cover

నియతి

మాయమ్మ నన్ను కడుపున
పడేసుకున్నప్పుడే. . .
నా గుండెలో. . .
వొక పుండు పుట్టింది
నాలోనే పెరిగి పెద్దదయి
నా నీడయి తోడయ్యింది
అదెలాగుంటదంటే. . ఏం జెప్పాలె
కనుపాపలోని జింగన్న పురుగులాగా
ఉంటుంది
ఈ లోకమంతా . . .
దాని రెక్కల చప్పుడుకిందనే
కునుకుపడుతుంది
- సిద్ధార్థ

Download PDF EPUB MOBI

(Munch painting, Source: Wikipedia)

Posted in 2015, కవిత, జనవరి and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.