cover

పద్మప్రాభృతకమ్ (11)

Download PDF EPUB MOBI

దీనిముందుభాగం

హా ధిక్ విస్రస్తమృగపోతికేవ సంత్రస్తయా దృష్ట్యా మాం నిరీక్షతే | ప్రత్యాగతచిత్తయానయా భవితవ్యమ్ | కిం బ్రవీషి – “ మా మైవమ్ | బ్రహ్మాచారిణీ ఖల్వహం వసంతముపవాసామి” ఇతి | శ్రద్ధేయమేతత్ | అయమిదానీం సరసదంతక్షతోऽధరోష్టః కిమితి వక్ష్యతి? కిం బ్రవీషి – “సావశేషతుపారపరుషస్య వసంతవాయోః పదాన్యేతాని” ఇతి | భవతు తావత్ | సంజ్ఞాప్తాః స్మః |

దంతజర్జరోష్టీ

యథా చ నియమం త్వమాత్మనో వదసి |

సువ్యక్తమవ్రతఘ్నం

చుంబితచాంద్రాయణం చరసి ||

ఏషా సంవృత్య కవాటేన ముఖం ప్రహసితా | తపోవృద్ధిరస్తు భవత్యై | సాధయామ్యహమ్ | (పరిక్రమ్య)

హా, ధిక్ – భయమందిన లేడిపిల్ల వలె త్రాసమునొందిన దృక్కులతో నన్ను చూచుచున్నది. ఈమె మనమున తిరిగి రాగముదయించినది. ఏమంటున్నావు – “అదేమీ లేదు. బ్రహ్మచారిణి అయిన నేను వసంతమున ఉపవాసమొనర్చుచున్నాన”నియా. మంచి శ్రద్ధయే. “కానీ ఇప్పుడు పెదవిపై సరసమైన పంటినొక్కు ఏమి చెప్పుచున్నది? ఏమంటావు – “మిగిలిన మంచు కణములు గల వసంతవాయువుల చిహ్నములు ఇవి” అనియా. అలాగే కానిమ్ము. మాకు తెలిసినది.

దన్తపదజర్జరోష్టీ = దన్తక్షతముచేత జర్జరితమైన పెదవిగలదానా, యథా = ఎలాగున త్వం = నీవు, ఆత్మనః నియమం = నీ నియమమును, వదసి = చెప్పుచున్నావో, సువ్యక్తమవ్రతజ్ఞం = ఆ వ్రతప్రకారమే, చుంబితచాంద్రాయణం = చుంబనముల చాంద్రాయణమును, చరసి = నెరపుచున్నావు.

తాత్పర్యము: దన్తక్షతము చేత కమిలిన పెదవిగలదానా, నీ నియమముననుసరించి చాంద్రాయణవ్రత మొనర్చుచుంటివి కాబోలును.

విశేషము: చాంద్రాయణవ్రతమన, నాలుగు నెలలు జరుపునది. ఈ నాలుగు నెలలందు పాడ్యమి మొదలుకుని పౌర్ణమి వరకునూ, మొదటి దినమున నొక్క అన్నపు ముద్దతోనారంభించి, దినమునకొక్క కబళమును పెంచుట, పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు నొక్కొక్క కబళమును తగ్గించుకొనుచూ వచ్చుట సాంప్రదాయము. ఈ ఉపవాసము వలె నీ కన్నియయూ సురతోపవాసము చేయుచున్నదని వ్యంగ్యము.

వాహ్, కిటికీ వెనుక ముఖమును దాచి నవ్వుచున్నది. నీకు తపోవృద్ధి యగుగాక. మేమిక నేగుదుము. (ముందుకు నడచి)

భోః ఏష కథంచిత్ వేశ్యయువతిప్రలాపశృంఖలాన్మున్ముచ్య ప్రాప్తోऽస్మి దేవదత్తాయా గృహమ్ | అపిదానీం దేవదత్తా గతా స్యాత్ | కిం ను ఖలు పృచ్ఛేయమ్ | (విలోక్య) ఆ అయం తావద్ వృక్షవాటికాపక్షద్వారేణాతిక్రామతి భావగంధర్వదత్తస్య నాటకాచార్యస్యంతేవాసీ దర్దురకో నామ నాటేరకః | యావదేనం పృచ్ఛామి |

(నిర్దిశ్య)

అంఘో దర్దురక కుతస్త్వమాగచ్ఛసి? అపి జానీషే కిం దేవదత్తా కరోతీతి? కిమాహ భవాన్ – “గతా ఖలు దేవదత్తా సుఖప్రశ్నార్థమార్యమూలదేవం ద్రష్టుమ్ | అహం తు దేవసేనాం ద్రష్టుమాచార్యేణ ప్రేషితోऽస్మి” ఇతి | అథ కేన కారణేన ? కిం బ్రవీషి – “కుముద్వతీభూమికాప్రకరణముపనయేతి” ఇతి | అథోపనీతం పత్రకం గృహీతం చ తయా? కిం బ్రవీషి – “ఆచార్యగౌరవాత్ ప్రతిగృహీతం తత్పత్రకం తయా | పార్శ్వస్థాయాస్తు సఖ్యా హస్తే న్య్స్తమ్ | అపి చ కుముద్వత్యై నమస్కృత్యోక్తవతీ – ’అస్వస్థా తావదసి’ ఇతి” ఇతి |

హన్త ప్రసిద్ధతర్కాః స్మః | ఏతదస్యాః కామైకతానతాం సూచయతి | అంఘో దర్దురక కిమిదం పత్రకేऽభిలిఖితమ్ ? కిం బ్రవీషి – “వాచయస్వ” ఇతి | (గృహీత్వా వాచయతి)

ఆహా, ఏలాగునో వేశ్యాయువతుల ప్రలాపముల సంకెలలను వీడి దేవదత్త ఇంటికి చేరితిని. దేవదత్త ఇంట లేదు కాబోలు. కానీ అడిగెద గాక. (చూచి)ఆ, వృక్షవాటిక దిశగానున్న ద్వారము వైపు నుండి గంధర్వదత్తనాట్యాచార్యుని శిష్యుడు దర్దురకుడను నటుడు వెడలుచున్నాడు. అతనిని అడిగెదను.

(సైగ చేసి)

అహో దర్దురక, ఎచటి నుండి రాక? దేవదత్త ఏం చేస్తోందో తెలుసా? ఏమన్నావూ – “ దేవదత్త మూలదేవుని కుశలమడుగుటకై వెళ్ళినది. నేను ఆచార్యుడు పంపగా దేవసేనను చూచుటకు వచ్చితి” ననియా. ఏ కారణాన? ఏమంటున్నావు – “కుముద్వతి అనే పాత్ర గురించిన లిపిపత్రమొసగుటకు” అనియా. ఆ లిపి పత్రము ఇచ్చితివా? ఆమె పుచ్చుకున్నదా? ఏమంటావు – “ ఆచార్యునిపై గౌరవము వలన ఆమె ఆ పత్రమును తీసుకొన్నది. కానీ పక్కన ఉన్న చెలికత్తె చేతికిచ్చినది. ఆపై కుముద్వతికి నమస్కరించి యన్నది – ’నేనిపుడు అస్వస్థనయి ఉన్నాను’” . అనియా.

అహో, మేమూ మా అనుమానమునకై ప్రసిద్ధులమే. అరే, దర్దురక. పత్రమున వ్రాసినదేమి? ఏమందువు – “చదువుకొమ్మ”నియా. (తీసుకొని చదువును)

కాన్తం కందర్పపుష్పం స్తనతటశశినం రాగవృక్షప్రవాళం

శయ్యాయుద్ధాభిఘాతం సురతరథరణశ్రాన్తధుర్యప్రతోదమ్ |

ఉన్మేషం విభ్రమాణాం కరజపదమయం గృహ్యసంభోగచిహ్నం

రాగాక్రాన్తా వహన్తాం జఘననిపతితం కర్కశాః స్త్రీకిశోర్యః ||

సాధు భోః కర్కశస్త్రీకిశోరప్రతారణయాభిప్రస్థితస్య మే | మహదిదం మంగళమర్థసిద్ధిం సూచయతి | అఘో దర్దురక, అపి జానీషే కుత్రస్థా దేవసేనేతి? కిం బ్రవీషి – “వృక్షవాటికాం గతా” ఇతి | మదనకర్మాంతభూమౌ వర్తతే| సాధు | గచ్ఛతు భవాన్ | ప్రవిశామస్తావత్ | (ప్రవిశ్య) అయే, ఇయమియం దేవసేనా –

కాన్తం = సుందరిని, కందర్పపుష్పం = మన్మథుని కుసుమమును, స్తనతటశశినం = స్తనతటమున గల అర్ధచంద్రరూపమున నఖక్షతమును ధరించిన దానిని, శయ్యాయుద్ధాభిఘాతం = పడకటింటిపోరున దెబ్బతిన్నదానిని, సురతరథరణశ్రాన్తధుర్యప్రతోదం = సురథరూప రథయుద్ధమున అలసిన యెద్దులకై అంకుశము గలదానిని, ఉన్మేషం = మేల్కాంచినదానిని, విభ్రమాణాం = విభ్రమములైన, కరజపదమయం = చేతి వ్రేళ్ళ చిహ్నములచే, గృహ్యసంభోగచిహ్నం = స్వీకరింపబడిన సంభోగచిహ్నములదాని, రాగాక్రాన్తా వహన్తాం = ఎరుపురంగునొందినదానిని, జఘననిపతితం = నితంబములపై పడినదాని, కర్కశాః = కర్కశమైన స్త్రీకిశోర్యః = స్త్రీ కిశోరమును..

తాత్పర్యము: మన్మథుని కుసుమమును, స్తనతటమున గల అర్ధచంద్రరూపమున నఖక్షతమును ధరించిన దానిని, పడకటింటిపోరున దెబ్బతిన్నదానిని, సురథరూప రథయుద్ధమున అలసిన యెద్దులకై అంకుశము గలదానిని, మేల్కాంచినదాని, విభ్రమములైన, చేతి వ్రేళ్ళ చిహ్నములచే, స్వీకరింపబడిన సంభోగచిహ్నములదానిని, ఎరుపు రంగునొందినదానిని, నితంబములపై పడినదాని, కర్కశమైన స్త్రీ కిశోరమును..సుందరిని

విశేషములు: స్రగ్ధర. స్తనతటశశి: అర్ధచంద్ర, మండల, మయూరపద, దశప్లుత, ఉత్పలపత్రమను నైదు చిహ్నములచే నఖక్షతముండును. ఇక్కడ అర్ధచంద్రనఖక్షతము వర్ణితము. ఈ పద్యము దర్దురకుని చేతి నుండి పత్రలు లాగికొని చదివినది కావున, ప్రకరణమధ్యమున గల పద్యము వలెనున్నది.

బాగు. స్త్రీరూపముననున్న ఆ కర్కశకిశోరిని సాధించుటకై వచ్చిన నాకు కార్యసిద్ధి సూచనమగు శకునము దొరకుచున్నది. అరే దర్దురక, దేవసేన ఎక్కడ ఉందో తెలుసునా? ఏమంటివి –“ఉద్యానవనమున కేగెన”నియా. కామదేవుని కర్మ భూమికేగినది. సొబగు.

అక్కడికేగుదును. (ప్రవేశించి)అరే ఇదిగో దేవసేన.

కృశా వివర్ణా పరిపాణ్డునిష్ప్రభా ప్రభాతదోషోపహతేవ చంద్రికా |

వహత్యసాధారణగూఢవేదనం మనోమయం వ్యాధిమదారుణౌషధమ్ ||

ఆ యథైవం సర్వగుహ్యధారిణ్యా స్నేహాతిసృష్టసఖీభావయా ప్రియవాదినికయా నామ పరిచారికా సహ పరివర్జితాన్యజనా వాయుం పర్యుపాసతే | భవతు | ఏతదప్యస్యా ఏకతాఅతాం సూచయతి | సర్వోऽపి వివిక్తకామః కామీ భవతి | అస్మద్విషయగతేయమ్ | యావదేనాముపసర్పామి | (ఉపేత్య)

వాసు దేవసేనే విస్రంభాలాపవిచ్ఛేదకారిణే న ఖలు వయమసూచితవ్యాః | కిం బ్రవీషి – “స్వాగతం భావాయ | అభివాదయామి” ఇతి | భవతు | ప్రతిగృహీతః సముదాచారః | అలమలం ప్రత్యుత్థానయంత్రణయా | కిమాహ భవతీ – “ఉపవిశ, ఇదమసనమ్” ఇతి | బాఢముపవిష్టోऽస్మి | వాసు కిమిదం బంధుజనసంతాపః క్రియతే ? కో నామాయమచక్షుర్గ్రాహ్యో గూఢవేదనః స్వయంగ్రాహ్యః ప్రాక్ కేవలో వ్యాధిః | కిం బ్రవీషి – “ న ఖలు కించిత్” ఇతి | అపి పండితమానిని అలమస్మాన్ విక్షిప్య | సదాऽపి నామ త్వమస్మాకం బాలక్రీడనకాన్వేషణాదిషు ప్రణయవతీ | అపి చ, స ఏవాయం మూలదేవసఖః శశః | తదుచ్యతాం సద్భావః | కిమాశ్రయోऽయం సంతాపః ? తవ హి –

కృశా = చిక్కినది, వివర్ణా = పాలిపోయినది, పరిపాణ్డు నిష్ప్రభా = బాగా తెల్లనై, కాంతి కోలుపోయినది, ప్రభాతదోషోపహతా ఇవ చంద్రికా = ప్రభాత కాలమున దోషమునందిన చంద్రుని వలెనున్నది, అసాధారణ గూఢవేదనం = అసాధారణమైన తెలియని వేదనను, మనోభయం = మనసునందలజడిని, వ్యాధిం = వ్యాధిని, దారుణౌషధం = దారుణౌషధమును వహతి = వహించినది.

తాత్పర్యము: చిక్కి, పాలిపోయి, ప్రభాతచంద్రుని వలె వెలవెలబడి, తెలియని వేదనతో, మనసునందలజడిని, మదనవ్యాధిని, ఔషధమును వహించినది. (వంశస్థవృత్తము – జ, త, జ, ర)

అహో, ఆ కారణముననే, తన రహస్యములన్నీ తెలిసిన చెలి ప్రియవాదినిక తో కలిసి, ఏకాంతమున గాలి భోంచేస్తున్నది. ఈమెయందూ ఏదో ఒక విషయమున నాసక్తి కనిపించుచున్నది. కామినులందరూ ఏకాంతము నాస్వాదింతురు. ఇప్పుడు విషయము నా స్వాధీనమందున్నది. ఆమె కడకేగుదును (సమీపించి)

బాలా, దేవసేనా. నీ వ్యక్తిగత విషయములందు పాల్గొను మా వలన నిరాశనొందకుము. ఏమంటున్నావు – “ఆర్యులకు స్వాగతము. నమస్సులు” అనియా. నీ గౌరవము స్వీకరించితిమి. పర్వాలేదు. లేవనవసరము లేదు. “ఇదిగో ఆసనము కూర్చొనుడి” అంటివా. ఆహా, కూర్చుంటిని. బాలా, ఏల ఇలా బంధుజనులకు సంతాపము కలిగింతువు? కనులలో తెలియబర్చక, తెలియని వేదనతో, నీవే అలమటించుచు, ఏకాంతమున వసించు వ్యాధి ఏమి?” అదేమీ లేదు” అనుచున్నావా? పండితయువతీ, నా వద్ద దాచినది చాలు. నీవు నాకు ఎప్పుడునూ చిన్నపిల్లవే. బొమ్మలు తెమ్మని నన్ను అడుగుతూ ఉండేదానివి కూడా. నేను మూలదేవుని మిత్రుడైన శశుడను. కావున సద్భావమున చెప్పుము. ఈ నీ దుఃఖకారణమేమి? నీకు –

అవ్యాధిగ్లానమంగం కరతలకమలాపాశ్రితం గండపార్శ్వే

దృష్టిర్యానైకతానా జడమివ హృదయం జృంభణా వర్ణభేదః |

నిశ్వాసాయాసకర్తా న చ న రతికరస్తాపనశ్చేంద్రియాణా-

మేకద్రవ్యాభిలాషీ ప్రతినవ ఇవ తే చోరి కోయం వికారః ||

కథం నిశ్వసితమనయా | హన్త సంధుక్షితో మదనాగ్నిః | భవతు | ఇదానీమాత్మగతం భావమస్యా జ్ఞాస్యామః | యది వయమపాత్రీభూతా విస్రంభానామరోగాస్తు భవతీ | సాధయామ్యహమ్ | కిం బ్రవీషి – “చపలం ఖలు భావః” ఇతి | హన్త ప్రతిజ్ఞాతమ్ | ఏషాऽపి మర్మ వక్ష్యతి | వాసు కుతో మే ధృతిస్తవేదృశేన శరీరోదంతేన | అపి చ దీర్ఘసూత్రతా నామ కార్యాంతరముత్పాదయతి |తదుచ్యతాం సంతాపకారణమ్ | కిం బ్రవీషి -” న ఖలు మే భావం ప్రతి గుహ్యమస్తి | అయం తు వసంతస్వభావః యన్మే గురుజనయంత్రణయా నిభృతస్యాపి మనసః కిమప్యకారణేనౌత్సుక్యముత్పాదయతి” ఇతి | సాధు భో నాయం వ్యాధివ్యపదేశః | చోరి, ఏతదపి జానీషె సాధు యువతీ ఖలు దేవసేనా సంవృత్తేతి |

అవ్యాధిగ్లానమంగం = వ్యాధిలేకయే అలసిన అంగములను, గణ్డపార్శ్వే = చెక్కిళ్ళలో, కరతలకమలా = కరతలమనెడి కమలముల, అపాశ్రితం = నీటిని ఆశ్రయించి, దృష్టిః = చూపు, నా ధ్యాన ఏకతా = శూన్యమున మరల్చిన, హృదయం = హృదయము, జడం ఇవ = స్పందన లేక,వర్ణభేదః = నానా వర్ణములు, జృంభణా = మిక్కిలిగయైనవై, నిశ్వాస ఆయాసకర్తా = శ్వాస కూడా ఆయాసమును కలిగించుచున్నదిగా, ఇంద్రియాణాం చ = ఇంద్రియములలోనూ, న రతికరస్తాపనా = ఏ విధమైన అనురక్తి లేకుండగా, న ఏక ద్రవ్యాభిలాషీ = ఒక్క వస్తువుపైనాశ లేక, ప్రతినవ ఇవ = కొత్తకొత్తగ వలె, చోరి = చోరీ, తే = నీకు. కః ఇయం = ఏదిది, వికారః = వికారము?

తాత్పర్యము: వ్యాధి లేకయే అలసట, చెక్కిలికి చేర్చిన కమలహస్తముల నీరు, శూన్యపు దృక్కులు, స్పందన లేని హృదయము, పలువర్ణముల జృంభణము, శ్వాస ఆయాసముగనుండుట, ఇంద్రియములలో అనురక్తి లేకుండుట, ఒక్క వస్తువుపైనాశ లేక, నీ ఈ వికారమెద్ది? స్రగ్ధరావృత్తము.

ఈమె ఇలా నిట్టూరుస్తున్నదెందుకు? ఈమె కామాగ్ని జ్వలితమైనది. కానిమ్ము. ఈమె ఆత్మగతభావమును తెలుసుకొనెదను. నేను నీ విశ్వాసపాత్రుడను గానిచో సరే, సుఖముగనుండుము. నేను మరలెదను. ఏమంటివి – “ఆర్యులు చపలురు” అనియా. హా, తెలిసినది. ఈమె మర్మముగ చెప్పదలుచుకున్నది. బాలా, నీ ఈ పరిస్థితి చూచి నాకెలా ధైర్యము కలుగును? ఇంకనూ ఆలసించిన ఇంకొక పని ఎదురు వచ్చును.

కావున సంతాపకారణము జెప్పుము. ఏమంటివి – “ మీ వద్ద నేను దాచినదేమి లేదు. ఈ వసంతకాలపు స్వభావమేమనగా, అతి పెద్ద శిక్ష విధించి మనస్సును కారణము లేకనే వశపర్చుకొనును” అనియా. బాగు, ఈమె వ్యాధి లేదని చెప్పుట లేదు. చోరి, దేవసేన యువతి ఐనదని ఎరుగుదువా?

 

(తరువాయిభాగం వచ్చేవారం)

Download PDF EPUB MOBI

Posted in 2014, డిసెంబర్, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

One Comment

  1. Pingback: పద్మప్రాభృతకమ్ (12) | కినిగె పత్రిక

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.