03

గాలి నాసరరెడ్డి హైకూలు

Download PDF   ePub    MOBI

.

01

వాన వెలిసిన ఉదయం –

పువ్వు పువ్వుపై వాలుతూ

సీతాకోకచిలుక

 

.02

పొద్దుటి పొగమంచు –

ఒడిలో కుందేలు పిల్లతో

చిన్నారి పాప

.

03

వేకువ చల్లదనం –

నిశ్శబ్దంగా

రైస్ మిల్లు

 

.04

పండ్లతో మామిడితోట –

ఎర్రగా మెరుస్తోంది

దిష్టిబొమ్మ శిశ్నాగ్రం

 .

05

దీర్ఘరాత్రి –

ఇంకా జీవించి వున్నాను

పాడు గులాం అలీ! పాడు

 

– గాలి నాసరరెడ్డి

Download PDF   ePub    MOBI

Posted in 2014, కవిత, జనవరి and tagged , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.