cover

కంటిని ఈ కంటను కంటిని సీతను

Download PDF  EPUB  MOBI

రాగం: వసంత
ఆదితాళం
తమిళ మూలం: అరుణాచల కవిరాయరు
తెలుగు: కనక ప్రసాద్
గానం: శ్రీవిద్య బదరీనారాయణన్

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

| పల్లవి |

కంటిని ఈ కంటను కంటిని సీతను

కంటినీ రాఘవా

 

| అనుపల్లవి |

ఎవ్వరు చొరరాని లంకా పుర వని

అరవింద నయనను ఆక్రంద వదనను      | కంటిని |

 

| చరణం |

కావి చీర కట్టుకొని కావిరి కనులఁగొని

మోవిఁ యేవేళ మీ తిరునామమె గొనీ

 

నీవూ వినా ఈ బ్రదుకు మననేమిటనీ

ఏమని చెప్పుదు అమ్మ వగ ప్రాణ రమణా!

 

ఈవిరి చూపుల ఇట్టునట్టు తట్టుకొని

ఎంతో ఎదజెంది చింతాక్రాంత రామా

 

రక్కసి మూకల వెక్కసి చెర జిక్కి

ఆపన్నయై యున్న ఆ పావని వేదన      | కంటిని |

Download PDF  EPUB  MOBI

Posted in 2015, మే, స్వరం and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.