palaparthi cover

5 కొవ్వొత్తి అత్తే పెత్తాలి!

ఆ రోజు పాప పుట్టిన రోజు.

కేక్ తీసుకుని వచ్చారు.

ఇల్లంతా బెలూన్లు కట్టారు.

స్నేహితులని పిలిచారు.

పాపకి కొత్త గౌను తొడిగారు.

పాప చాలా సంతోషంగా ఉంది.

అంటే హాపీ అన్న మాట.

కేక్ మీద అయిదు ఆకారంలో ఉన్న  కొవ్వొత్తిని వెలిగించి పెట్టారు.

స్నేహితులందరూ చూస్తుండగా

అమ్మా నాన్నా పక్కన నిలబడి ఉండగా

పాప కొవ్వొత్తి  ఊది

కేక్ కోసింది.

తరువాత

అమ్మ వైపు తిరిగి

అమ్మా!

కొవ్వొత్తి తీసి అత్తే పెత్తు.

నీకు గానీ నాన్నకి గానీ

5 ఇయర్స్ వస్తాయి కదా!

అప్పుడు బడ్డే  కేక్ మీద  పెత్తి  ఉదొచ్చు.

సరేనా?

అంది.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, ఫిబ్రవరి, సీరియల్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.