palaparthi cover

రేపటి కల చెప్తావా?

పొద్దున్న పాలు తాగుతూంది పాప.

రాత్రి నాకో కల వచ్చింది రా!

అని చెప్పడం మొదలెట్టింది  అమ్మ.

అమ్మా పాపా ఏదో ఊరికి వెళ్ళాం రా.

అక్కడ ఇళ్ళన్నీ కేక్ తో చేసార్రా.

వీధులన్నీ చాక్లెట్ ముక్కలతో వేసారు.

అబ్బా! అంది పాప అశ్చర్యంగా.

అమ్మా పాపా అల్లా చాక్లెట్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటే

అక్కడో బిస్కట్ పడవ కనిపించింది,తేనె నదిలో తేలుతూ ఉంది.

మన ఇద్దరం అప్పుడా పడవ ఎక్కి అవతలి వైపుకి వెళ్ళాం.

పడవ దిగాక చూస్తే అక్కడ మైసూర్ పాక్ మెట్లున్నాయి.

అవి ఎక్కి పైకి వెళితే

అక్కడన్నీ

కారప్పూస తీగలు

వాటికేమో జిలేబీల పువ్వులు, లడ్డూల పళ్ళు.

భలే ఉన్నాయే! అని వాటి దగ్గరకు వెళ్ళబోయేలోగా

గబుక్కున మెలకువ వచ్చేసింది రా!

అని ముగించింది అమ్మ.

పాప పాలు తాగడం మర్చిపోయి

బుల్లి నోరు తెరుచుకుని

ఆశ్చర్య పడిపోయేస్తూ

వింటోంది అప్పటిదాకా.

గబుక్కున తెలివి తెచ్చుకుని

అయితే రేపు నీకు ఏం కల వస్తుందమ్మా?

చెప్పు! చెప్పు!

అంది ఉత్సాహంగా

అమ్మ చెయ్యి పట్టుకు ఊపేస్తూ.

 *

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, జనవరి, సీరియల్ and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.