cover

ఒక ఏకాంత వేళ!

నల్లని చాయంచున మెరుస్తున్న

సాయంసంధ్యా కాంతుల్లో

నీ నవ్వుల జలపాతం

జాలువారుతుంటుంది..!

 

ఇంటి పిట్టగోడపై వాలిన

పావురాల రెక్కల చప్పుడులో

నీ మాటల సవ్వడి

సందడి చేస్తుంటుంది..!

 

ఊరి చివర కాలువ గట్టున

చెంగున దూకే

చిన్నారుల కేరింతల్లో

నీ ఉత్సాహం పలకరిస్తుంటుంది..!

 

చెట్టు కొమ్మన చివురు మేస్తున్న

కోయిలల కుహు కుహులలో

నీ మమకార మాధుర్యం

పల్లవిస్తుంటుంది..!

 

విభావరి వేళ వినీలాకాశంలో

విస్తరిస్తున్న వెన్నెల వాహినిలో

నా మది నెమ్మదిగా

నీ నెనరును నెమరువేస్తుంటుంది..!

 

కాలం కడలిలో వడివడిగా

కొట్టుకుపోతున్న నా జీవితాన్ని

నీ జ్ఞాపక జలతారు

ఆర్తిగా తాకుతుంటుంది..!

 

– రామదుర్గం మధుసూదన రావు

మొబైల్ నం: 9912199557

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కవిత, మార్చి and tagged , , , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.