cover

కినిగెలో కొన్ని కొత్తపుస్తకాలు

భాగవతంలో చిన్న కథలు

రచన: ప్రయాగ రామకృష్ణ

BhagavathamloChinnakathalu600

 

ప్రయాగ రామకృష్ణ గారి భాగవతంలో చిన్నకథలలో అటు వేదాంతం, తాత్త్వికధోరణి, ఇటు కవిత్వ అభివ్యక్తీకరణ చెట్టాపట్టాలేసుకుని చిందులు తొక్కాయి. ఈ భాగవతంలోని చిన్న కథలు, నవ్య వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమై ప్రజామోదాన్ని పొందగలగటానికి భాగవతంలోని నిత్యమైన సత్యమైన ఆకర్షణ ఒక ఎత్తైతే – రామకృష్ణగారి కథాకథనశైలీమాధుర్యం మరో బలవత్తరమైన ఆకర్షణ అయి నిలిచింది. – దత్తప్రసాద్ పరమాత్ముని

ఈబుక్ లభ్యం

*

గోపీచంద్ రచనా సర్వస్వం

రచన: త్రిపురనేని గోపీచంద్

AsamarthuniJeevayatra600 GopichandCinemaRachanalu600

కథా, నవలా రచయితగా ప్రముఖుడైన గోపీచంద్‌ 30-50 దశకాల మధ్యకాలంలో కొన్ని తెలుగు సినిమాలకు కథల్ని అందించారన్న విషయం కొందరికే తెలుసు. అంతేకాక ఆయన లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారని తెలిసి, ఆశ్చర్యపోతాం. ఈ సంపుటిలో ఆయన రాసిన రైతుబిడ్డ, గృహప్రవేశం, లక్ష్మమ్మ, సినిమా కథలు, పాటలూ ఉన్నాయి.

ప్రింటు బుక్స్ లభ్యం

*

హిమజ్వాల, చీకట్లోంచి చీకట్లోకి

రచన: వడ్డెర చండీదాస్

Himajwala600  CheekaltonchiCheekatloki600

 

సాహిత్యాకాశంలో వురుములూ మెరుపులూ అస్తమానూ రావు. పెద్ద వర్షం కురిసే ముందో వెనుకో అవి వస్తాయి. ఆ వర్షమే హిమజ్వాల. తమ తొలి నవలతో అఖండమైన పేరు ప్రఖ్యాతులు ఆర్జించినవారు ఏ భాషలోనైనా అరుదుగానే వుంటారు. కీర్తి వెనకాల పరుగెత్తకుండా శ్రీ వడ్డెర చండీదాస్ తమ తొలి నవలతోనే అగ్రశ్రేణి రచయితల పీఠాన్ని ఆక్రమించారు.  – పురాణం సుబ్రహ్మణ్య శర్మ

“చీకట్లోంచి చీకట్లోకి” అనుభూతిలో జనించి సహజ రూపం సంతరించుకొన్న నూతన సాహిత్య ప్రక్రియ. యిందులోని ఐదు కథలూ నిదానించి విడివిడిగా నిశితంగా చదివితే ఏ కథ కా కథ ఒక మంచి కథ. ఐదూ కలిపి మన భావవేగంతో సమానంగా స్పందిస్తూ చదివితే ఒక స్త్రీ నిండు జీవితాన్ని ప్రత్యక్షంగా చిత్రించే సజీవ నవల. స్పందన ద్వారా ప్రత్యనుభూతి స్థితి చేరి మనోనేత్రాల్తో అయిదు సంఘటనల్నీ ఏకం చేసి అందులో ఐక్యం అయి దర్శించగలిగితే తన్మయపరిచె ఒక విషాద నాటకం.  – గుత్తికొండ నాగేశ్వరరావు

ప్రింటు బుక్స్ లభ్యం

*

భూచక్రం

రచన: మధురాంతకం నరేంద్ర

Bhoochakram600

 

ఈ నవలలోని తిరుపతి ఒక నమూనా మాత్రమే! తిరుపతిలో మహమ్మారిలా విస్తరించిన ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు గల చరిత్రనూ, వందేళ్ళకాలపు మూలాలనూ శోధించి, రాసిన ఒక పరిశోధనాత్మక, ప్రయోజనాత్మక నవల ఈ ‘భూచక్రం’! ఈ వర్తమాన సామాజిక విషాద ”భీభత్సాన్ని” నవలీకరించటంలో నరేంద్ర నిర్మాణ కౌశలం ఎంతో సృజనాత్మకమైనది! ఇలాంటి నవల తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిది అని చెప్పటం ఇందువల్లనే! – సింగమనేని నారాయణ

ప్రింటు బుక్ లభ్యం

*

అమ్మ చెప్పిన కథలు

రచన: కరణం అన్నపూర్ణమ్మ

AmmaCheppinaKathalu1600

ఈ చిన్ని పుస్తకంలో సంకలనం చేసినవి నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రుల, మా తాత ముత్తాతల వద్ద విన్నవి. అప్పట్లో కథల పుస్తకాల ప్రాచుర్యం అంతగా లేకపోవడంవల్ల, ఉన్నా పుస్తకాలు కొనే సామర్థ్యం లేకపోవడం కారణంగా మౌఖికంగానే తరతరాల పిల్లల మస్తిష్కాలలోకి వెళ్ళిపోయాయి. నా పిల్లలకు, నా మనుమలకు, మనుమరాళ్ళకు కూడా ఈ కథలు చెప్పాను. వీటిలో నీతి మాత్రమే ఇతివృత్తంగా ఉండడం కాదు, కొద్దో గొప్పో హాస్యం కూడా మిళితమై పిల్లల ఊహాశక్తిని పెంచడానికి ఉద్దేశించినవి ఉన్నాయి. నా ఉద్దేశంలో పిల్లలకు ఆరేళ్ళు వచ్చేవరకూ హాయిగా ఈ కథలు చెప్పొచ్చు. బాగా చెప్తే పదే పదే చెప్పిన కథనే చెప్పించుకోవటం అనుభవ పూర్వకంగా గ్రహించాను. వీటివలన ధారణాశక్తి పుష్కలంగా పెరుగుతుందంటే ఏ మాత్రం సందేహం లేదు. తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో చెప్పుకు వస్తున్న ఈ కథల సమాహారాన్ని పుస్తకంగా పొందుపరచడం జరిగినది. చదివి సంతోషిస్తారని, పిల్లలకు చెప్పి వారి బుద్ధి కుశలతకు తోడ్పడుతారని ఆశిస్తున్నాను. నేను చెప్పిన ఈ కథలను పుస్తక రూపంలో గ్రంథస్తం చేసిన నా కుమారుడు నాగరాజరావుకు నా ఆశీస్సులు. – కరణం అన్నపూర్ణమ్మ

ఈబుక్ లభ్యం

*

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం: భీమిరెడ్డి నరసింహారెడ్డి అనుభవాలు

రచన: భీమిరెడ్డి నరసింహారెడ్డి

TelanganaRaitangaPoratamBhimireddyNarasimhareddyAnubhavalu600

తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం. వ్యవసాయక విప్లవాన్ని సాధించటానికి, ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకల్చి, నిజాం నిరంకుశ వ్యవస్థను కూలదోసి ప్రజారాజ్యాన్ని స్థాపించుకోవడానికి, తెలంగాణ రైతాంగం సాగించిన పోరాటమే ఈ పోరాటం. ఏడు దశాబ్దాలు తెలంగాణ చరిత్రలో బి.ఎన్‌ నిర్వ హించిన పాత్ర అజరామరమైనది. తెలంగాణ ప్రజలు విస్మరించలేనిది. బి.ఎన్‌. రాజకీయ స్ఫూర్తి, పోరాటస్ఫూర్తి, నిరాడంబరత, నిస్వార్థ జీవనం నేటి తరానికి మార్గదర్శకం కావాలి.

ఈబుక్ & ప్రింటు బుక్స్ లభ్యం

*

ఉనికిపాట్లు

రచన: ఎలికట్టె శంకర్ రావు

Unikipatlu600

తాను ప్రత్యక్షంగా గతంలో చూసినవాటిని వర్తమానంలో చేసుకున్న అవగాహనతో సామాజిక జీవనకోణాలను కథలుగా మలవడం ఒక పద్ధతి. ఈ పద్ధతే ఎలికట్టె శంకరరావు ప్రత్యేకత. కథా రచయిత నిజాయితీగా తన పాత్ర తాను పోషిస్తాడు. అంటే ఒక గ్రామం బొడ్రాయి వద్ద నిలబడి కథను చెబుతాడు. అందుకే గ్రామీణ జీవన వాస్తవికతను చెప్పడానికి అతను ఎంచుకున్నది గ్రామీణులు వాడే మాండలిక భాషే. కథని అల్లుతూ అల్లుతూ రచయిత కూడా తాను గ్రామీణుడైపోతాడు. ఆ మొత్తం వాతావరణంలో పరాయి గొంతు, భాష, భావన ఎక్కడా కనిపించదు. ఆ రకంగా అచ్చమైన దేశీకథలు ఇవి. – జయధీర్ తిరుమలరావు

ఈబుక్ & ప్రింటుబుక్స్ లభ్యం

*

అయ్యయ్యో దమ్మక్కా… (కయితల దొంతి)

రచన: జూపాక సుభద్ర

AyyayyoDammakka600

 

ఈబుక్ & ప్రింటు బుక్స్ లభ్యం

*

 

అక్కినేనీ – కథానాయికలు

రచన: ఎస్. వి. రామారావు

AkkineniKathanayikalu600

తెలుగు సినీ చరిత్రకారులు శ్రీ ఎస్‌.వి.రామారావు మమ్మల్ని యెంతోగానో అభిమానించే వ్యక్తి. సినిమా చరిత్రపై పలు గ్రంథాలు వ్రాసారు. అక్కినేని నాగేశ్వరరావుగారితో నటించిన కథానాయికల పాత్రలను విశ్లేషిస్తూ ‘అక్కినేనీ – కథానాయికలు’ పేరిట వ్రాయటం, దానిని అక్కినేనిగారి జీవిత కథానాయిక శ్రీమతి అన్నపూర్ణగారికి అంకిత మివ్వటం మా అందరికీ ఆనందాన్నిచ్చే చారిత్రాత్మక విశేషం! – అంజలీదేవి

ప్రింటు బుక్ లభ్యం

 

 

Posted in 2015, కొత్త పుస్తకాలు, ఫిబ్రవరి and tagged , , , , , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.