cover

రోజు గడిచింది

.
వద్దన్నా వచ్చి గుద్దేస్తుంది.
.
బళ్ళో లెక్కల మాష్టారిలా
నిన్న రాని లెక్కనే
మళ్ళీ చేసుకురమ్మని
అదే పాత క్లాసు రూము బయటికి, గెంటేస్తుంది.time
.
కుక్క మెడలో కట్టిన ఎముక లాగా
ఎంత గింజుకున్నా
జానెడు పొట్టని మించి ఇంచి కూడా కదలదు.
.
నిన్నటికీ నేటికీ మధ్య పెద్ద తేడా
వయసు ఒక రోజు పెరిగింది.
.
ఉన్నందుకు, రోజుకో కొంత
అవమాన భారాన్ని నెత్తి మీద పెడుతూ
నెమ్మది నెమ్మదిగా కుంగదీస్తున్నట్టు
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.
.
ఇదంతా అనవసరమని తెలిసినా
అలవాటయిన రూటు మ్యాపునే
జిరాక్సు తీసి చేతిలో పెట్టి
‘ఇంకొంచెం ముందుకెళ్ళు’ అంటుంది.
.
మరో రోజు మామూలుగానే గడిచిపోయింది.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, కవిత, జనవరి and tagged , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.