cover

పద్మప్రాభృతకమ్ (13)

Download PDF EPUB MOBI

దీని ముందు భాగం

ఈషల్లీలాభిదష్టం స్తనతటమృదితం పత్రలేఖానువిద్ధం

ఖిన్నం నిశ్వాసవాతైర్మలయతరురసాక్లిష్టాకజల్కవర్ణమ్ |

ప్రాతర్నిర్మాల్యభూతం సురతసముదయప్రాభృతం ప్రేషయాస్మై

పద్మం పద్మావదాతే కరతలయుగళభ్రామణక్లిష్టనాళమ్ ||

పద్మావదాతే = రక్తపద్మము వలే శుభ్రమైన తరుణీ! (పద్మినీ జాతి దానా) ఈషత్ = కొంచెము, లీలాభిదష్టం = లీలగా కొరకబడినది, స్తనతటముదితం = పాలిండ్ల చివర బయల్వెడలినది, పత్రలేఖానువిద్ధం = పత్రలేఖ చిహ్నమును ధరించినది, మలయతరురసాక్లిష్టాక = చందనపు చెట్టు గాళుల ఆవరింపు గల, నిశ్వాసవాతైః = ఊపిరులచేత, అజల్కవర్ణం = మసివారినది, ప్రాతః = ఉషస్సున, నిర్మాల్యభూతం = తొలగించుటకు ఉంచబడినది, సురతసముదయప్రాభృతం = సురతము కలుగుటకునగు ఉపహారమైనది, కరతలయుగళభ్రామనాక్లిష్టనాళమ్

కరతలయుగళ = రెండు చేతులమధ్య

భ్రామన్ = భ్రమణము కలుగుట (త్రిప్పబడుట) వలన

ఆక్లిష్ట = లాగబడిన

నాళం = సూత్రము కలిగినది అయిన,

పద్మం = రక్తకమలమును, అస్మై = అతనికి, ప్రేషయ = పంపుము.

తాత్పర్యము: ఓ పద్మినీ! అలవోకగా నీ దంతములచేత కొరకబడినది, స్తనముల వద్ద నుండి బయల్వెడలినది, నీ చెక్కిలిపై గల పత్రలేఖాచిహ్నములను దాల్చినది, చందనపు చెట్టు గాలి వంటి నీ ఊపిరిచేత కొంత మ్లానమయినది, సుతారముగ నీ చేతుల మధ్య త్రిప్పబడుటవలన నాళము బయటకు వచ్చినది అయిన ఒక రక్తకమలమును అతనికి బహుమతిగ పంపుము.

విశేషములు: పద్మావదాతే = పద్మము వలే శుభ్రమైనది అనుట వలన పద్మిని జాతి స్త్రీ యను ధ్వని. పత్రలేఖానువిద్ధం = చెక్కిలిపైన అగరు/కస్తూరి వంటి సుగంధద్రవ్యములతో చక్కని ఆకృతులను చిత్రించుకొనుట ఒకప్పటి అలంకరణలలో భాగము. శ్యామలాదండకమున “..లావణ్య గండస్థల న్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత..” అని అంబ వర్ణనము.(శ్యామలాదండకకర్తగా కాళిదాసు ఆపాదింపబడెను). పత్రలేఖా అనువిద్ధం అనగా = చెక్కిలి క్రింద నలుగుటచే పద్మమున చెక్కిలిపై చిత్రించిన ఆకారము ముద్రింపబడినదైన (పద్మము) అని అర్థము.బహుమతి పంపుము అను విధేయార్థము ద్వారా శృంగారోద్దీపకమగు వస్తువును చమత్కరించుట రమణీయమైన ధ్వని. వాక్య వక్రోక్తి. ఈ భాణపు నామము పద్మప్రాభృతకము ఈ శ్లోకము వలననే ఏర్పడినది.

పద్మప్రాభృతకము అనగా పద్మమను ఉపహారము/బహుమతి. స్రగ్ధరావృత్తము (మ ర భ న య య య).

కథం కాటాక్షాపాతేనైతదనుజ్ఞాతమనయా | హన్త ప్రతిగృహీతం ప్రాభృతం సురతసత్యంకారస్య | యావదనేనౌషధేన కర్ణీపుత్రం సంజీవయామి | (గృహీత్వోత్థాయ స్థిత్వా) ప్రస్థితోऽస్మి | సుఖం భవత్యై | సుభగే గృహీతామాశీః |

భయద్రుతమసూచితప్రచలమేఖలానూపురం

సశంకశిథిలోపగూహమవముక్తనీవీపథమ్ |

స్వయం సమభివాహయత్వయముదాత్తరాగాయుధః

తవ ప్రథమచోరికాసురతసాహసం మన్మథః ||

(ఇతి నిష్క్రాన్తో విటః)

ఇతి శ్రీశూద్రకవిరచితః పద్మప్రాభృతకం నామ భాణః సమాప్తః|

ఎట్టూ? కనులు దించుకుని ఆమోదము తెలిపినది. అహో సురతవిషయ బేహారమున మంచి ఫలము ముట్టినది. ఈ మందుతో కర్ణీపుత్రుని స్వాస్థునిగ జేసెదను.(స్వీకరించి, పైకి లేచి కాస్త ఆగి). ఇక ఉందును. నీకు సుఖమగుగాక. సుతను! ఇదిగో, ఆశీర్వాదము పుచ్చుకొనుము.

భయద్రుతం = భీతి గలదై, అసూచితప్రచలమేఖలానూపురం = బహిర్గతము కాని వడ్డాణపు చప్పుడు, అందెల రవళులు కలదానిని, సశంకశిథిలోऽపగూహం = శంకతో, గాఢము కాని కౌగిలి గలదానిని, అవముక్తనీవీపథం = వీడిన పోకముడి గలదానిని, స్వయం = తానే, ఉదాత్తరాగాయుధః = అనురాగమునే ఆయుధముగా కలిగినవాడు, మన్మథః = మదనుడు, తవ = నీయొక్క, ప్రథమచోరికా సురతసాహసం = మొదటి సారి చేయు రంకును, సమభివాహయతు = ప్రోత్సహించుగాక.

తాత్పర్యము: భయముచేత వడ్డాణపు, అందెల రవళులు బహిర్గతము చేయక, వెడలు దారి మధ్యనే తమకము చేత పోకముడి వీడి, శంకతో గాఢముగా కౌగిలింపక, ప్రథమ సురతక్రీడకై సాహసము చేయు నిన్ను మదనుడు ప్రోత్సహించుగాత!

విశేషములు: ప్రకృతమైన భీతి, అప్రకృత రసమైన శృంగారమును చమత్కరించి, పోషించుచున్నది గావున రసధ్వని. అభిసారికానాయిక వర్ణనము. పృథ్వీవృత్తము. (జ స జ స య లఘువు, గురువు) అసూచితప్రచలమేఖలానూపురం = భయము చేత ఒక్కొక్క అడుగునూ వేస్తున్న కారణాన వడ్డాణము జారుతున్నదని, అందెల చప్పుడు వినిపించుట లేదని సూచన. పృథ్వీ వృత్తము – “జ స జ స య లఘువు, గురువు” అని గణములు.

(అని విటుడు వెడలిపోవును)

శూద్రకవిరచితమైన పద్మప్రాభృతకమను భాణము సమాప్తము. 

*

శ్లోక సూచి

అవ్యాధిగ్లానమంగం – 57

ఆతోద్యం పక్షిసంఘాస్తరురసముదితాః – 11

ఆక్షిప్తస్రస్తవస్త్రాం ప్రశిథిలరశనాం – 31

ఈషల్లీలాభిదష్టం – 62

ఉన్నిద్రాధికతాన్తతామ్రనయనః -15

ఉన్మత్తే తైవ తావత్స్తనవిషమమురే – 58

కలావిజ్ఞానసంపన్నా -22

కామావేశః కైతవస్యోపదేశో – 37

కిముక్తా కేన త్వం ప్రతివచ – 23

కృత్వా విగ్రహమాగతోऽసి – 24

కృశా వివర్ణా పరిపాణ్డునిష్ప్రభా – 56

కిం కృత్వా భృకుటీతరఙ్గవిషమం – 24

కులే ప్రసూతః – 60

కాన్తం కందర్పపుష్పం – 55

జయతి భగవాన్ స రుద్రః – 9

దన్తపదజర్జరోష్టీ – 53

దక్షాత్మజః సున్దరి యోగతారాః – 61

నిభృతవదనా శోకలగ్నా – 44

నిశ్వస్యాధోముఖీ కిం విచరసి – 50

నైవాహం కామయామీత్యసకృతభిహితం – 59

పద్మోత్ఫుల్లశ్రీమద్వక్త్రా సితకుసుమముకుళదశనా – 32

ప్రచలకిసలయాగ్రప్రనృత్తద్రుమం – 13

ప్రవాళలోలాంగుళినా – 46

ప్రేంఖోలత్కుణ్డలాయా – 48

ప్రాయశ్శీతాపరాద్ధా – 50

ప్రాప్త ఇవ శరత్కాలః -22

పుష్పసముజ్జ్వలాః కురవకా నదతి – 10

పుణ్యాస్తావద్ వేదాభ్యాసా – 18

పుష్పస్పష్టాట్టహాసః సమదమధుకరః – 20

భద్రం తే వలభీగవాక్ష – 45

భయద్రుతమసూచితప్రచలమేఖలానూపురం – 64

మూలదపి మధ్యాదపి – 12

రత్యర్థినీం రహసి యః – 28

రాగోత్పాదితయౌవనప్రతినిధిచ్ఛన్నవ్యలీకం – 34

వాసన్తీకున్దమిశ్రైః కురవకకుసుమైః – 40

విఖణ్డితవిశేషకం – 42

విభ్రాన్తేక్షణామక్షతోష్టరుచకం – 15

వేశ్యాంగణం ప్రవిష్టో – 38

ససంభ్రమపరభృతరుతః – 12

సంపాతేనాతిభూమిం ప్రతరసి – 36

సూర్యం యజన్తి దీపైః -21

స్వైరాలాపే స్త్రీవయస్యోऽపచారే – 27

స్వప్నాన్తే నఖదన్తవిక్షతమిదం – 43

శుక్లసితాంతరక్తా – 52

సమాప్తం

Download PDF EPUB MOBI

Posted in 2015, జనవరి, పద్మప్రాభృతకమ్, సీరియల్ and tagged , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.