cover2

నీలె నీలె అంబర్ పర్..!

అర్ధరాత్రో, అపరాత్రో, సమయంతో సంబంధం లేదు. మెలకువొచ్చి

నిద్ర పట్టనప్పుడు చీకటి కళ్ళలోకి సూటిగా చూడ్డం నేర్వాలి.

 

ఆశలన్నీ అడుగంటినప్పుడు తోడొచ్చిన అశ్రువుని మన

ఆత్మబంధువుగా తలవాలి. కొత్త రేపటిని తెరవాలి.

 

నమ్మినవారే పువ్వుని కోసినా సాధ్యమైనంత తొందరగా ఆ దుఖ్ఖం

నుంచి తేరుకోవాలి. చెల్లాచెదురైన మనల్ని మనమే ఏరుకోవాలి.

 

అంతరంగమే అంతా కాదు. ఆవలి ప్రపంచంలోనూ కలియదిరగాలి.

వూహించనిచోట, ఆశించని అద్భుతం నీలోకి వొంపిన

అనిర్వచనీయమైన ఆనందాన్ని దక్కించుకుని

మురవాలి.

 

మెరవాలి.

— మోహన్ రుషి

Download PDF EPUB MOBI

Posted in 2015, కవిత, ఫిబ్రవరి and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.