COVER

ఈ జీవితాలు

ఏ జ్ఞాన యోగాలు?

ఏ కామ కేళికలు?

ఏ దిగుడు కోరికలు?

ఏ చదువు సారాలు?

ఏ జీవితాలు?

 

ఆ  వెకిలి రొదలు

ఈ మకిలి పొగలు

ఆ  కూలి రాతలు

ఈ నోటు రోతలు

ఈ జీవితాలు?

 

ఆ గంగా  విహారాలు

ఈ మురికి విలాపాలు

ఆ దగ్గుల పుస్తకాలు

ఈ బొగ్గుల మస్తకాలు

ఈ జీవితాలు?

 

ఆ చీకటి జతలు

ఈ వాకిటి వెతలు

ఆ పందిరి గుంజలు

ఈ నంగిరి రంగులు

ఈ జీవితాలు?

 

ఆ కిటకిటలాటలు

ఈ  చేదు పాటలు

ఆ కమురు మాటలు

ఈ ఆకలి ఊటలు

ఈ జీవితాలు?

 

ఏ జ్ఞాన యోగాలు?

ఏ కామ కేళికలు?

ఏ దిగుడు కోరికలు?

ఏ చదువు సారాలు?

ఏ జీవితాలు?

 

– ఇంద్రాణి పాలపర్తి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కవిత, మార్చి and tagged , , , , .

2 Comments

  1. “కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం, మరియు భక్తియోగం అనునవి నాలుగు యోగాలు. భక్తియోగం జీవునికి, భగవంతునికి ఉండే సంబంధ బాంధవ్యాలను గురించి చర్చిస్తుంది. ఇది భగవదనుగ్రహానికి దారితీస్తుంది. రాజయోగం జీవునికి శక్తి స్వరూపమైన ప్రకృతికి సంబంధించినది. ఇది విధి అనుకూలతకు, తద్వారా ఐహిక శక్తికి మరియు ఐహిక ఔన్నత్యానికి దారితీస్తుంది. జ్ఞానయోగం దైవంతోగానీ, విధితోగానీ సంబంధంలేనిది. జీవుని యొక్క శ్రద్ధ మరియు జిజ్ఞాసుత్వానికి సంబంధించినది. ఇది జీవునికే పరిమితమైనది. ఇది జ్ఞానానికి దారితీస్తుంది.

    మానవుడు ఈ లోకంలోని గుణకర్మల యెడల వ్యామోహం చెందకుండా, తనకు అవసరంలేని ప్రాపంచిక ఆకర్షణల యెడల వైరాగ్యం కలిగి, ఈ లోకంలో నిత్యమైనదేదో, అనిత్యమైనదేదో తెలుసుకుని, తన జీవితాన్ని వ్యర్ధ కార్యకలాపాలలో వృధా చేయకుండా సత్యస్వరూపమైన తన జీవన లక్ష్యం ఏదో నిర్దేశించుకుని, తత్సాధన కొరకు సత్యాన్వేషణ చేసేది జ్ఞానయోగం.” ( http://shankharavam.blogspot.in/2009/02/i.html ).

    కవితతో అంతగా సంబంధంలేని వాక్యాలు ఉటంకిస్తున్నందుకు, గంగా విహారాలంటే త్రిపురే గుర్తుకొస్తాడనుకోవటాన్ని రచయిత్రి మన్నిస్తారని ఆశిస్తూ, మంచి కవితనిచ్చినందుకు అభినందిస్తూ

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.