cover

పద్మప్రాభృతకమ్ (12)

Download PDF EPUB MOBI

దీని ముందు భాగం

వాసు యద్యేవం అలమలమనుబంధేన | ఋతుపరిణామేన స్వస్థా భవిష్యసి | కథం వ్రీడితమనయా | ప్రియవాదినికే, కిమిదం తాళపత్రేऽభిలిఖితమ్ ? కిం బ్రవీషి – “నాటక భూమికా” ఇతి | పశ్యామస్తావత్ |

(గృహీత్వా వాచయతి)

కుముద్వతీ ప్రకరణే శూర్పకసక్తాం రాజదారికాం ధాత్రీ రహస్యుపాలభతే |

ఉన్మత్తే తైవ తావత్స్తనవిషమమురే నోద్గతా రోమరాజిః

న వ్యుత్పన్నాऽసి చ త్వం వ్యపనయ యువతీదోహలం దుర్విదగ్ధే |

వ్యుత్పన్నాభిః సఖీభిః సతతమవినయగ్రంథమధ్యాప్యసే త్వం

కేనేదం బాలపక్వే మనసిజకదనం కర్తుమభ్యుద్యతాసి ||

బాలా, అలాగయిన ఈ వ్యాధినిక ఉపేక్షింపకుము. ఋతువు మారినంతట నీవు ఆరోగ్యవంతురాలవగుదువు. సిగ్గేల? ప్రియవాదినికా, ఈ తాళపత్రమున వ్రాసినదేమి? ఏమంటివి – “నాటకభూమికా” అనియా. దానిని చూడనిమ్ము.

(తీసుకుని చదువును)

‘కుముద్వతీప్రకరణమున శూర్పకుని యందాసక్త అయిన రాజపుత్రి రహస్యమున కలియును’

ఉన్మత్తే = తెలియని దానా, తావత్ = అంతవరకు, ఉరౌ = ఛాతియందు, నైవ స్తనవిషమం = స్తనముల అమరిక లేదు. రోమరాజిః = నూగారు, నోద్గతా = వచ్చి ఉండలేదు. అపి చ = ఇంకనూ, త్వం = నీవు, న వ్యుత్పన్నా అసి = యౌవని అయి ఉండలేదు. దుర్విదగ్ధే = తెలివి లేని దానా, యువతీదోహలం = యువతుల (పతుల పట్ల) ఉత్సాహమును, వ్యపనయ = తొలగించుము. త్వం = నీవు, వ్యుత్పన్నాభిః = చదువుకున్న. సఖీభిః = చెలుల వలన, సతతం = ఎప్పుడూ, అవినయగ్రంథం = నీకు మాలిన గ్రంథములను, అభ్యాప్యసే = చదివింపబడుచున్నావు, కేన = ఎందుకు? ఇదం = ఇప్పుడు, బాలపక్వే = బాలభావమున పండి, మనసిజకదనం = మన్మథయుద్ధమును, కర్తుం = చేయుటకు, అభ్యుద్యతా = సమాయత్తవై, అసి = ఉన్నావు.

తాత్పర్యము: మూఢురాలా, బాలగా ఉన్నంతవరకూ నీ స్తనములుదయించలేదు. నూగారు లేదు. యౌవనివి కావు. నీ సఖులు నేర్పించినవి, నీకు సరిపడనివి అయిన గ్రంథములు చదివి, భర్తల పట్ల పాతివ్రత్యమను యువతుల ఉత్సాహమును పొందకుము. ఇప్పుడు నీవు తరుణవు. ఇప్పుడు నీవు కామభోగములనాశింపదగును. స్రగ్ధరా వృత్తము. (గణములు: మ ర భ న య య య)

కిమాహ దేవసేనా – “ఏతత్తావన్మయైవ న శ్రుతమస్తి” ఇతి | హన్త ఏష ఉద్గీర్ణః స్వభావః | ఇత్థమహమపి కామయామీత్యుక్తం భవతి | కిమాహ దేవసేనా – “ఛలగ్రాహీ భావః” ఇతి | వాసు అలమలమస్మాన్ విక్షిప్య | మేధావిగూఢమపి చంద్రమసం కుముద్వతీప్రబోధః సూచయతి | గచ్ఛ పురుషద్వేషిణి | ఆపన్నేదానీమసి |

నైవాహం కామయామీత్యసకృతభిహితం అత్త్వయా గూఢభావే

సా త్వం తన్వీస్వభావాత్ కథయ తనుతరా చోరి కేనాసి జాతా |

హస్తప్రత్యస్త గణ్డే ప్రశిథిలవలయే భిన్ననిఃశ్వాసవక్త్రే

వ్యాధిక్లిష్టో జనోऽయం కిమిదమతిశఠే వాహ్యతే ధీరహస్తః ||

కిమాహ ప్రియవాదినికా – “సతి ప్రవృత్తే కామతంత్రప్రకరణే దిష్ట్యేదానీమస్మత్స్వామినీ పురుషవిశేషమనురక్తా, న పృథగ్జనమ్” ఇతి | తత్కస్యామవన్తినగర్యో పురుషవిశేషశబ్దః ప్రచరతి ? కిమాహ భవతీ – “కస్య తావత్త్వయాऽభ్యుపగమ్యతే” ఇతి | కస్యాన్యస్య, నను కర్ణీపుత్రస్య | స హి |

దేవసేన ఏమన్నది – “ఇది నేనూ వినలేదు” అనియా. హా, ఈమె భావమెరిగితిని. నేనూ అలా చేసెదనని ఈమె భావము. దేవసేన ఏమనును – “నా ఆలోచనను ఆర్యులు గ్రహించిరి” అనియా. బాలా, నా దగ్గర దాచినది చాలు. మేఘములలో దాగిన చంద్రుడైనా కలువను వికసింపజేయును. వెళ్ళు పురుషద్వేషిణి. నీకిక మంచి జరుగు.

గూఢభావే = గోప్యమైన భావములదానా, యత్ త్వయా = ఏది నీచేత, నైవ అహం కామయామి = నేను కోరుకొనలేదు, ఇతి = అని, అసకృత్ = అబద్ధపు, అభిహతం = చెప్పబడినది (కలదో), సా = అది, చోరి = చోరురాలా, తన్వీస్వభావాత్ = కన్యా స్వభావమువలన, త్వం = నీవు, తనుతరా = లావుగ, కేన జాతా అసి = ఎందుకయినావు, కథయ = చెప్పుము. హస్తప్రత్యస్తగణ్డే = చెక్కిలిపై చేయిచేర్చిన దానా, ప్రశిథిలవలయే = చిక్కిన నడుము దానా, భిన్ననిఃశ్వాస వక్త్రే = వివర్ణమై, నిట్టూర్పుల ముఖము గలదానా, అతిశఠే = మిక్కిలి ధూర్తురాలా, అయం = ఈ, వ్యాధిక్లిష్టః జనః = మదనవ్యాధి పీడితమైన జనము, కిమిదం = ఏల ఈ, ధీరహస్తః = ధీరుని హస్తము, వాహ్యతే = వీయబడుచున్నది?

తాత్పర్యము: గూఢభావములదానా, “నేను కామవశ కాలేదు” అని చెప్పిన చక్కని తనువు గల నీవు బెంగచేత నడుము చిక్కి, ముఖమున నిట్టూర్పులిడుచు, చెక్కిలిపై చేయి జేర్చి, ఒకింత ఒళ్ళు జేసి, ఏలనున్నావు? మిక్కిలి శఠురాలా! ఈ మదనవ్యాధినందిన నీవు ధీరహస్తునికై ఎదురు చూచుచునే ఉన్నావు.

ప్రియవాదినిక ఏమన్నది? – “ కామతంత్రప్రకరణమున ప్రవృత్త యైన నా స్వామిని యొక విశేషపురుషుని మీద మరులుగొన్నది, సాధారణ యువకుని మీద గాద” నియా. ఈ అవంతీనగరమున విశేషపురుషుడెవ్వడు? “ఎవరో మీరే చెప్పుము?” అంటున్నావా? ఇంకెవరు? కర్ణీపుత్రుడే. అతడే –

కులే ప్రసూతః శ్రుతవానవిస్మితః

స్మితాభిభాషీ చతురో విమత్సరః |

ప్రియంవదో రూపవయోగుణాన్వితః

శరీరవాన్ కామ ఇవాऽధనుర్ధరః ||

కిం అధోముఖీ దేవసేనా సంవృత్తా | అలమలమనిభృతే దుకూలదశాన్తోద్వేష్టనేన | కథ్యతాం తావత్ | అపి చ యది వయం భాజనీభవిష్యామః సమౌనమేవాస్తే | అథవా లజ్జా నామ విలాసయౌతకం ప్రమదాజనస్య, విశేషతశ్చాప్రౌఢకామినీనామ్ | తదేషా కథమివ స్వయం వక్ష్యతి | తత్కామం పురుషవిశేష ఇత్యసాధారణ ఏవ శబ్దః కర్ణీపుత్రే ప్రతివసతి | తథాపి నామ త్వలబ్ధగాంభీర్యో ధృతిముపయాత ఏనాం వ్యాహారయామి |

వాసు దేవసేనే కిమస్మాకం పరరహస్యశ్రవణేన ? ఉదాసీనః ఖలు వయమ్ | తదామంత్రయే భవతీమ్ | కర్ణీపుత్రోऽపి పాటలీపుత్రవిరహాత్ స్వజనదర్శనోత్సుకో భృశమస్వస్థః | స ఏషోऽద్య శ్వో వా ప్రస్థాయతే | పునర్ద్రష్టాస్మి భవతీమ్ | కింతు స్వస్థరూపయా తయా భవితవ్యమ్ | స్మర్తవ్యాః స్మో వయమ్ |

కులే ప్రసూతః = కులీనుడు, శ్రుతవాన్ = విద్వాంసుడు, అవిస్మితః = తొణకనివాడు, స్మితాభిభాషీ = నవ్వుతూ మాట్లాడువాడు, చతురః = చతురుడు, విమత్సరః = మత్సరము లేనివాడు, ప్రియంవదః = మృదుభాషణుడు, రూపవయోగుణాన్వితః = రూపము, వయస్సు, గుణములతో కూడినవాడు, శరీరవాన్ = శరీరము కలిగిన, అధనుర్ధరః కామః = ధనువులేని మదనుడు.

తాత్పర్యము: కర్ణీపుత్రుడు కులీనుడు, పండితుడు, గంభీరుడు, స్మితభాషి, చతురుడు, మాత్సర్యము లేనివాడు, మృదుభాషణుడు, రూపయౌవనగుణసంపన్నుడు, శరీరమున్ననూ, ధనుస్సు లేని మన్మథుడు.

విశేషము: కర్ణీసుతుని వర్ణన ఇది. ఈతడు సంస్కృతసాహిత్యంలో పలుచోట్ల కనిపిస్తాడు. (మున్నుడి). వంశస్థవృత్తము. జతౌ తు వంశస్థముదీరితం జరౌ - అని వంశస్థవృత్తసూత్రము.

దేవసేన ముఖము దించుకున్నదేమి? మేలిముసుగు అంచు ను వ్రేలికి చుట్టుట ఆపుము. అయినచో వివరింపుము. మేము విశ్వాసపాత్రులని నెంచియూ మౌనమే వహించుచున్నావు. లేదా యువతులకు అందున ప్రౌఢకామినులకు లజ్జయే అరణము. ఎలా చెప్పగలవు మరి? అదికాక, ’పురుషవిశేష’ మను అసాధారణశబ్దము కర్ణీపుత్రునికే చెందినచో, అప్పుడు గాంభీర్యము పొందని నీకై, దిట్టతనము నొందునట్లు అతనిచే వ్యవహరింపజేతును.

బాగు దేవసేనా, ఇతరుల రహస్యములు వినుటలో నాకేమి ప్రయోజనము? మేము ఉదాసీనులము. కేవలము నీకు ఉపాయము చెప్పెదము. కర్ణీసుతుడునూ, పాటలీపుత్రమును విడచుటవలన, తన స్వజనులను చూచుట యందు ఉత్సుకుడై అస్వస్థుడాయెను. అతడు నేడో, రేపో బయలుదేరును. నిన్ను తర్వాత కలిసెదను. కానీ నీవు ఆరోగ్యవంతురాలవు కావలెను. నన్ను గుర్తుంచుకొనుము.

(ఉత్థాయ ప్రస్థితః | సత్వరం నివృత్య) అయే కేనైతదుక్తం – “హన్త వ్యాపన్నేదానీమ్” ఇతి | ఆ దేవసేనా రోదితి | వాసు కిమిదమ్, అలమలం రుదితేన | భవతు | గృహీతామ్ | దిష్ట్యా పాత్రగతో మనోరథః కర్ణీపుత్రస్యాపి త్వన్మయ ఇవ వ్యాధిః | తదితరేతర- స్యౌషధత్వేన కల్పయితవ్యమ్ | కిం బ్రవీషి – “కిముచ్చైః కథయసి | దుఃఖశీలః ఖలు భావ” ఇతి | అలమలం యన్త్రణయా –

దక్షాత్మజః సున్దరి యోగతారాః కిం నైకజాతాః శశినం భజన్తే |

ఆరుహ్యతే వా సహకారవృక్షః కిం నైకమూలేన లతాద్వయేన ||

కిం బ్రవీషి – “తథేదానీం సంప్రధార్యతాం యథోభయం రక్ష్యతే” ఇతి | అథ కిమ్ | సంప్రధారితమేవైతత్ | శ్వః కిల ఏ భగినీ యథోచితమాచార్యగృహం నృత్తవారేణ యాస్యతి | తతో లబ్ధాన్తరవిస్రంభా సుభగే సుఖప్రశ్నవ్యాహారవ్యాజేన | త్వం వా తత్ర యస్యసి స వేహాగమిష్యతి | కిమియం విమర్శదోలా వాహ్యతే ?

(లేచి బయలుదేరును. కానీ మరల వచ్చి)

అరే, ఎవరిలా అన్నది – “ హా! నాకిక చావే గతి!” అని. ఆ, దేవసేన యేడ్చుచున్నది. ఇప్పుడేమిటిది, శోకము చాలును….సరిసరి, అర్థమయినది…నీ మనోరథము యోగ్యమైనదే. కర్ణీపుత్రునికీ ఇదే వ్యాధి ఉన్నది. మీరిద్దరూ ఒకరికొకరు వైద్యం చేసుకోవలెను కాబోలు. ఏమందువు? “ పెద్దగా దేనిని వివరించుచున్నావు? ఆర్యుడు కర్ణీపుత్రుడు దుఃఖభాజనుడ”నియా? ఆలోచించుట చాలు.

సుందరి = ఓ సుందరీ!, దక్షాత్మజాః = దక్షపుత్త్రికలు, యోగతారాః = తారలు కలిసి, ఏకజాతః = ఒకడేయైన, శశినం = చంద్రుని, కిం న భజన్తే = పూజింపరా? న ఏకమూలేన = ఒకే మూలము కాని, లతాద్వయేన = రెండు తీవెలచేత, సహకారవృక్షః = మామిడిచెట్టు, నా ఆరుహ్యతే వా కిమ్? = అల్లుకొనబడుటలేదా ఏమి?

తాత్పర్యము: ఓ సుందరీ! తారలందరు కలిసి ఒక్కచంద్రుని అర్చింపరా? ఒకే మూలము లేని రెండు లతలు మామిడిచెట్టును అల్లుకొనదా?

విశేషములు: నిదర్శనాలంకారము. ఇంద్రవ్రజ (స్యాదింద్రవ్రజా యది తౌ జ గౌ గః .ప్రతి పాదమునా రెండు త గణములు, జ గణము, రెండు గురువులు)

ఏమనుచున్నావు?-”అందుకే ఇక నిద్దరు రక్షింపబడునట్లు ఉపాయమాలోచింపుము” అనియా. మరి కాదా? ఇదంతయూ ఆ అలోచనయే. రేపు నీ సోదరి యథోచితముగా ఆర్యుని (కర్ణీసుతుని) గృహమునకు నృత్తవారాదులతో వెడలును. అప్పటికి నీ అంతః కరణమును చక్కగ మార్చుకుని తరుణీ, నీవు కుశలప్రశ్నలవ్యాజమున అచ్చటకు వెళ్ళుము, లేదా అతడు ఇక్కడికి వచ్చును. ఏల డోలాయమానమానసమున సంశయించుచున్నావు?

కిమాహ ప్రియవాదినికా – “న మమేహార్యపుత్రస్యాగమనం రోచతే | యథాऽత్ర భవత్యాస్తత్ర గమనమ్ | గణికాజనో నామ పైశున్యప్రాభృతైషా జాతిః |

తస్మాదహమేవాస్యా యథోచితం యోజయిష్యామి యథా నృత్తవారాత్ ప్రస్థితాద్య దేవదత్తా స్వయమ్ | ఏవ మమ స్వామినీం సుఖప్రశ్నాగమనేనార్యమూలదేవసకాశమనునేష్యతి |” సాధు ప్రియవాదినికే ఇదానీం ఖలు యథార్థానామతా | ఉచితం చాస్యాస్తత్రగమనమ్ | కిన్తు స్వస్థరూపయానయా భవితవ్యమ్ |

కిమాహ దేవసేనా – “నను భావదర్శనాత్ స్వస్థైవాహమ్” ఇతి | ప్రియం మే | కృతం మదనకర్మ | కర్ణీపుత్రప్రాణధారణార్థే కించిత్ స్మరణీయం దాతుమర్హసి | కిం బ్రవీషి – “కిం దాస్యామి” ఇతి | కిం నామ విచార్యతే | ఇదం ఖలు -

ప్రియవాదిని, ఏమంటివి? – “ఆర్యపుత్రుడిచటికి వచ్చుట యుచితము గాదు. అచ్చటికే యేగవలయును. వేశ్యలనగా కొండెతనములిత్యాదివి గలిగిన జాతి.

అందుకై, నేనే యథోచితముగా నిట్లు యోజింతును. నృత్తవారాదులను నిర్వహించుటకై స్వామిని స్వయముగా కుశలప్రశ్నను విచారించు నెపమున ఆర్యుడు మూల దేవుని కడకు పోవును.” బాగు ప్రియవాదినికా, సార్థకనామధేయమన నిదే కదా. అక్కడికి వచ్చుటయే యుచితము. అందువలన మీరు బాగుగ ఆరోగ్యమును పొందనగును.

ఏమంటివి దేవసేనా – “పండితుని దర్శనము వలన ఆరోగ్యవంతురాలనైనాను” అనియా. నాకు ప్రియమే. మదనకర్మ జరిగినది. కర్ణీపుత్రుని ప్రాణములను నిలుపుటకు స్మరణీయమైనది కొంచెమివ్వవలసినది. ఏమందువు? “ఏమిత్తుననియా?” ఆలోచించుటకేమున్నది, ఇదే కదా -

(తరువాయిభాగం వచ్చేవారం)

Download PDF EPUB MOBI

Posted in 2015, జనవరి, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.