Axix Mundi

రెండు కవితలు

1.
.
సగం చెరిపేసి
సగం అలికేసినట్టున్న
నిన్నటి రాతలు
.
అతనొచ్చీ రాగానే
అంతా తుడిచేస్తాడు
.
చిక్కని ఆకాశంలో
చుక్కలు పొడిచినట్టు
అతని అక్షరాలు!
2.
.
మెల్లగా
మెల్లగా
మెల్లగా
ఒక్కో పువ్వూ విచ్చుకుంటుందని
.
తవ్వగా
తవ్వగా
తవ్వగా
ప్రశ్న లోతుల్లోనే సమాధానం పాతిపెట్టబడి ఉంటుందని
.
పుస్తకాన్ని నువ్వు తెరిస్తే
పుస్తకం నిన్ను తెరుస్తుందని. .
.
సూర్యోదయమౌతుంటే
ప్రతి కొండా
అరుణాచలమేనని. . .

– మూలా సుబ్రహ్మణ్యం

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, కవిత, జనవరి and tagged , , , , .

4 Comments

  1. “పుస్తకాన్ని నువ్వు తెరిస్తే
    పుస్తకం నిన్ను తెరుస్తుందని. .“ అంటున్న సుబ్రతో బాబూ!

    మరి మీ త్రిపుర గారేమో ఇలా వార్నింగ్ ఇస్తున్నారు
    “ఒక గొప్ప కవితో కావ్యమో చదివినప్పుడు
    విజృంభించిన ఒక మహా కెరటంలో కొట్టుకుపోవచ్చు ” అంటూ

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.