bhagavantham cover

శబ్దాలంకారం

మాటల్ని ఎలాగూ

చెవికెక్కించుకోవు

పాటనైనా చెవిని ఆలకించనివ్వు

ఎందుకంటే –

లోకంలో స్త్రీ, సంగీతం లేకపోతే

ఉరేసుకుని వెళ్ళిపోవాల్సిన

దుస్థితి కొందరి పురుషులది

***

పాటని కాకపోయినా

పాట అవతలి

నిశ్శబ్దాన్నైనా

చెవిని ఆహ్వానించనివ్వు.

ఎందుకంటే –

స్త్రీ తిరస్కరించిన లోకంలో

కొందరు పురుషుల్ని బతికించే సంగీతం

ఆ నిశ్శబ్దమే.

(వహీకి… నిన్నే వినిపిస్తోందా?)

- భగవంతం

(ఒక బొమ్మ ఇచ్చి దానికి కవిత రాయమని కోరగా వచ్చిన కవితల్లో ఎంపికైన కవిత ఇది. మరొకటి ఇక్కడ.)

Download PDF EPUB MOBI

Posted in 2015, కవిత, మార్చి and tagged , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.