palaparthi cover

అందుకేనా నగలు?

తన నగల పెట్టె బయటకు తీసింది అమ్మ.

ముత్యాల హారం.

తెల్ల రాళ్ళ హారం.

పచ్చలు, కెంపులు కలిపిన హారం.

అచ్చంగా బంగారంతో చేసిన హారం.

వాటికి అమరే చెవి దిద్దులు.

సాదావి

తీగెలు, లతలు ఉన్న బంగారు గాజులు.

వాళ్ళ నాన్న గారు చేయించినవి.

మెట్టింటి వాళ్ళు పెట్టినవి.

తను కొనుక్కున్నవి.

చాలా కాలం అయింది వాటి అతీ గతీ చూసి.

రోజూ సాదా గాజులే వేసుకుంటుంది.

సన్నటి గొలుసే పెట్టుకుంటుంది మెడలో.

ఇప్పుడు ఒక్కోటీ తీసి పెట్టుకు చూసుకుంటోంది అద్దంలో.

పాప పక్కన్నే కూచుని చూస్తోంది అమ్మని.

మధ్యలో  ఓ మాటు ముట్టుకోబోతే కోప్పడింది అమ్మ.

నేనూ పెత్తుకుంతా !

అంది వాటి వంక చూస్తూ.

ఇవి చాలా ఖరీదైనవి నాన్నా.

ముట్టుకోకూడదు.

ఇప్పుడు చిన్న పాపవి కదా నువ్వు.

పెద్దయ్యాక ఈ నగలన్నీ నీకేరా.

అప్పుడన్నీ పెట్టుకుందూగానీ.

సరేనా!

అంది అమ్మ అద్దంలో చూసుకుంటూ.

ఎందుకిస్తావు నీ నగలూ?

నీ కప్పులో పుత్తాననా?

అంది పాప

వేలితో అమ్మ పొట్టని నొక్కుతూ.

అమ్మ హారం పెట్టుకోడం మానేసి పాప వంక చూసింది.

 *

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, ఫిబ్రవరి, సీరియల్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.