palaparthi cover

ఇంకా గుర్తున్నాయే?

అమ్మ పాపని ఒళ్ళో కూచోబెట్టుకుని కబుర్లాడుతోంది.

పాపా, చిన్నప్పుడు ఫోర్క్ ని చూసి ఏమన్నావో తెలుసా?

ఊహూ…

అమ్మా, ఫోర్క్ కి గోళ్ళు పెరిగాయి.

కట్ చేస్తావా? అని అడిగావు!

అతల అడిగానా!

హ హ హ..

నవ్వింది పాప.

చిన్నప్పుడు అరటి పండు తెచ్చి

అమ్మా, బనానా తోకలు తీసి ఇవ్వు అన్నావు!

తోకలా? అంటే Tails?

Monkey tails?

హ హ్హ హా

అవును రా!

తొక్క అనాలని చెబితే తోక అనే దానివి.

హ హ్హ హా..

ఒక రోజు ఏమన్నావో తెలుసా?

అమ్మా, నన్నెప్పుడూ

కూత్ లితిల్ బేబీ

అని పిలు అన్నావు!

హ హ్హ హా

హ హ్హ హా

నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వింది పాప.

ఓసారేమో పాపకి బాగా జలుబు చేసింది.

అమ్మ పాప ముక్కు తుడిచి తుడిచి

పాప ముక్కు ఎర్రగా అయిపోయింది.

నెప్పి చేసింది.

Red గానా?

అవును! చాలా రెడ్ గా!

అప్పుడు నువ్వు ఏమన్నావో తెలుసా?

తల అడ్డంగా ఊపింది పాప.

అమ్మా,

ముక్కు తీసి

కీన్ అప్ చేసి

మళ్ళీ పెట్టుకుంటే?

అన్నావు.

ముక్కు తీసి మల్లీనా?

హ హ్హ హ్హా

అంతే ఇతలనా? అని

యాక్షన్ చేసి చూపించింది.

చూపిస్తూ చూపిస్తూ

పొట్ట పట్టుకుని నవ్వేస్తోంది.

అమ్మ కూడా శృతి కలిపి నవ్వుతోంది.

నవ్వడం అయిపోయాక

అమ్మా, నీకు ఇంకా అన్నీ గుర్తున్నాయే?

అంది పాప

అమ్మ బుగ్గల మీద అరి చేతులు ఆన్చి.

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.

 

Posted in 2015, చిట్టి చిట్టి మిరియాలు, మార్చి, సీరియల్ and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.