cover

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014 ఫలితాలు

ఏడాది క్రితం కినిగె.కామ్ ప్రకటించిన ‘అక్షర లక్షల నవలా పోటీ‘ ఫలితాలివి:

.

AhanikiRamgumdadu

లక్ష రూపాయల మొదటి బహుమతి కి ఎంపికైన నవల: అహానికి రంగుండదు“, పి చంద్రశేఖర అజాద్

కమ్యూనిస్టు ఉద్యమ జీవితాల నేపథ్యంలో సాగే కథ. ఒక ఆదర్శవాద యువకునిగా మొదలై చివరకు కరుడుగట్టిన మెటీరియలిస్టుగా పరిణమించే కథానాయకుడు తన గొంతుతోనే కథ చెప్తాడు. పాత్రల చిత్రణ కథకు ప్రధాన బలం. శైలి కూడా ఎక్కడా ముందుకొచ్చి కనిపించకుండా చదివించుకుంటూ పోతుంది.

.

.

5-3-2

పాతిక వేల రూపాయల రెండవ బహుమతికి ఎంపికైన నవల:5 – 3 – 2“, ఎస్. శ్రీదేవి

ఆలయమూ, నిధీ, అన్వేషణ.. ఇలాంటి కథాంశంతో సాగిన నవల. ద్వాపరయుగానికి, ఇటు వర్తమానకాలానికి మధ్య గంతులేస్తూ సాగే కథనం. కాసేపు ఫామిలీ డ్రామా గానూ, కాసేపు సస్పెన్స్ నవల గానూ సాగుతుంది. పాత్రల చిత్రణ వాస్తవికంగా ఉండి చదివిస్తుంది.

.

.

Adwiteeyam

పదివేల రూపాయల మూడవ బహుమతికి ఎంపికైన ఒకటో నవల:అద్వితీయం“, రసిఖ

ఒక యువకుడు కాలేజికి వెళ్ళటంతో మొదలవుతుంది కథ. అతను జీవితం అసంతృప్తి దారిలో పోయినపుడల్లా దేవుణ్ణి నిలదీస్తాడు. దేవుడు అతను కోరుకున్న సవరణలు చేస్తాడు. ఐనా జీవితం మళ్ళీ అసంతృప్తి దారిలోనే పోతుంది. చివరకు ఆనందం కోసం బయట వెతికినంత సేపూ అసంతృప్తి అనేదే అంతిమ పర్యవసానం అనీ, ఆ వెతకటం ఆపి పరుగు నిలిపితే నిశ్చింత వస్తుందనీ అర్థమవుతుంది.

.

.

Adrushtam

పదివేల రూపాయల మూడవ బహుమతికి ఎంపికైన రెండవ నవల:అదృష్టం“, నండూరి వెంకట సుబ్బారావు

థ్రిల్లర్ విభాగానికి చెందిన నవల. చాలా డబ్బున్న సూట్‌కేసు గల్లంతవుతుంది. ఈ చిన్న సంఘటనతో మొదలైన కథ అటు టెర్రరిజాన్ని, ఇటు రాజకీయాల్నీ తాకుతూ ఉత్కంఠగా సాగుతుంది.

*

ప్రకటించిన బహుమతులు ఉగాదిలోగా అందించబడతాయి. పోటీలో గెలిచిన విజేతలకు మా హార్ధికాభినందనలు. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన అభ్యర్థులందరికీ మా కృతజ్ఞతలు. పోటీ నిర్వహణలో సహకరించిన శ్రేయోభిలాషులకు, జడ్జిలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదములు. కినిగె భవిష్యత్తులో తలపెట్టబోయే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలకు మీ అందరి సహకారమూ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాము.

*

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, జనవరి and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.