bhavaniphani cover

ఓ ‘కొమ్మ’ కథ

నల్లని నవరత్నాల్ని పొదువుకున్న

కేశాల కిరీటం కింద

మచ్చలన్నీమాపుకుని

మెరుస్తోన్న చంద్రబింబం

ఆ నుదురు

 

నిప్పుల స్వప్నాల్లో పడి

కాలిపోయిన

నిదుర తోటల వెనుక

చీకటి రంగులో వెలిగేవి

అవి కనుపాపలు

 

కన్నీటి మబ్బుల్తో గడ్డకట్టిన

కళ్ళ అంచుల అడుగున

బిడియాలు పండక

బీడు పట్టిన తెల్లని మైదానాలు

అవిగో అవి  చెంపలు

 

నవ్వుల మకరందం మొత్తం తాగేసి

ఎర్రబడ్డ సీతాకోక చిలుక

ఎటో ఎగిరెళ్ళిపోతే

ముడుచుకుపోయిన మందారాలు

అవే ఆ పెదవులు

 

పిడి విరిగిన కోటేరు చందాన

కొన్ని గీతలేవో చెరిగిపోయినా

సౌందర్యాన్ని సాగు చేయగల

సొగసుల సంపెంగ

అది ఆ నాసిక

 

మరి ఇంకా, మనసుతో ఉయ్యాలలూగి

తన శరీరాన్ని చెక్కుకు తిన్న

పిశాచ పక్షుల ఉరితీత కోసం

వేళ్ళాడే ఆ బలమైన కొమ్మలు మాత్రం

అవి చెవి కమ్మలు

- భవానీ ఫణి

(ఒక బొమ్మ ఇచ్చి దానికి కవిత రాయమని కోరగా వచ్చిన కవితల్లో ఎంపికైన కవిత ఇది. మరొకటి ఇక్కడ.)

Download PDF EPUB MOBI

Posted in 2015, కవిత, మార్చి and tagged , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.