cover

అన్నీ గాడిదలే!

అమ్మ అప్పుడే ఇల్లంతా సర్ది వెళ్ళింది.

మళ్ళీ వచ్చి చూసే సరికి

ఏముందీ,

ఇల్లంతా

చిందరవందరగా బొమ్మలు

కాగితం ముక్కలు

రంగు చుక్కలు

సోఫా నిండా బొమ్మల పుస్తకాలు

వాటిల్లో కొన్ని పేజీలు

సగం సగం

చించి.

పిచ్చి కోపం వచ్చింది అమ్మకు.

పిచ్చి గాడిదా!

ఏమిటీ అల్లరి? బుద్ధి లేదూ?

అని అరిచి

మళ్ళీ శుభ్రం చేయడం మొదలు పెట్టింది.

పాప కొంచెం సేపు మాట్లాడకుండా పక్కన కూచుని అమ్మని చూస్తూ ఉంది.

ఆ తర్వాత,

పిచ్చి గాడిదా అంతే ఏంతమ్మా?

అంది.

అమ్మకి కోపం పోయి నవ్వు వచ్చింది.

అంటే Mad Donkey అంది.

ఓ! Mad Donkey?

Mad Donkey ఎందుకన్నావు నన్ను?

నేను Good Donkey!

తెలీదా? అంది.

చేస్తున్న పని ఆపేసి

సోఫాలో కూలబడి

విరగబడి నవ్వింది అమ్మ.

హ హ్హ  హా  !

సరేలే !

నువ్వు మంచి గాడిదవేలే!

అని

పాపని ఒళ్ళో కూచోబెట్టుకుని

ముద్దు పెట్టింది.

పాప మొహం వెలిగిపోయింది.

తన రెండు అర చేతుల్ని

అమ్మ బుగ్గల మీద పెట్టి

అమ్మా!

నేనేమో

బేబీ గాడిదని!

నువ్వేమో అమ్మ గాడిదవి.

నాన్నేమో నాన్న గాడిద.

మనం

హాపీ గాడిద ఫామిలీ!

కదమ్మా?

అంది.

 *

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, ఫిబ్రవరి, సీరియల్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.