cover

తిరిగి చూడని అద్దం

దారం లోపలి నీడtirigi choodani addam
కన్నెప్పటికి తెరుస్తుంది
పదాల ఇంద్రియాలతో
వాక్యాల్ని తెరిచే జ్ఞాపకాలు
పిరికివాళ్ళతో
సూర్యాస్తమయాల్ని వృధా చేయాలి
రాత్రుల్ని మోసగించాను
చూడని రాత్రికోసం
అశాస్వత స్పర్శలు
నిశ్శబ్దాలు, స్త్రీలు తెలిస్తే
తిరిగి చూడని అద్దం
చూడాలనుకున్న అద్దం ఏది
అక్షరాల్లోని పెదాల్ని ముట్టుకునేలోపే
వృద్ధాప్య సౌందర్య సువాసనలు

 

– ఎం. ఎస్. నాయుడు

Download PDF EPUB MOBI

Posted in 2015, కవిత, జనవరి and tagged , , , , .

4 Comments

  1. పదాల ఇంద్రియాలతో వాక్యాల్ని తెరిచే జ్నాపకాలు ‘ బావుందండి. ఈ సూది గొట్టంలోంచి కవితా మైదానం లోకి వెళ్తున్నాం

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.