cover

విందు

జిలుగు

చీరంచు​న

​వాలనీ

కలకల

​నవ్వులని

 

అద్దుకోనీ

బుగ్గలని

మోహాల

లేపనాలని

 

మసక దీపాల

వెలుగుని

దొంగిలించనీ

చూపుల

కౌగిలింతని

 

వగలు పోనీ

చెవి లోలాకులని

 

kinige copyపాటల చెలమల్లో

తడవనీ కాళ్ళని

హొయలు పోనీ

వేళ్ళని

ఆడనీ

ఇరుసుని

నడుముని

 

షాండ్లియార్

చిరు గోళాల

చిత్ర కాంతుల్లో

తలకెక్కనీ

జీవన మధువుని

 

ఇంకా

ఇంకా

 

చుక్కా

చుక్కా.

– ఇంద్రాణి పాలపర్తి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, కవిత, ఫిబ్రవరి and tagged , , , , .