నాం నాం

నాం నాం

Download PDF   ePub   MOBI

పిల్లకాయలం మేం

మా బొగ్గులీధిలోం

వానలంట గంతల్లో పడవలాడున్నాం

వాగి వాగి గుంతల్లో గొడవలాడున్నాం

 

శిక్షాబియాన్ కన్

రిక్షాలు కట్టించుకున్

హిందీ భాషా యిశారద్ ఇరగరాసున్నాం

ఇంకులు కారేలాగ పెన్నులు అరగదీసున్నాం

 

తెల్లారుఝాం మొదల్

పల్లేరు కళ్ళిప్పుకోన్

ఆల్జీబ్రా జామింట్రీ ఆవలించున్నాం

అంత లావు పుస్తకాల్ని కావిలించున్నాంnaam naam jpeg

 

నేల టికట్లనే కొన్

బాల్కనీల్లోనికే చన్

గేటుకాడ దొంగమొహం చాటు చేసున్నాం

ఓటు హక్కు లేకుండానే ఓట్లు వేసున్నాం

 

పచ్చకామెర్ల లోన్

ఉచ్చ రంగు భయాన్న్

పసరు మందు తాగలేక పారబోసుకున్నాం

పదోక్లాసు జిల్లా ఫస్టు జారదీసుకున్నాం

 

ఎంసెట్ ర్యాంక్ కొరక్

జమ్షెడ్‌పూర్ వరుక్

ఎగనా గైడూ దిగనా గైడూ రుబ్బి పెట్టున్నాం

పగలూ రాత్రీ చదువేను వీడికని పేరు తెచ్చుకున్నాం

 

వీసాల కోసరం

వేషాల్స్ వేసుకున్

ఉన్ని కోటు లేని గోటు వెలగబెట్టున్నాం

ఉన్నదంతా ఊడ్చి ఊడ్చి కరగబెట్టున్నాం

 

కుల మత భేదాలు లేక్స్

కడు శాస్త్రీయ ధోరణుల్తోక్స్

కలవారి పిల్లల్ని మనవాళ్ళనే చూసి కట్టబెట్టున్నాం

నలుగుర్లోనూ తగుమనుషులని పేరు అట్టేపెట్టున్నాం

 

పార్సిప్పనీలో ఒకడ్

ఝార్సుగుడాలో ఒకడ్

చెట్టుకొకడు పుట్టకొకడూ చెదరగొట్టున్నాం

పట్ట బుర్ర బోర బొజ్జ కుదరఁగట్టున్నాం

 

ఆ పిల్లకాయలం. . . ?

ఈ వీధి బొగ్గుల్లోం!

 

– కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI

Posted in 2014, కవిత, జనవరి and tagged , , , .

3 Comments

  1. కనక ప్రసాద్ గారి రాతల మీదున్న ఆసక్తితో రెండు మూడు సార్లు చదివినా నాకర్థంకాలేదు ఈ కవితలో ఏముందోనని :-(

  2. కవులు స్వఛ్చందంగా పూనుకుని ఏదొ ఒకటి చెయకపొతెఏ కవిత్వం బతకదు. ఆ ఏదో ఒకటి చేయటానికి మీరు మీదయిన పధ్ధతిలో

    పూనుకున్నట్టు అనిపిస్తుంది. Thanks….Carry On….-ఖాదర్ మొహియుద్దీన్

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.