palaparthi cover

self నెత్తిన పాలు

పాప పొద్దున్నే రాగాలు తీయడం ప్రారంభించింది.

నాతో ఆడుకోవడానికి friends ఎవరూ లేరూ.. అంటూ ఏడవడం మెదలెట్టింది.

కొత్త ఊరికి వచ్చేసారు వాళ్ళు.

పాప స్నేహితులంతా పాత ఊళ్ళో ఉండిపోయారు.

కొత్త స్నేహితులింకా దొరకలేదు.

ఎప్పుడూ ఎవరొస్తార్రా ఆడుకోవడానికి?

నువ్వే ఆడుకోవాలి నీ బొమ్మలతో!

అంది అమ్మ.

నీతో నువ్వే.

నీ self తో.

సరేనా? అంది.

self అంతే ఏంతి?

అడిగింది పాప విస్మయంగా.

self అంటే నీలాగే ఉంటుంది.

నీలోనే ఉంటుంది.

ఎవరున్నా లేకున్నా

నీకు తోడుగా ఉంటుంది.

ఎప్పుడూ happy గా ఉండాలని

ఆడుకోవాలని

చెబుతుంది.

జ్ఞాన బోధ చేసింది అమ్మ.

self అంతే నాలోపల ఉంతుందా?

అడిగింది పాప.

అవును.

నీలోపలే ఉంటుంది.

సరే గాని,

పాలు తాగు ముందు.

పాలు తెచ్చిచ్చింది అమ్మ.

బుగ్గల నిండా

పాలు తీసుకుని

గుటక మింగి,

అమ్మా, ఇప్పుడు పాలు నా పొత్తలో వెల్లాయి కదా!

అవి self తల మీద పడతాయా?

పొట్ట వంక చూపిస్తూ

అడిగింది పాప.

 *

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

 

Posted in 2014, చిట్టి చిట్టి మిరియాలు, డిసెంబర్, సీరియల్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.