సాంప్రదాయం. దానిని దృష్టిలో పెట్టుకుని, ఈ అమ్మాయి ఉత్తరీయం అపసవ్యదిశలో తిరిగి ఉండటాన్ని పితృకార్యానికి ముడిపెట్టి వెక్కిరిస్తున్నాడు.

చోరి, దొంగతనపు సొమ్ముతో పట్టుబడిన నీవింకెక్కడ తప్పించుకుంటావు? ఆ.. ఆమె తన ఇంటిలోపలికి వెళ్ళి తన ప్రియునితో కలిసి పెద్దగా నవ్వుతున్నది. (చెవి యొగ్గి) ఇరుముడంటున్నాడు – “ధూర్తాచార్య ! లోపలకు రమ్ము” అని. మిత్రమా! శృంగారరథమునకు కట్టిన ఎద్దుల జోడిని ఎవడు విడిపించును? ఎలాగే నిరంతరము సురతోऽత్సవమగుగాక. గార్గీపుత్ర, ఇక నేనేతెంతును.

(పరిక్రమ్య) అయే కేయమిదానీం బాహ్యద్వారకోష్టకే దేవతాభ్యో బలిముపహరతి ?

నిభృతవదనా శోకలగ్నా నిరంజనలోచనా

మలినవసనా స్నేహత్యక్తప్రలంబఘనాలకా |

శిథిలవలయా పుష్పోత్క్షేపైశ్చుతాంగుళివేష్టనా

తరుణయువతిస్తన్వీ భూయస్తనుత్వముపగతా ||

ఆ ఏషా భాణ్డీరసేనాయా దుహితా కుముద్వతీ నామ | భోః కష్టమ్ | అప్రత్యభిజ్ఞేయా ఇయం తపస్వినీ సంవృత్తా | తత్ కస్యేయం వేశవాసవిరుద్ధం విరహయోగవ్రతం చరతి | ఆ విజ్ఞాతమ్ | తమేషా మౌర్యకుమాతం చంద్రోదయమనురక్తేతి శ్రూయతే | స చ సుభగః సామన్తప్రశమనార్థం దణ్డేనోద్యతః | హన్త భో ఉపపద్యతే చంద్రోదయవిరహాత్ కుముద్వతీ నిఃశ్రీకా సంవృత్తేతి | భోః ప్రత్యాదేశః ఖల్వియం కులవధూనామ్ | అపి చైష స్వభవనవలభీపుటస్థం విక్షిప్తబలిప్రణయోపస్థితం స్వాగతవ్యాహారేణాభినందతి వాయసమ్ –

(ముందుకు నడచి) అరే, ఎవరిది ? బయటి తలుపు వద్ద దేవతలకు బలినిడుచున్నది?

నిభృతవదనా = దిటవుగనున్న ముఖము గలది, శోకలగ్నా = దుఃఖించుచున్నది, నిరంజనలోచనా = కాటుక చెరగిన కనులది, మలినవసనా = మరకదుస్తులది, స్నేహత్యక్తప్రలంబ ఘనాలకా = తైలసంస్కారము లేని దీర్ఘకేశములు గలది, శిథిలవలయా = సన్నటి నడుముది, పుష్పోత్క్షేపైః = పూలు విసరుట వలన, చ్యుతాంగుళివేష్టనా = వీడిన వ్రేళ్ళుగలది, తన్వీ = సుతను సుందరి, తరుణయువతిః = కన్యామణి, భూయః = మిక్కిలి, తనుత్వముపగతా = శరీరమును పొందినది.

తాత్పర్యము: గంభీరమైన ముఖము గలది, దుఃఖిత, కరిగిన కాటుక కలది, మలినమైన దుస్తులది, తైలసంస్కారము లేని పొడవైన కేశములు కలది, చిక్కిన నడుముది, పూలు విసరుటచేత వీడిన వ్రేళ్ళది, సుతనువు గల ఈ సుందరి, తిరిగి లావుగయైనది.

విశేషములు: ఉపమాలంకారము. విరహజనితశోకము దీర్ఘకాలమనుభవించుట ఊబకాయమునకు హేతువు. హరిణీవృత్తము (న స మ ర స లఘువు గురువు. ప్రతిపాదమున పదిహేడు అక్షరములు)

ఆ, ఈమె భాండీరసేన కుమార్తె కుముద్వతి యనునది. అహో, కష్టము. ఈ తపస్విని గుర్తుపట్టకుండగ తయారయినది. ఎవనికై ఈమె తన వేషమునకు విరుద్ధముగ విరహవ్రత మాచరించుచున్నది. ఆ తెలిసినది. ఈమె ఆ మౌర్యకుమారుడైన చంద్రోదయునిపై మరులు గొన్నదని విన్నాను. ఆ సౌభాగ్యవంతుడు సామంతులను యణచుటకు వెడలెను. హా, చంద్రోదయవిరహముచేత ఈ కుముద్వతి భాగ్యహీన అయినది. ఈమె కులవధువులను కూడ జయించినది. తన ఇంటి చూరుపై నిడిన బలియన్నమునకై వచ్చిన కాకికి ఇలాగున స్వాగతవచనము చేత అభినందించుచున్నది –

భద్రం తే వలభీగవాక్షతిలకశ్రాద్ధోపహారాతిథే

జీవన్త్యాం మయి కచ్చిదేష్యతి స మే నిత్యప్రవాసీ ప్రియః |

యద్యాగచ్ఛతి గచ్ఛ తావదితరద్వారాశ్రితాం తోరణం

నిఃశోకా హి సమేత్య మే ప్రియతమం దాస్యామి దధ్యోదనమ్ ||” ఇతి |

అహో తు ఖలు నిష్కైతవోऽనురాగః | అనపహాసక్షమమేతత్ రాజయౌతకమ్ | మహిప్యావగుణ్ఠనభాగినీ భవత్యేషా | ఇతో వయమేకాన్తేన గచ్ఛామః | (పరిక్రమ్య) –

అహో అయమిదానీం దక్షిణేన వృక్షవాటికాం భూషణప్రసాదాత్ సంభ్రాన్త విహగసంకులః శబ్ద ఇవ శ్రూయతే | భవతు | అపావృతద్వారేయం వృక్షవాటికా | యావదవలోకయామి | (విలోక్య) హీ హీ నయనోత్సవః ఖల్విహ వర్తతే | తథాహి – పాంచాలదాస్యా దుహితా ప్రియంగుయష్టికా నామ జఘనోత్సేకోత్పాదితాహంకారేణ యౌవననవరాజ్యకేన విలోభ్యమానా నానావిలాసభావహావదాక్షిణ్యసముదితా సఖీజనపరివృతా కందుకక్రీడామనుభవతి | యైషా -

వలభీగవాక్షతిలకశ్రాద్ధోపహార అతిథే = ఇంటిచూరున గల గవాక్షమున నిడిన కుంకుమ కలిపిన శ్రాద్ధన్నమును స్వీకరించు అతిథీ!, తే భద్రమ్ = నీకు శుభము. మే = నాయొక్క, సః నిత్యప్రవాసీ ప్రియః = ఆ నిరంతరప్రవాసమున గల ప్రియుడు, జీవిన్త్యాం మయి = జీవించి ఉన్న నన్ను, కశ్చిత్ ఏష్యతి = ఎప్పుడైనా పొందగలడా? యది ఆగచ్ఛతి = వచ్చినచో, తావత్ = అప్పుడు, ఇతరద్వారాశ్రితం తోరణం = ఇంకొక ఇంటి ద్వారమునగల తోరణమునకు, గచ్ఛ = పొమ్ము. మే = నాయొక్క, ప్రియతమం = ప్రియతముని, నిఃశోకా హి సమేత్య = శోకమును వీడి అతనితో చేరి, దధ్యోదనం = పెరుగన్నమును, దాస్యామి = ఇత్తును.

తాత్పర్యము: చూరున గల గవాక్షమున చేరిన ఓ వాయసమా! నీకు శుభము. నా నిత్యప్రవాసి ప్రియుడు, తనకొరకే జీవించిన నన్ను ఎప్పుడు చేరును? అతడు వచ్చిన, నీవు పక్కింటి ద్వారతోరణమునకు పొమ్ము. అతనితో కలిసి ఆనందముగ నీకు పెరుగన్నమును సమర్పింతును.

విశేషము: ప్రోషితభర్తృక యను నాయిక వర్ణనము. కరుణ గర్భితము. శార్దూలవృత్తము. (మ స జ స త త గ)

అహో, నీ యనురాగము మచ్చలేనిది. ఈ రాజకుమారి యను వరమాలను పరిహాసము చేయుట తగదు. ఎవడైన రాజవృషభుని చేత నీమె వధూభావపు మేలిముసుగు తొలగించబడుగాక. ఇక మేము ఒంటరిగ వెళ్ళుదుము. (ముందుకు నడచి)

అరే, ఇప్పుడిది దక్షిణమున వృక్షవాటికలను నాశ్రయించిన పక్షుల కలకలారావము వలె వినిపించుచున్నది. కానిమ్ము. ఈ తోట తలుపు తెరచియున్నది. ఇక పరికింతును. (చూచి) ఆహా, ఇక్కడ నయనోత్సవముగ నున్నది గదా! అందుకే పాంచాలదాస్య కూతురు ప్రియంగుయష్టిక అను తరుణయవ్వని నితంబముల వృద్ధి చేత గర్వితురాలై నానా హావభావవిలాసదాక్షిణ్యములతో, సఖీజనముతో చేరి బంతియాట ఆడుచున్నది. ఈమె -

ప్రవాళలోలాంగుళినా కరేణ

మానః శిలంకందుకముద్వహన్తీ |

స్వపల్లవాగ్రాభిహతైకపుష్పా

నతోన్నతా నీపలతేవ భాతి ||

ప్రవాళలోల అంగుళినా = నవపల్లవముల పగిది వ్రేళ్ళచేత, కరేణ = చేతితో, మానఃశిలం = పగడమువంటి, కందుకం = బంతిని, ఉద్వహన్తీ = పట్టుకొన్నది. స్వపల్లవ అగ్ర అభిహతైక పుష్పా = చివురుటాకుల చివరన కుసుమించిన పుష్పములు గల, నతోన్నతా = పైకి క్రిందకూ కదలుచున్న, నీపలతా ఇవ = కడిమితీవె లాగున, భాతి = ప్రకాశించుచున్నది.

తాత్పర్యము: నవపల్లవముల వంటి యెర్రనైన చేతులతో పగడము వంటి బంతిని పట్టుకున్న యువతి, చివురుటాకుల చివరన కుసుమించిన పుష్పములు గల కడిమెతీవె వలె ప్రకాశించుచున్నది.

విశేషములు: మనోహరమైన ఉపమ. కడిమిచెట్టు వర్షాకాలమున దీపపు వెలుగుల కుప్ప వలె ప్రకాశించును. దీనిని కవులు మిక్కుటముగ వర్ణించియున్నారు. శూద్రకమహాకవియే తన మృచ్ఛకటిక నాటకమున వర్షఋతు వర్ణన యందు కదంబమును యద్భుతముగ వర్ణించెను. స్వపల్లవాగ్రాభిహతైక పుష్పా. ఇది వస్తుధ్వని. కడిమి చెట్టు కొమ్మన చివురుటాకుల చివరన ఉదయించిన సుమమని యర్థము. లేజేతుల యొక్క వ్రేళ్ళయందిడుకొనిన బంతి యని చమత్కారము. కడిమి పువ్వునూ చూచుటకు బంతివలె నుండును. (ఉపేంద్రవజ్ర - జ త జ రెండు గురువులు)

kadimipuvvu

కామకస్యాః సందర్శనమేవానర్ఘో లాభః | భవతు | సంతుష్టస్యాపి జనస్య న త్వమృతే పర్యాప్తిరస్తి | అతోऽభిభాషిష్యే తవదేనామ్ | (ఉపగమ్య) వాసు ప్రియంగుయష్టికే కిమిదం కందుకక్రీడావ్యాజేన నృత్తకౌశలం ప్రత్యాదిశ్యతే సఖీజనస్య | కథం స్మితమాత్రదత్తప్రతివచనా క్రీడత్యేవ | ఆ యథా కందుకోత్పాతాన్ గణయన్త్యస్యాః పరిచారికాః శంకే పణితమనయా సఖీభిః సహోపనిబద్ధమితి |

అహో పణితప్రీతిః | సర్వథా నతోన్నతావర్తనోత్పతనాపసర్పణప్రధావన చిత్రప్రచారమనోహరమ్ | యదృచ్ఛయా దృశ్యమాసాదితం ఖల్వస్మాభిః | కిం బహునా |

శంకే పరివర్తననివర్తనోద్వర్తనపర్యాధ్మాతవసనాన్తర ప్రవేశకుతూహలో వాయురప్యేనామభికామోऽనుభ్రమతీతి | యత్సత్యం స్వభావదుర్బలత్వాదేకపాణిగ్రాహస్య యౌవనపీఠపయోధరభారనమితస్య బిభేమ్యహమస్యా మధ్యవిసంవాదనస్య | న శక్యామేనాముపేక్షితుమ్| అభిభాషిష్యే తావత్ | అయి యౌవనోన్మత్తే స్వసౌకుమార్యవిరుద్ధః ఖల్వయమారంభః క్రియతే | విరమ విరమ తావత్ | అయే త్వాం ఖలు బ్రవీమి | కథముపారోహత్యేవాస్యాః ప్రహర్షః |

హన్త ఇదానీమాశాస్యే -

ఈమెను చూచుటయే ఒక వెలలేని లాభము. కానిమ్ము. ప్రీతి చెందిన వారు అమృతముతోనూ సరిపెట్టరు. కావున ఈమెతో సంభాషింతును. (చేరికొని) బాలా! ప్రియంగుయష్టికా. ఏల నీవు బంతియాడునెపమున సఖుల నృత్తకౌశలమును ఆదేశించుచున్నావు? మందహాసపూర్వకమైన సమాధానము మాత్రమునిచ్చి తిరిగి యాటలో నిమగ్నమైనది. ఆ, పరిచారికలు బంతి ఎన్నిసారులు క్రిందపడెనో లెక్కించుచున్నారు. చెలులతో నేదో పందెమొడ్డినది యనుకొనుచున్నాను.

ఆహా, పందెపు ఉత్సాహము! ఎల్లెడలా పరిగెత్తుట, క్రిందకు వంగుట, పైకి లేచుట, వెనుకకు మరలుట వంటి అంగచాలనములతో అతిమనోహరమైన యరుదైన చలనచిత్రమును చూచితిని. మాకొరకే ఈ దృశ్యము తీర్చినది కాబోలు. పెక్కేల?

అటునిటు తిరుగుచు, వెనకకు మరలుచు, పైకెగురుచు, దుముకుచు నున్న యీమె వస్త్రముల మధ్యన జొరబడు మందానిలము కోర్కె చేత ఈమెననుసరించుచున్నట్లున్నది. ఈ యువతి స్తనభారముల చేత సన్నని నడుము తాళక క్రిందికి పడరాదు. ఇక ఈమెను పలుకరింపక ఉపేక్షింపరాదు. ఈమెతో నిక మాట్లాడుదును. యౌవనముచేత గర్వమునందిన తరుణీ. సౌకుమార్యవిరుద్ధమైన పనిని చేయుచున్నావు. ఇక ఆపుమాపుము. అరే, నిన్ను గూర్చియే చెప్పుచున్నాను. ఏల నీ ఆనందము పొంగుచున్నది?

హా! ఇది నా యాశంస.

(తరువాయిభాగం వచ్చేవారం)

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.