cover

నీ నవ్వు..!

నిశ్శబ్దం పరిచిన నీడలో

నా ఉనికి మాయమవుతున్న వేళ

నాలోని నిన్ను చూపిన దివిటీ… నీ నవ్వు!

 

కలలు కొడిగట్టిన కళ్ళల్లో

కన్నీటి బిందువు ఇంకుతున్న వేళ

సంతోష సింధువై ప్రవహించింది… నీ నవ్వు!

 

ఏకాంత శిలువను మోస్తూ

వాసంత వాసాన్ని మనసు వీడుతున్నవేళ

ప్రశాంత పవనంలా నిమిరింది… నీ నవ్వు!

 

వేకువ కలువల్లా… వెన్నెల తరగల్లా

రవళించిన భాషలా… రేపటి ఆశలా

బతుకుకు ఓ భరోసాలా… బతికించే శ్వాసలా… నీ నవ్వు!

– రామదుర్గం మధుసూదనరావు

మొబైల్ నం: 9912199557

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, కవిత and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.