cover

కినిగె పత్రిక కు విరామం

ఇప్పటిదాకా చదువరుల ఆదరణతో విజయవంతంగా సాగిన కినిగె పత్రికకు ఈ నెల నుంచి విరామం ప్రకటిస్తున్నాం. పత్రిక మొదలుపెట్టినపుడు “కినిగె.కామ్”కు అనుబంధంగా, సాయంగా ఉంటుందనే ఉద్దేశంతోనే మొదలుపెట్టినా త్వరలోనే దీని పరిధి విస్తరించింది. ఎంతో అవకాశం ఉన్న వెబ్ స్పేస్‍ను వీలైనంత వినియోగించుకుని మంచి సాహిత్యాన్ని అందించగలిగింది. పత్రికలో అంశాలతో పాటు, వాటిని ప్రెజెంట్ చేయటంలోని కొత్తదనం దీని ఆకర్షణ పెంచింది. ఈ ఏడాదిన్నర స్వల్ప ప్రయాణంలోనే ఇది భిన్న స్వరాలకు, అమూల్యమైన అంతరంగాలకు తగిన వేదికగా నిలబడగలిగింది. ఎందరో అభిమానంతో రచనలు పంపి ప్రోత్సహించారు. కొత్తవారు తమ రచనలతో దీనికో కొత్తదనాన్నిచ్చారు. ఇంకెందరో తెర వెనుక సూచనలతో మార్గం నిర్దేశం చేశారు. వారందరికీ ధన్యవాదాలు. పత్రికలో కంటెంట్ అంతా ఇక్కడే అందుబాటులోనే ఉంటుంది. మంచి రోజులొస్తే మరో మారు మీ ఆదరణను ఆశిస్తూ మీ ముందుకొస్తామన్న నమ్మకంతో ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాము.

Posted in 2015, మే and tagged , .