cover

డర్టీ కథ

Download PDF EPUB MOBI

రెండ్రోజులుగా మెసేజ్ లేదూ, అప్‌డేట్ లేదూ? ఏమైపోయావ్?

ఎదురు చూశావా?

భయపడ్డా… అన్‌ఫ్రెండ్ చేశావేమో అని!

ఎందుకు చేస్తాను?

కోపమొచ్చిందేమో అనుకున్నా

నా హస్బెండ్‌వా కోప్పడ్డానికి?

మొన్న డర్టీ డర్టీగా మాట్లాడాగా?

నేనూ మాట్లాడానుగా!

నీకు నచ్చలేదేమో అనుకున్నా

డర్టీ మగాళ్ళే ఎంజాయ్ చేస్తారు గాని ఆడాళ్ళు చేయరా?

అయితే నచ్చిందన్నమాట!

ఏదో కొత్తగా అనిపించింది.

ఇంతకన్నా పచ్చిగా ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలే మాట్లాడుతున్నారు.

నా హస్బెండ్ ఇలా ఎప్పుడు మాట్లాడలేదు… ఆ… టైంలో కూడా

వాడికి, సారీ మీ ఆయనకి వైఫ్‌ని ఎలా సాటిసిఫై చెయాలో తెలియదు

నీ వైఫ్ చాలా లక్కీ అయితే

నా వైఫ్‌కి అలాంటివి ఎంజాయ్ చేయడం తెలియదు

నువ్వు ట్రై చేశావా?

నీలా తను ఓపెన్ మైండెడ్ కాదు

నీలానే నా హస్బెండ్ కూడా నన్నూ ఒపెన్ మైండెడ్ కాదనుకొవచ్చుగా?

మీది లవ్ మ్యారేజ్ అన్నావ్? నీకేం కావాలో ఆ మాత్రం తెలియకపోతే వాడో ఫూల్

మమ్‌మ్…?

ఎక్కడున్నావ్, ఆఫీస్‌లోనేనా?

ఒంట్లో బాలేదు, ఇంట్లోనే ఉన్నా

ఎనీథింగ్ సీరియస్?

నథింగ్… రాత్రి సరిగా నిద్ర లేదు

ఏం? నా గురించి ఆలోచించావా?

అవును…

ఆర్ యూ కిడింగ్?

సీరియస్‌లీ, ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ ఓల్ నైట్

సిగ్గులేదూ… హస్బెండ్ పక్కన పడుకోని నా గురించి ఆలోచించడానికి

నీకూ సిగ్గులేదా? నువ్వూ నా గురించి ఆలోచిస్తున్నావుగా నీ వైఫ్ పక్కన పడుకొని

నాకు లేదు… నా గురించి ఏమాలోచించావు?

నిన్ను ఎలా సర్‌ప్రైజ్ చేద్దామాని…

ముందు నన్ను ఛీట్ చేయడం ఆపేయ్ డీయర్

నేనేం ఛీట్ చేస్తున్నా డార్లింగ్

నువ్వు నన్ను చూశావా?

ఎఫ్‌బిలో రోజుకో ప్రోఫైల్ పిక్ మార్చుతావుగా, చూడకుండా ఉంటానా?

నా గురించి మొత్తం తెలుసా?

నువ్వుంచిన ఫ్రోఫైల్ డీటైల్సూ, నీ స్టేటస్ అప్‍డేట్స్‌తో ఎంతో కొంత తెలుసనుకుంటున్నా

నా ఫ్యామిలీ గురించి…?

నీ వైఫ్ పిక్స్ కూడా చూశా… షి లుక్స్ గుడ్. మీ పిల్లలైతే భలే ముద్దుగా ఉన్నారు

మరి నీ గురించి నాకేం తెలుసు?

ఏం తెలుసు చెప్పు?

ప్లీజ్ డోంట్ టీజ్ మీ!

ఒకే… సారీ. యా! వాట్ డు యూ వాంట్ టు నో అబౌట్ మి?

హూ ఆర్ యూ?

ఎమ్ ఏ బ్యూటిఫుల్ వుమెన్!

ఐ నో దట్!

హౌ డిడ్ యూ నో దట్?

ప్లీజ్, జోక్స్ అపార్ట్. కనీసం నీ ఫోటో కూడా చూళ్లేదు, అప్‌లోడ్ ఇట్.

నా ఫోటో చూశాక నీకు నచ్చకపోతే

ఇప్పుడే ప్రౌడ్‌గా చెప్పావుగా ఎమ్ ఏ బ్యూటిఫుల్ వుమెన్ అని

నువ్వే అన్నావుగా అది జోక్ అని

గాడ్ ప్రామిస్… నిన్ను చూడాలని చాలా ఎగ్జైటింగా ఉంది

అప్పుడే! మనం పరిచయమై ఒన్ వీక్ కూడా కాలా

ఈరోజుకి ఎగ్జాట్లీ ఒన్ వీక్… బట్ అయామ్ ఫీలింగ్ లైక్ వి హావ్ బీన్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ సిన్స్ ఈయర్స్

నన్ను చూడకుండానే! కనీసం నాతో ఫ్లోన్లోనైనా మాట్లాడకుండానే?

ఎమో!

అంతగా నాలో ఏం నచ్చింది?

సమ్‌థింగ్ ఇన్ యూ

డర్టీ ఎంజాయ్ చేయడమా?

నాట్ ఎగ్జాట్లీ..

మరి?

ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్

నేను చెప్పనా?

ప్లీజ్..

నీ వైఫ్ అంటే బోర్ కొట్టి నాపై మోజు పెంచుకుంటున్నావు

నీకూ నీ హస్బెండ్ అంటే బోర్ కొట్టిందా?

మమ్‌మ్.. చెప్పలేను

మరి నా పైన ఇంట్రెస్ట్ ఎందుకు?

ఇదీ చెప్పలేను

నేను చెప్తాను, మాటల్లో చెప్పలేని మంత్రమేదో మనల్ని కలుపుతోంది

అంత ఎమోషనల్ డైలాగ్స్ ఒద్దు, నీక్కావాలసిందేంటో నీకూ తెలుసు నాకూ తెలుసు

యస్ అదే అనుకో..

అదే అయితే నా కన్నా నీ వైఫే అందంగా ఉంటుంది, నువ్వు చాలా డిసాప్పాయింట్ అవుతావు మరి.

నల్లగా, పొట్టిగా చేటంత మొహంతో… మగాళ్ళు పారిపోయేలా ఉంటావా?

గొంతు కూడా మగాళ్ళదే

ఓఎమ్‌జీ… నువ్వు గే కాదుగా

హాహాహా… సో వాట్, నౌ ఇట్స్ లీగల్

డోంట్ స్కేర్ మీ ప్లీజ్

హాహాహా… ఐ కాంట్ స్టాప్ లాఫింగ్

ప్లీజ్ స్టాప్ ఇట్… ఈ మధ్య గే లు మగాళ్ళని ఇలానే ట్రాప్ చేస్తున్నారు

అదీ ఒకసారి ట్రై చేయ్.. నీక్కావాలసింది వైరైటీయేగా

సారీ బేబ్… ఐమ్ ఏ మాన్ యూ నో!

రియల్లీ..??

ఐ విల్ షో యూ ఒన్ డే

లెట్స్ సీ..

నీ మొబైల్ నంబరైనా ఇవ్వు, నీ గొంతు వింటే నా టెన్షన్ తగ్గుతుంది

డోంట్ వర్రీ, యూ ఆర్ ఛాటింగ్ విత్ ఎ పర్‌ఫెక్ట్ వుమెన్

పక్కా?

100%

ఎట్‍లీస్ట్ నీ కలర్, హైట్, వెయిట్ డీటైల్సైనా చెప్పు

కలర్ ఫెయిర్, హైట్ 5.4 ఇంచెస్, వెయిట్ 55 కేజెస్

వావ్, పర్‌ఫెక్ట్ ఫిగర్

నీ వైఫ్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందేమో?

నాట్ ఎట్ ఆల్! మిగితా కొలతలు కూడా చెప్పూ

చెప్తే నా పొట్రైట్ గీసి పంపిస్తావా?

గుండెల్లో దాచుకుంటా!

ఔడేటెడ్ డైలాగ్

కొత్త డైలాగ్స్ కనిపెట్టడానికి నేనేం సినిమా రైటర్‌ని కాదు

ఇది పాతదే…

ఒకే ఒప్పుకుంటా.. మిగతా కొలతలూ??

దాని కన్నా ముందో కన్ఫ్యూజన్…

ఏంటి?

వేర్ ఇట్ గోస్…

వాట్?

అవర్ రిలేషన్‌షిప్

వాడ్డూయూ థింక్?

కొద్ది రోజులకి నువ్వు నీ ఫేమిలీని, నేను నా హస్బెండ్‌నీ పిల్లల్నీ వదిలేసి లేచిపోతామా?

నెవర్!

మరి?

హాలిడే ట్రిప్‌కి గోవా వెళ్ళినంత మాత్రానా గోవానే మన ఇల్లు కాదుగా!

ఇల్లు ఫేమిలీ కోసం, గోవా మన కోసం… అంతేనా?

యూ ఆర్ స్మార్ట్

ఆయామ్ సెక్సీ టూ

ఐ కాంట్ వెయిట్.. ఇంకా ఎన్ని రోజులు ఈ హైడ్ అండ్ సీక్ గేమ్?

నేనూ దీనికి పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా

గ్రేట్.. ఎప్పుడు?

ఈ రోజుతోనే

వావ్.. నీ పిక్ పంపిస్తున్నావా? మోబైల్ నంబర్ ఇస్తున్నావా?

సర్‌ప్రైజ్ చేస్తా అని చెప్పాగా…

డైరెక్ట్‌గా నా ముందుకొచ్చి షాకిస్తావా?

అప్పుడు నిజంగానే గుండె ఆగి చస్తావు

అదీ హాపీయే, కనీసం చచ్చే ముందైనా నిన్ను చూస్తా

ఇలాంటి డైలాగ్స్‌తో ఏ అమ్మాయినీ ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకు

ఒకే…. ఏంటా సర్‌ప్రైజ్

ఫస్ట్ నా హస్బెండ్ పిక్ పంపిస్తా

స్పామ్‌లా వాడి పిక్ ఎందుకు?

నా హస్బెండ్ ఎవరో తెలిస్తే నా ఫోటో పంపించనక్కర్లేదు

ఆర్ యూ ష్యూర్

ఐ కెన్ అష్యూర్ యూ

దట్ మీన్స్.. ఓ ఫేమస్ ఫిగర్ వైఫ్.. లేదంటే నాకూ తెలిసినోడి పెళ్ళాం… నేనంటే పడి చస్తుందా!!!

ఎస్

ఇట్స్ రియల్లీ థ్రిల్స్ మీ!

మే బి!

ఐ కాంట్ బిలివ్ ఇట్!!!

యూ హావ్ టు…

ఓకే..

ఆర్ యూ రెడీ ఫర్ సమ్ ఫన్?

ఐ విల్ హోల్డ్ మై బ్రెత్

1.. 2.. 3.. గో.. హియర్ ఇట్ ఈజ్

లుక్… జస్ట్ ఐ హావ్ సెంట్

గాట్ ఇట్?

ఈజ్ ఇట్ సర్‌ప్రైజింగ్ ఆర్ షాకింగ్??

నో వర్డ్స్?

నా హస్బెండు కూడా అచ్చూ నీలానే ఉన్నాడు కదా! అదే కలర్, అదే హైట్, అదే వెయిట్, అదే మొహం.. బాగా చూడు!

ఏంటో మీ మగాళ్ళంతా ఒకేలా కనిపిస్తారు! కాని ఎప్పుడూ ఒకేలా ఉండరు.

టేక్ కేర్

గుడ్ బై!

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కథ, మార్చి and tagged , , , , , , .

9 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.