palaparthi cover

surprise కి surprise

.
అమ్మ మిఠాయి దుకాణంనుండి మైసూర్ పాక్ తెచ్చింది.
పాపకు తెలియకుండా అల్మరాలో దాచిపెట్టింది.
ఆటల్లో మునిగిపోయి ఉంది పాప.
నీకో surprise ఇస్తాను దా!
కేకేసింది అమ్మ.
ఏంతమ్మా? అంటూ వచ్చింది పాప.
నీకోసం తింటానికి ఏం తెచ్చానో చెప్పుకో?
అడిగింది అమ్మ.
ఆ.. జీడీ?
కాదు!
లడ్డూ?
కాదు!
చాక్లెట్?
కాదు!
కీం బిస్కెత్?
కాదు!
సరే! నేనే చెబుతాలే!
surprise!!
ఇదిగో మైసూర్ పాక్ తెచ్చా చూడు!
మైసూర్ పాక్ డబ్బా మూత తెరిచి
చూపించి
ఒకటి తీసి
ఇచ్చింది అమ్మ.
పాప మైసూర్ పాక్ ముక్క కొరికి తింటూ
ఓ! మైసూర్ పాకు!
అమ్మా!
నువ్వు మైసూర్ పాకు తెచ్చావని నాకు అప్పుడే తెలుసు! అన్నది.
మరైతే ఎందుకు చెప్పలేదు?
అడిగింది అమ్మ.
నీకు surprise ఇవ్వాలని చెప్పలేదు!
surprise!!
అని చేతులు పైకెత్తి
గంతు వేసింది పాప.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

 

Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, జనవరి, సీరియల్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.