cover2

గీత

గీతలన్నీ

నీటి రాతలని

మిడిసిన

భ్రమిసిన

యవ్వనాలలో

 

పెనుగాలుల్లో

జడి వానల్లో

ప్రయాణమై నే

 

వడి వరదల్లో

పడి బురదల్లో

చిక్కుకుపోతే

 

నమ్మిన నౌకలో

చోటు లేదని

వేడి అన్నము

నాకు కాదని

ప్రేమ వడ్డన

అసలు లేదని

 

ముందుకు పోతే

ముళ్ళూ రాళ్ళూ

పేళ్లూ తగిలి

 

చలీ ఆకలి

జ్వరము

పడిసెము

కాళ రాత్రులు

కవుకు దెబ్బలు

కలవరింతలు

వణికిస్తేను

భయపెడితేను

 

గాయాలన్నీ

లోపట దాచి

రెక్కలు ముడిచి

నే దాక్కుని పోతే

గీత వెనకాతల

 

వినిపిస్తూంది

ఇప్పటికీని

గీత అవతల

ఝంఝ ఘోష

 

మాడ్చే ఎండల

ఉక్క పోతల

చెమట ధారల

గీత లోపల

తీరని దప్పిక

తీరదు దప్పిక.

– ఇంద్రాణి పాలపర్తి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, కవిత and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.