cover

పదనిష్పాదన కళ (29)

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

పదిహేడో అధ్యాయం

ఆంగ్లపదాలకు అంతర్జాలంలో తెలుగుబ్లాగర్లు నిష్పాదించిన నూతన సమానార్థక పదజాలం (పునరుద్ధరణలతో సహా)

auto – స్వతహా

mundane – ప్రాపంచికం

abandoned – పరిత్యక్తం

absentee landlord – దూరస్థ భూస్వామి

abstract (adj.) – అమూర్తం

acceptability – అంగీకారయోగ్యత

achievement – సంసాధింపు

acid attack – ఆమ్లదాడి

acid bottle – ఆమ్లసీసా

action items – తక్షణ చర్యలు

actionable – చర్యాస్పదం

add-ons – చేర్పులు, కొసర్లు

adults – వయోజనులు (16 ఏళ్ళు పైబడ్డ స్త్రీ, లేదా 18 ఏళ్ళు పైబడ్డ పురుషుడు. కానీ వేఱువేఱు దేశాలు దీన్ని వేఱువేఱు వయఃపరిమితులతో నిర్ధారిస్తాయి)

advisory – సలహావళి

agenda – కార్యావళి, కార్యాళి

aggregator site – సంగ్రాహక నెలవు, సంకలిని

air-traffic – వైమానిక సమ్మర్దం (వాయురద్దీ)

alarm bells – ప్రమాదఘంటికలు

alignment పొందిక

allotted – కేటాయితం

all-rounder – సకల కళావల్లభుడు

alluvial soil – ఒండ్రునేల

amateurish – ఔత్సాహికం

amended – సవరితం

annual inspection – వార్షిక తనిఖీ

anonymity – అజ్ఞాతత్వం, అనామకత్వం

anonymous surfing – అజ్ఞాత విహరణం

anti-evolutionary tendency – పరిణామ వ్యతిరేక పోకడ

applicable – అనువర్తనీయం

archives – కైఫీయతులు

aspect – పార్శ్వం

assailant – దాడికారుడు

assumption – అనుకోలు

atomization –అణూకరణ, అణూభవనం, కణీభవనం

attachment (email) – జోడింపు, జతపఱుపు

attachment (psychology) – సంగం

attacker – దాడికారుడు

attitude – మనోవైఖరి

attribution – ఆపాదించడం

audio – శ్రవ్యకం

audio equipment – శ్రవ్యక సరంజామా

audio file – శ్రవ్యక కవిలె/ దస్తరం

authentic source – ప్రామాణిక ఆకరం

author – ప్రణేత

authority – శ్రద్ధాస్థానం

authorization – అధీకరణ

authorized – అధీకృతం

automatic – స్వయంతంత్రం

aviation – డయనం (విమానయానం)

awareness – జాగృతి, పరిజ్ఞానం

balanced – సమతూకం

bare details – పొడివివరాలు

basic resource – ప్రాథమిక వనరు

beaten track – నలిగిన బాట

beautification – అందగింపు, సుందరీకరణ

beautify – అందగించు, సుందరీకరించు

bestiality – జంతురతి

bias – ప్రమతం (ప్ర = ముందు )

bio-degradable – సహజ శిథిలనీయం, జీవ శిథిలనీయం, జీవక్షయణీయం

bio-fuel – జీవేంధనం

blanket branding – చాపచుట్టుడు ముద్రాంకన, ఏకచ్ఛత్త్ర ముద్రాంకన

blasphemy – దైవనింద, భగవన్నింద

body sprays – పైమీది చల్లులు

bold letters – లావాటి అక్షరాలు

booking – పుస్తకించడం

boom period – పొంగుతరుణం

borrowers – ఋణగ్రహీతలు

brand loyalty – ముద్రాంకాభిమానం

brand value – ముద్రాంక విలువ

branding – ముద్రాంకించడం

broad classification – స్థూల విభజన

broad-based – విశాలప్రాతిపదికం

bug – పురుగు

builder – కట్టుబడిదారు

busy – వ్యాపృతం

captain – తండేలు

career – వ్యాసంగం

career advancement – వ్యాసంగిక ప్రగతి/ విజయం

career choice – వ్యాసంగ ఎంపిక

career guidance – వ్యాసంగ మార్గదర్శనం

careerist – వ్యాసంగపరాయణుడు

case-to-case approach – ప్రతిజన వ్యవహరణ

casual – యథాలాపం

cell phone – చరం

cellular phone towers – చరగోపురాలు

chaos – అస్తవ్యస్తత

check box – సైపేటిక

child abuse – బాల్యవేధింపు

chorus – బృందగానం

chroniclers – చరిత్ర నమోదకులు

circumstantial evidence – ప్రాస్తావిక రుజువు, పారిస్థితిక రుజువు

citing – ఉదాహరించడం

civic sense – పౌరబాధ్యతాస్పృహ

civil dress – పౌరవేషం

civil life – పౌరజీవనం

class – వర్గం

click – నొక్కు

client – గిరాకీదారు

clue – జాడ

code – సంజ్ఞావళి

co-education institutions – సహవిద్యాసంస్థలు

collateral damage –పరిసరధ్వంసం

collective originality – సమష్టి స్వోపజ్ఞ

combatant division – పోరుదళం, పోరాటదళం

combo box = సంయుత పెట్టె లేదా సంయుక్త పేటిక (మనం టైపు చెయ్యవచ్చు లేదా

command button = ఆదేశ బొత్తాం

commission and ommission – దోషమూ, ప్రత్యవాయమూ

common code –ఉమ్మడి అనుశాసనం

common sense – ఇంగితం

company – సార్థవాహం

compatible – పొంతన

compatible – పొంతనవంతం

composite population – సమ్మిశ్ర జనాభా

compulsions – అనివార్యతలు

computer – కలనయంత్రం

concept – పరిభావన

concessioon – వెసులుబాటు

conclusion – పిండితార్థం

conference – ఇష్టాగోష్టి

confirm password – సంకేతపదాన్ని ధ్రువీకరించు/ఖాయపఱచు

conflict – వైరుద్ధ్యం

confusion – అయోమయం, గందరగోళం

conscious knowledge – స్పృహవంత జ్ఞానం

conservation – సంరక్షణ

content – విషయభరం

continuation – కొనసాక

continuous process – ఎడతెగని ప్రక్రియ, నిరంతర ప్రక్రియ

contradictions వ్యాఘాతాలు

contribution – వితరణ

contribution (to journals etc) – విషయదానం

controlled conditions – నియంత్రిత పరిస్థితులు

conversion (religious) – సంపరివర్తన

convert – సంపరివర్తితుడు

copyright violations – ప్రతిహక్కుల ఉల్లంఘన

core personality – అంతరాళ వ్యక్తిత్వం

core principles – మూలసూత్రాలు

corrected – సవరితం

couriers – హర్కారా

cousin sister – మేనచెల్లెలు

creational – సర్గీణం

credit card – ఋణఱేకు

credit-worthy – ఋణార్హుడు

criminal (adj.) – నేఱపూరితం

critical mass – కీలక పరిమాణం, కీలక ద్రవ్యరాశి

culture shock – సంస్కృతిఘాతం

culturization -సంస్కృతీకరణ

currency (form of money) – నాణ్యకం, నాణెకం

customer – గిరాకీదారు

customizing – అనురూపించడం, వ్యక్తిగతీకరించడం

cyclic progression – చక్రీయగతి, చక్రీయగమనం

cyclic recurrence – చక్రీయ పునరావృత్తి

data – భోగట్టా

database – దత్తభూమి

day-to-day expediencies – రోజువారీ అనివార్యతలు

debit card – ఆదానఱేకు

de-branding – విముద్రాంకించడం

default – అప్రమేయం

degenerative diseases – క్షీణకారక రుగ్మతలు

de-humanization – అమానవీకరణ

demand – నిలదీత

demographic composition – జనాభా కూర్పు

demography – జనాభాకూర్పు

depression – క్రుంగుబాటు

detached state – నిర్మమ స్థితి

dichotomy – ద్వైధీభావం

dieticians – పథ్యవేత్తలు

dimension – పార్శ్వం

direct dealing – ప్రత్యక్ష లావాదేవీ/ వ్యవహరణ

disable – అచేతనం చేయి

discard- పారవేయు

disclaimer – నిష్పూచి

discoverer – కనుగోలరి

discovery – కనుగోలు

distorted – వికృతం

distribution – వితరణ

disturbance – ఏకాగ్రతాభంగం

divisive force – విభాజక శక్తి

divorcee – విడాకరి

document – దస్తావేజు, కృతి, పత్రం

dogma – పిడివాదం

domain name – సీమానామం, సీమనామం

double action – ద్విపాత్రాభినయం

double click – జమిలి నొక్కు

download – దించుకొను (దింపుకోలు)

downstream – పల్లం, మెఱక, లోతట్టు

drop cap – ప్రవర్ణ దింపు

drop-down menu – జారుడు జాబితా

dungeon – గూభ్యం

duration – సేపు, నిడివి

dynamic – పరిప్లవం

economic boom – ఆర్థికోల్బణం

editor – చేర్పరి

effective – ప్రభావవంతం

element of love – ప్రేమధాతువు

elite – కులీనులు

elite class – కులీనవర్గం, శిష్టవర్గం

mail – వేగు

embed – పొందుపఱచు

emerging skills – పరిణమంత నైపుణ్యాలు

emotional intelligence – భావోద్వేగప్రజ్ఞ

emphasis – వక్కాణింపు, ఊనిక, పట్టు

empowerrment – సాధికారీకరణ

enable – సచేతనం చేయు

encrypt – (v) సంకేతించు

encyclopaedia – విజ్ఞానసర్వస్వం

enduring value – చిరస్థాయి మూల్యం

energy-intensive – శక్తి-అపేక్షకం

enlightened despot – ప్రాజ్ఞనియంత

enterprising nature – వ్యాపార చొఱవ

entity – స్వమూర్తి

equation- సమీకరణ

error – దోషం

erudite – వైదుషికం

etymology – వ్యుత్పత్తి, నిరుక్తి

ever-changing – నవనవోన్మేషం

exclusive – వియోజకం

expctation – ఆశంస

expectation – ఆశంస

expression – వ్యక్తీకరణ, అభివ్యక్తి

extinct – లుప్తం

extinction – అంతరింపు

extrovert – బహిర్ముఖుడు

face powder –ముఖచూర్ణం (మొహంపొడి)

fall – పతనం

false cases – అక్రమ అభియోగాలు

farce – ప్రహసనం

farm house – తోటవిడిది

father figure – జనకమూర్తి

feature – లాంఛనం

feed – వడ్డింపు

feminine kinships – స్త్రైణ బాంధవ్యాలు, జామిత్వాలు (తల్లి, చెల్లి, భార్య మొ|| )

file – కవిలె

fine details – సూక్ష్మవివరాలు

fixed format – నిర్దిష్ట సంప్రకారం

fixed timings – నిర్ణీత వేళలు

flagship company – నాయకసంస్థ, మాతృసంస్థ

flood-prone – వఱదసంభావ్యం

flooring – గచ్చు

fluctuations – చాంచల్యం

flyover – భూవంతెన

follow-up – స్థితి విచారణ

font – ఖతి

foot notes – పాదటిప్పణి, అధోజ్ఞాపిక

formal dress – శిష్టవేషం, శిష్టవస్త్రధారణ

formal education – నియతవిద్య, శిష్టవిద్య

formal education system – నియత విద్యావిధానం

format – సంప్రకారం, ఆకృతి

formatting – సంప్రకారించు

fossil fuel – శిలాజేంధనం

fourth estate – నాలుగో జమీ

fragments – తునకలు, చిద్రుపలు

free choice – స్వేచ్ఛాయుత ఎంపిక

freedom of choice – ఎంపికస్వేచ్ఛ

Frequency – పౌనఃపున్యం, తఱచుదనం

frustration – నిస్పృహ, నిరాశోపహతి

full-fledged – పూర్తిస్థాయి

full-time – పూర్తికాలికం

function (సాంకేతిక సందర్భాల్లో) – ప్రమేయం

furniture – పట్టెసామాను

future contingencies – భావి-అత్యవసరాలు

gap – ఎడం, అంతరం

gated community – ప్రాకారిత బస్తీ

gateway – ప్రాకారతోరణం

gender – లింగజాతి

gender-neutral words – లింగాతీత పదాలు (రెండులింగాలకీ సమానంగా వర్తించే పదాలు)

gene-pool – జన్యునిధి

generation gap – తరాల అంతరం

genetic defect – జన్యులోపం

genetic peculiarity – జన్యువైచిత్రి

germ-free – క్రిమిరహితం

gestation period – పొదుగుడుకాలం

glacier – హిమాని, హిమానీనదం

globalization – ప్రపంచీకరణ

glorification – ఘనపఱపు

glorify – ఘనపఱచు

ground level – భూమట్టం

hard copy –పటుప్రతి

hard power – కఠినాధికారం

hard work – కఠోరశ్రమ

head of the department – విభాగాధిపతి

helicopter – విమానిక

hereditary genes – పారంపరిక జన్యువులు

hero-worship – వీరారాధన

hierarchy – సోపానక్రమం

higher source of energy -ఉన్నతస్థాయి శక్తికేంద్రం

highest authority – పరమప్రామాణికం

highlighted – ఉద్ద్యోతితం

highlighting – ఉద్ద్యోతించడం, ఉద్ద్యోతనం

hint of neutrality – తటస్థతాధ్వని, తటస్థతాసూచన

historical records – చారిత్రిక ఉల్లేఖాలు/ నమోదులు

historical wrongs – చారిత్రిక అన్యాయాలు

hit-list – ఖతం జాబితా

hormone – గ్రంథిజం, స్రావకం

human element – మానవీయాంశ

humanities – మానవీయశాస్త్రాలు

humming – ఈలపాట

hung up – స్తబ్ధం

hybridization – సంకరణం

hyper-organization – అతివ్యవస్థీకరణం

hyper-sensitive– అతిసున్నితం

hypocrites – స్వవచోవ్యాఘాతులు

icon – ప్రతీకం

ID card – గుర్తింపుఱేకు

identify కావడం – (ఒకఱితో/ ఒకదానితో) తాదాత్మ్యం చెందడం

ill-treatment – చెడుమన్నింపు, అవమన్నింపు

image – మూర్తిమత్త్వం

immediate cause – నిమిత్తకారణం

immigrant – వలసదారు

impressionable – ముద్రాస్పదుడు

impressionable age – ముద్రాస్పద వయసు

impressive strategy – హృదయంగమ వ్యూహం

in principle – సూత్రప్రాయంగా

in-built – అంతర్ నిర్మితం

incest – వావిడికం

incidence of fertility – సాఫల్యఘటన

nncidental expenses – అవాంతర వ్యయాలు/ ఖర్చులు

inclusive – సంయోజకం

indirect employment – పరోఽక్ష ఉపాధి

indispensable evil – అనివార్య దోషం

inferiority complex – ఆత్మన్యూనతా భావన

influential – ప్రభావశీలం

inherent – అంతర్నిహితం

initiative – చొఱవ

inner conflict – అంతస్సంఘర్షన

input – ఉపచయం

insecure families – అభద్ర కుటుంబాలు

insensitive – అసున్నితం, అమృదులం

install – స్థాపించు, నెలకొల్పు

instance – మచ్చుతునక, తార్కాణం, దృష్టాంతమ్

instant – తక్షణం

interactive – వినిమయాత్మకం, పారస్పరికం

interest group – ప్రయోజన గుంపు

interface – అంతరవర్తి

internet connection – అంతర్జాల అనుసంధానం

interview – ముఖాముఖి

introductory – పరిచాయికం

introspection – ఆత్మవిమర్శ

introvert – అంతర్ముఖుడు

intuition – ఉపజ్ఞ

invented – ఆవిష్కృతం

invention – ఆవిష్కార

inventor – ఆవిష్కర్త

irrational – నిర్హేతుకం

irrational side – అహేతుక పార్శ్వం

irreversible – అనివర్తనీయం

italics – వాలు అక్షరాలు

itemization – వింగడింపు

jargon – పరిభాష

jurisdiction – అధికారపరిధి

key (in keyboard) – మీటకం

key lever – బిస

keyboard – మీటకం

kinship – వావి

knowhow – పరిజ్ఞానం

label – నామాంకం

labour-intensive – శ్రమసాపేక్షం, శ్రమాధారితం, శ్రామికసాపేక్షం, శ్రామికాధారితం

land-locked area – నిక్షోణి

landmark – కొండగుర్తు

laptop – అంకోపరి

larger than life – నిలువెత్తుకు మించి(న)

last but one (penultimate) – ఉపధ (సమాసంలో ఉపధా- )

lawless society – చట్టహీన/ చట్టరహిత సమాజం

layer – పొఱ, స్తరం

legal plane – చట్టతలం, శాసనతలం

legitimacy – ధర్మబద్ధత, న్యాయబద్ధత

lexical sense – నైఘంటికార్థం

liberal democracy – ఉదారవాద ప్రజాస్వామ్యం

limiting – పరిమాపన

line of command – ప్రశాసనక్రమం

linear progression – రేఖేయగతి, రేఖేయగమనం

link – లంకె

list box = జాబితా పెట్టె

living language – జీవంత భాష, జీవద్భాష

living society – జీవత్సమాజం, జీవంత సమాజం

love marriage – గాంధర్వవివాహం

lower source of energy – అధమస్థాయి శక్తికేంద్రం

loyal – విధేయం

lumpen culture – అలగాసంస్కృతి

macro – స్థూలం

maiden surname – పుట్టినింటి పేరు

(corporate) major – వ్యాపార దిగ్గజం

male kinships – పౌంస్న బాంధవ్యాలు (తండ్రి, అన్న, భర్త)

manipulation – కిట్టింఫు

man-made calamity – మానవకల్పిత ఉత్పాతం/వైపరీత్యం

margin –పక్కం

mark – అంకం

marketable – విపణియోగ్యం

marketing – విపణింపు

marks memorandum – అంకపత్రం

mass hysteria – సామూహిక ఉన్మాదం

mass religion – మహాజన మతం

mass trends – మహాజన పోకడలు

material outlook – పాదార్థిక దృక్కోణం

material want – పాదార్థిక లేమి

materialism – పదార్థవాదం

maximize – పెద్దగించు, స్ఫారించు

medical complication – వైద్యకీయ/ రోగ సంక్లిష్టత, విషమత్వం

medical history – రోగచరిత్ర

memory space – జ్ఞాపక జాగా

menopause – ఆర్తవాంతం

menu – ఆదేశావళి

meritocracy – ప్రతిభాస్వామ్యం, ప్రతిభాధార సమాజం

micro – సూక్ష్మం

miniature సూక్ష్మరూపం

minimize – చిన్నగించు

minimum possible damage = కనీస సంభావ్య నష్టం

mint – టంకశాల

minting – టంకించడం

misconduct – దుష్ప్రవర్తన

misfit – ఇమడమిటి

mismatch – విజ్జోడు

miss World contest – ప్రపంచ సుందరి పోటి

missing link – లుప్త లంకె

mobile – చరం

modification – సవరణ

monolithic – ఏకాండి

monomania – ఏకరంధి

mood – వాలకం

mood – వాలకం

mortal remains – మృతావశేషాలు

multi-level marketing – బహుళాంచెలు

mutation – ఉత్పరివర్తన

mutual indispensablity – పరస్పర అనివార్యత

myopia – సమీపదృష్టి, హ్రస్వదృష్టి

mystery – నిగూఢం

name plate – నామఫలకం

namespace – పేరుబరి

necessary evil – ఆవశ్యక దోషం

neck out – అర్ధచంద్రప్రయోగం

negative – ప్రతీపం

negative publicity – అపప్రచారం, దుష్ప్రచారం

net connection – జాలసంధానం

net value – నికర విలువ

network – సంపర్కజాలం

News channel వార్తావాహిని

non-combatant divisions – పోరాటేతర విభాగాలు

normal letters – సాదా అక్షరాలు

noticeable – గమనీయం

nuclear family – అంతరాళ కుటుంబం, కేంద్రక కుటుంబం

objective – వస్త్వాశ్రయం, అర్ధాశ్రయం

oil slick – చమురుతెట్టు

oligarchy – కతిపయస్వామ్యం

one-way – ఏకతో వాహిని

opacity – అకిరణ్యత

open mind – తెఱుపుడు మనస్సు

operational plane – కార్యతలం

operational stage – వ్యవహారదశ

oppressive laws – నిర్బంధక చట్టాలు

option – వికల్పం

oral tradition – మౌఖిక సంప్రదాయం

order of priority – ప్రాథమ్యక్రమం

organizing ability – సంఘటక సామర్థ్యం

orientation – దిశాదేశనం

orientation – లక్ష్యోన్ముఖత

originality – స్వకీయత

output – ప్రతిచయం

over dieting – అతిపథ్యం, అతిలంఖణం

over-action – అతిశయాభినయం

oxymoron – విరోధాలంకారం

paradox – ఘటనావైచిత్రి

paragraph – గద్య

parent –కాంచరి

parlance – పరిభాష

parliament – పేఱోలగం

participant – పాల్గోలరి

participation – పాల్గోలు

part-time – అంశకాలికం

password – సంకేతపదం

pattern – సరళి

penal action – దండనాచర్య

perceive – అభిదర్శించు

perception – అభిదర్శనం

percolation – ఇంకుదల

perfection – నిర్దుష్టత

perfection – నిర్దుష్టత, సౌష్ఠవం, పరిపూర్ణత

perfectionism సౌష్ఠవదృష్టి, సౌష్ఠవవాదం

perfectionist- సౌష్ఠవవాది

period – కాలఖండం

personal loan – చేబదులు

personification – మూర్తీభావం, మూర్తీకరణం

phenomenon – దృగ్విషయం

pioneer – ఆద్యుడు

platonic love – అమలినప్రేమ

police – భటులు

policy-makers – విధానాల రూపకర్తలు

politically correct – రాజకీయంగా సాధువు

politicization – రాజకీయకరణ

popular – ప్రచురం

popularity – ప్రాచుర్యం

porno site – అశ్లీల జాలగూడు

portable Documents Format (PDF) – వహణీయ పత్ర సంప్రకారం (వ.ప.సం.), లేదా పంపక సులభ కవిలె

positive – సానుకూలం

positive health – సహజారోగ్యం

post – టపా

potential – స్తోమత

power equation – సత్తాసంబంధం

power worship – సత్తారాధన

practicability – ఆచరణీయత

practical convenience – ఆచరణసౌలభ్యం

practising Christian – అనుష్ఠాన క్రైస్తవుడు

precursors – వేగుచుక్కలు

pre-determined – ప్రాఙ్నిర్ణీతం

prefer – అభిమతించు

preferable – అభిమతార్హం

preferential treatment – విశిష్ట మన్నింపు

prejudice – ముందస్తు అభిప్రాయం, ప్రమతం (ప్ర = ముందు )

preparation – సన్నాహం

preparatory exercise – సన్నాహక కసరత్తు

presentation – సమర్పణ

pressure groups – ఒత్తిడిసంస్థలు, ఒత్తిడిగుంపులు, ఒత్తిడిబృందాలు (కొన్ని అంశాలపై కొన్ని కొత్త చట్టాలు చేయవల సిందనీ, లేదా ఉన్న చట్టాల్ని మార్చవలసిందనీ, లేదా కొన్ని వర్గాలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలూ, మంజూరులూ ఏర్పాటు చేయవలసిందనీ ఇవి ప్రభుత్వంలో పైరవీ చేస్తాయి)

previlege – ప్రస్వామ్యం

primate species – వాలిండి వంగడం

primitive – ఆదిమం

primogeniture – జ్యేష్ఠాధికారం

privacy policy – గోప్యతావిధానం

private business – వివిక్త వ్యాపారం

probability – సంభావ్యత

process – ప్రక్రియ

processing – ప్రక్రియాపన

procrastination – కాలహరణం

professional fields – వృత్తికార రంగాలు

professional interaction – వృత్తిదారీ భావవినిమయం

professionalism – వృత్తినైపుణ్యం, వృత్తికారత్వం

profile – ప్రవర

profound – అగాధమైన

programming – కార్యక్రమించడం

progress bar = ప్రగతి పట్టీ

project – చేపట్టు

projecting – పొడకట్టించడం

propellent – చోదకం

proper channel – సముచితమార్గం

protective cover – రక్షణ కవచం

prototype – ప్రాఙ్నమూనా

proven model – నిరూపిత నమూనా

public attraction – జనసమ్మోహనం, జనసమ్మోహకత్వం

publicly acceptable face – బహిరంగ ఆమోదయోగ్యముఖం

puppy love – బుజ్జాయిప్రేమ

pure sciences – కేవల విజ్ఞానాలు

quality of life – జీవితనాణ్యత

quit – నిష్క్రమించు

quiz – పృచ్ఛకం

quorum – కనీస హాజరు

quoting – ఉటంకించడం, ఉదాహరించడం

radio button = చుక్కబొత్తాం

rape case – మానభంగాభియోగం, మానభంగవ్యాజ్యం, మానభంగ ఉదంతం

ratio – నిష్పత్తి

rational plane – తర్కతలం

reaction – ప్రతిచర్య

reactionary – ప్రతిచర్యాత్మకం

readership – పాఠకవర్గం

readiness – సన్నద్ధత

ready-made – పూర్వాయత్తం

recession – తిరోగమనం

recorded – నమోదితం

regeneration – ప్రతిజననం

regular – అనునిత్యం

regular employment – అనునిత్య ఉపాధి

relative – సాపేక్షం

relaxation – సడలింపు

relevance – సందర్భశుద్ధి

renewable energy source – ప్రతిజన్య శక్తివనరు

replacement – ప్రతిక్షేపం

replenishment – పునఃపూరించడం, ప్రతిపూరించడం (పునఃపూరణ, ప్రతిపూరణ)

rescue aircraft – ఆదుకోలు విమానం

reservations – ప్రత్యేకింపులు

reserve police – అవసర భటదళం

re-size – కొలమార్చు

retributive justice – ప్రతీకారన్యాయం

retrograde effect – ప్రతినివర్తక ప్రభావం

reversing – నివర్తించడం, నివర్తనం, క్రమ్మఱించడం

revert – పూర్వరూపానికి తెచ్చు, పూర్వరూపించు

revision – పురశ్చరణ

rigid – బిరుసు

rise – ఉత్థానం

risk – బెడద, నష్టం

risk-bearing ability – నష్ట నిభాయింపుశక్తి

river basins – పరివాహక ప్రాంతాలు

river bed – నదీగర్భం

rocky terrain – ఱాతినేల

role models – నమూనాపాత్రలు

roll back – క్రమ్మఱించు

rootless – పునాదిహీనుడు

royal life style – రాజోచిత జీవనశైలి

rule of law – చట్టబద్ధ పాలన

rules of the game – ఆటనియమాలు

ruling position – పాలకస్థానం

running commentary – ఛాయాభాష్యం

sacred trust – పవిత్రబాధ్యత

saleable commodity – విక్రేయ సరుకు

sarveyor – అవలోడనకర్త

save – భద్రపఱచు

save = (కంప్యూటర్ల పరిభాషలో) భద్రపఱచు

scholastic – వైదుషికం

screen-shot – తెఱపట్టు

screw-driver – త్రిప్పెన

scroll bar = లాగుడు పట్టీ (అడ్డ లాగుడు పట్టీ, నిలువు లాగుడు పట్టీ)

sealed cover – మూసిన లకోటా

secondary – ఆనుషంగికం, గౌణం

sectarian – శాఖేయం, వర్గీయం

security cordon – భద్రతావలయం

selective action – ఎంపుడుచర్య

selective questioning – ఎంపుడు ప్రశ్నకం

self-centered-ness – ఆత్మకేంద్రకత్వం

self-conscious – ఆత్మస్పృహాళువు

self-employed – స్వయం-ఉపాధికులు

self-sustaining logic – ఆత్మనిభాయక తర్కం

seminary – మతపాఠశాల, మతవిద్యాలయం, ఘటిక,

sense of justice – న్యాయబుద్ధి

sentiment – పట్టింపు

serials – ధారావాహికలు

sexual attraction – లైంగిక ఆకర్షణ

sexual perversions – లైంగిక భ్రష్టాచారాలు

shallow – కొఱలోతు, ఉత్తానం

share market – వాటాల విపణి

shortcut – అడ్డదారి

sign up – సంతకించు

signboard – ఱెక్కమాను

site – జాలగూడు

sleek – కోమలం

slide show – చిత్రమాలిక

small land-holdings – చిన్నకమతాలు

social circle – సామాజిక ఆవరణ

social conformity – సామాజిక ఒదుగుదల

social setting – సామాజిక అమఱిక

socialization – సామాజికీకరణ

soft (electronic) copy – మృదుప్రతి

soft power – మృదులాధికారం

software – మృదూపచయం, మృదుసామాను, మృదుసామగ్రి

source – ఆకరం

space – రోదసి, అంతరిక్షం

specialization – విశేష శిక్షణ

spontaneity – యాదృచ్ఛికత

stand-alone entity – ఐకాంతిక స్వమూర్తి

standby mode – నిరీక్షాస్థితి

stardom – తారహోదా

statement – ఉద్ఘాటన

static phenomenon – నిశ్చల దృగ్విషయం

status symbol – హోదా చిహ్నం

stay order – నిలుపుదల ఉత్తర్వు

steady income – నింపాది సంపాదన

strategic oil reserves – వ్యూహాత్మక చమురు నిలవలు

stuff – సరుకు

style statement – విలాసాభివ్యక్తి, విలాసద్యోతకం

sub-human – హీనమానవుడు

subsistence farming – మనుగడార్థక సేద్యం

substitute – ప్రతిక్షేపం

success worship – విజయారాధన

suggestive – సూచనప్రాయం, ధ్వన్యాత్మకం

suggestivity – ధ్వని

sum of experiences – టోకు అనుభవాలు

superiority comples – ఆత్మాధిక్య భావన

super-structure – ఉపరితల నిర్మాణం

super-structure – ఉపరితల నిర్మాణం

support – మద్దతు, ప్రాపు, ఆశ్రయం, సమర్థన

supporting point – ఉపబలకం

supportive mechanism – సహాయక యంత్రాంగం

survey – అవలోడన

survivors – హతశేషులు

symbolic – ప్రతీకాత్మకం

taboo topic – నిషిద్ధ ప్రస్తావన, నిషిద్ధాంశం

taken for granted – తేరగా

talent – ప్రజ్ఞ

team work – బృందకృషి

technique – కిటుకు

teenage – కౌమారప్రాయం

teenage pregnancy – కౌమారగర్భం

template – మూస

tentative – సాంప్రతికం

text box = పాఠ్య పేటిక

text file – పాఠ్య కవిలె/ దస్తరం

text file – పాఠ్యకవిలె

textual – గ్రంథపరం

thanks – నెనర్లు

theme – ఇతివృత్తం

thinking plane –ఆలోచనాతలం

third party – మూడో పక్షం/ మూడో వ్యక్తి

thread – చర్చాహారం

ticket – కేవుచీటీ

time scale – కాలమానం, కాలబద్ద

time warp – కాలస్తబ్దు

time-bound – సమయనిర్దిష్టం

tip of the iceberg – మంచుకొండ శిఖరం

to screen-capture – తెఱపట్టడ

topic – ప్రస్తావం/ప్రస్తావన

tourist resort – పర్యాటకాశ్రయం

transition – సంధిదశ

transparent – కిరణ్యత, పారదర్శకత

trend – పోకడ

tsunami – రేవుకెఱటం

TV channel – ప్రసారవాహిని

typing – టంకించడం, టంకణం

typo – టైపాటు

ulterior motive – దుస్సంకల్పం

uncertainties – అనిశ్చితులు

unconditional – బేషరతు, నిర్ణిబంధం

unconfirmed – అధ్రువీకృతం

unconscious knowledge – స్పృహరహిత జ్ఞానం

under process – సిద్ధమౌతోంది/సన్నద్ధమౌతోంది

understandable – సుబోధం

under-utilized – అల్పోపయుక్తం

uniform (n) – గణవేషం

uniformity – ఏకరూపత, సరూపత

unique – విలక్షణం, ఏకైకం, వినూత్నం

unit – మానకం

unit tests – అవాంతర పరీక్షలు

universal – సార్వజనికం, సార్వజనీనం, విశ్వజనీనం

universality – విశ్వజనీనత, సార్వజనీనత

universalization – విశ్వజనీనీకరణ, విశ్వజనీకరణ

unquestionable social acceptance -ప్రశ్నాతీతమైన సామాజిక ఆమోదం

upadate – తాజాకరణ

updating – తాజాకరణం

upgrade – ఉన్నతించు

upload – ఎక్కించు (ఎక్కింపు)

upward mobility – ఊర్ధ్వగమనం

user – వాడుకరి

user charges – వాడుక రుసుములు

user Interface Controls = వాడుకరి అంతరవర్తి నియంత్రికలు

utilitarians – ప్రయోజనవాదులు

utility – వినియోగ్యత

validity – చెల్లుబాటు

variable – చలం

venture – పూనుకోలు

version – పాఠాంతరం

vested interest – స్వప్రయోజనం

vibration – ప్రకంపన

victimization propaganda – బాధితత్వ ప్రచారం

video – దృశ్యకం

video file – దృశ్యక కవిలె/ దస్తరం

virtual world – వితథ్యప్రపంచం

wallet – చేజోలి

warranty card – హామీపత్రం

water generation cycle – జలోత్పాదన చక్రం

web portal – అంతర్జాల నెలవు

weekend – వారాంతం

wifely – భార్యోచితం

work orders – పనిపురమాయింపులు

workforce – కార్మిక బలగం

world cup – ప్రపంచ చషకం

youth haven – యువత అడ్డా

సంప్రదించిన గ్రంథాలు

  1. బాలవ్యాకరణ ఘంటాపథము (2007) : రచయిత – శ్రీమాన్ వంతరాం రామకృష్ణారావుగారు. చతుర్థ ముద్రణ. ప్రచురణ – విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
  2. శబ్దార్థ రత్నాకరము (1982) : కూర్పరులు – శ్రీయుతులు వారణాశి వెంకటేశ్వర్లు మఱియు ఉత్పల వేంకట రంగాచార్యులుగార్లు. ప్రచురణ – బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాస్.
  3. లఘుకోశము (1956) : కూర్పరి – దుగ్గిరాల వేంకటపూర్ణ భుజంగశర్మ ; ప్రచురణ – ది ఓరియంట్ పబ్లిషిఙ్ కంపెనీ, మద్రాస్.
  4. లఘు సిద్ధాంతకౌముదీ (1980) : కర్త – డా|| పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. ప్రచురణ – శ్రీరామా పబ్లిషర్స్, హైదరాబాదు.
  5. నామలింగానుశాసనము అను అమరకోశము (లింగాభట్టీయ గురుబాలప్రబోధికా సహితము 1989): కర్త – అమరసింహుడు. ప్రచురణ – హరిహర పబ్లికేషన్స్, విజయవాడ.
  6. పాణినీయ ధాతుపాఠం (ఈ రచయిత దగ్గఱున్న వ్రాతప్రతి)
  7. The Students’ Guide to Sanskrit Composition (1995) : By Vaman Shivram Apte. Published by Indological Publishing House, Delhi-110007.
  8. The Student’s English-Sanskrit Dictionary (1997) : By Vaman Shivram Apte ; Published by Motilal Banarsidas, Delhi-110007.
  9. Illustrated Oxford Dictionary (2003) : Managing Editors – Jonathan Metcalf and Della Thompson. Published by Oxford University Press, UK.
  10. A Practical English Course for College Students (1969) : By N.D.V.Prasada Rao ; Published by S.Chand & Co., New Delhi-110055.

– సమాప్తం –

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.