softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [1]

Download PDF    ePub    MOBI
అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “రామ్॒@శృతి.కామ్” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. ఇవాళ్టితో ఇది వారం వారం సీరియలైజ్ కానుంది.  ఇది మొదటి భాగం.

డెబ్బై వేలు ఖరీదు చేసే కొత్త బండి మీద, డెబ్బై కిలోల బరువు ఉన్న అజయ్ ఆఫీసుకి బయలు దేరాడు. సాదారణంగా అజయ్ కోడి ఆరింటికి కాకుండా పదింటికి కూస్తూ ఉంటుంది. పదకొండు, పన్నెండు గంటల మధ్యలో ఆఫీసుకి రావటం, ఏ అర్ధరాత్రి దాటాకనో ఇంటికి చేరటం అజయ్ కి మామూలే.

అజయ్ , హార్డ్ వర్క్ చేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కాలుష్యంతో నిండిన హైదరాబాదులో కల్మషం లేని మనస్సుతో ఉద్యోగం చేస్తున్నాడు. వారంలో ఐదు రోజులు నరకంలో మిగిలిన రెండు రోజులు నిద్రలో గడుపుతూ ఉంటాడు. పనిలోకి దిగితే ప్రపంచం ఏమైపోయినా, పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఉన్నా, పట్టించుకోనివ్వని పరిస్థితుల్లో పనిచేస్తుంటాడు. ఉదయం పది ఇంటినుంచి రాత్రి పన్నెండు దాక పనిచేయటం పరిపాటి.

మధ్యాహ్నం పన్నెండింటికల్లా తన కార్యాలయానికి చేరాడు. సింహద్వారం దగ్గర ఒక్కొక్క కారుని ఆపి, క్షుsoftware for uploadణ్ణంగా తనిఖీ చేసి కానీ లోపలికి పంపటం లేదు. అజయ్ తన బండిని ఆపి, తలకున్న శిరస్త్రాణాన్ని తీసి, తన గుర్తింపు బిళ్ళను భధ్రతా సిబ్బందికి చూపించి, లోపలికి బండిని పోనిచ్చాడు. ఈ సాఫ్ట్ వేర్ కార్యాలయాల్లో ఉద్యోగులకు ఉన్నంత రక్షణ / భద్రతా, ఉద్యోగాలకు ఉండదనేది సత్యం. దగ్గితే రాలిపోయే పళ్ళు లాంటివి ఈ ఉద్యోగాలన్నీ కూడాను. బండిని తాను రోజు ఉంచే చోటున పెట్టి, అద్దంలో చూసి, తల దువ్వి, ఒక చేత్తో ల్యాప్ టాప్ బ్యాగ్గుని, ఇంకో చేత్తో శిరస్త్రాణాన్ని పట్టుకొని, కార్యాలయం లిఫ్టు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎనిమిది అంతస్తుల భవనమది. అజయ్ పని చేసేది అన్నింటికన్నా పైన ఉన్న అంతస్తులో. ఆ కారణం చేత అజయ్ తన కింద కొన్ని వందల మంది పని చేస్తుంటారని ఎప్పుడూ ఆనందపడుతూ ఉంటాడు. లిఫ్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

అప్పటికే అక్కడ అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఇద్దరి చేతుల్లో చిన్న చాటలంత సెల్లు ఫోనులు ఉన్నాయి. ఇంకో చేతిలో గుర్తింపు బిళ్ళలు ఉన్నాయి. జీన్సు ఫ్యాంటు, టీషర్ట్ లో ఇద్దరు అమ్మాయిలూ తళతళలాడి పోతున్నారు. అజయ్ ఇద్దరినీ తేరిపారా చూశాడు. అజయ్ సరిగ్గా చూస్తున్నాడా లేదా అన్నట్టుగా ఆ అమ్మాయిలు కుడా అజయ్ వైపు చూశారు.

“I was very busy when you called me” అన్నది ఒక అమ్మాయి.

“oh sorry, I thought you were free. Where were you?” అడిగింది రెండో అమ్మాయి.

“I was at the theatre with Vimal”

“Oh! How was the movie?”

“Awesome yaar! A must watch movie, Amazing work by the cast & crew”

అంటూ ఇద్దరమ్మాయిలు ముద్దు ముద్దుగా ఇంగీషులో మాట్లాడుతుంటే అజయ్ వింటూ నిలబడ్డాడు. ఈ లోపు లిఫ్ట్ రానే వచ్చింది. అమ్మాయిలిద్దరూ లిఫ్టు లోకి వెళ్ళారు. అజయ్ వాళ్ళని అనుసరించాడు. వాళ్ళు వాడిన పెర్ఫ్యూమ్ వాసన లిఫ్ట్ అంతటా నిండిపోయింది. లిఫ్టు పైకి కదిలింది. అమ్మాయిలు మళ్ళీ మాట్లాడుకోవటం మొదలెట్టారు.

“Where was the theatre?”

“Been to Inorbit mall”

“Great that you guys got the tickets”

“Hmm, today I didn’t feel like coming to office, I hate coming to office on monday”

“కదా! నాకు కుడా” అని రెండో అమ్మాయి అనటంతో అజయ్ అవాక్కయ్యాడు. ఆ ఆశ్చర్యంలో ఉండగానే రెండో అమ్మాయి, “అవును మండే చాలా వర్క్ ఉంటుంది” అంటుండగా లిఫ్టు వాళ్ళు దిగాల్సిన అంతస్తు రావటంతో, లిఫ్టు తెరుచుకుంది. ఇద్దరూ మళ్ళీ ఆంగ్లంలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇందాకటి నుండి ఇద్దరూ ఇంగ్లీషులో ఇరగదీస్తుంటే, ఉత్తరం నుంచి వచ్చిన ఊర్వశులేమో అనుకున్న అజయ్ కి, వాళ్ళిద్దరూ తెలుగు అమ్మాయిలని తెలుసుకొని తేరుకొనే సరికి చాలా సేపే పట్టింది. “ఏంటో ఈ అమ్మాయిలు, మాట్లాడినా కానీ, మనమ్మాయిలో కాదో తెలుసుకోవటం కష్టంగా ఉందని మనస్సులో తిట్టుకున్నాడు అజయ్.

ఎనిమిదో అంతస్తులో ఉన్న భద్రతా అధికారికి తన గుర్తింపు బిళ్ళను మళ్ళీ చూపించాడు. అజయ్ బ్యాగును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి అజయ్ ని లోపలికి అనుమతించాడు. తెలిసినవాళ్ళంతా “గుడ్ ఆఫ్టర్ నూన్ అజయ్” అంటూ పలకరించారు. అజయ్ కుడా వాళ్లకి తిరిగి “గుడ్ ఆఫ్టర్ నూన్” చెప్తూ ముందుకు కదిలాడు. తను కూర్చుండే చోటికి చేరి, శిరస్త్రాణాన్ని, లాప్ టాప్ ను, తన బల్ల మీద సర్దుతూ ఉండగా, “గుడ్ ఆఫ్టర్ నూన్ అజయ్” అంటూ పలకరించాడు డాలర్ బాబు భరత్. “మనం మధ్యాహ్నం తినే భోజనంలో గుడ్డు ఉంటుంది తప్పితే, మన జీవితాలలో గుడ్డు ఎక్కడుంది డాలర్ బాబు” అని అజయ్ అసహనంతో అనటంతో భరత్ నవ్వి ఊరుకున్నాడు.

అజయ్ తన లాప్ టాపును మొదలుపెట్టే పనిలో ఉండగా తన ప్రక్కన కూర్చునే అమ్మాయి, “హాయ్ అజయ్, గుడ్ ఆఫ్టర్ నూన్” అని నవ్వుతూ పలకరించింది, ప్రియాంక సింగ్, పంజాబీ అమ్మాయి, అందమైనది, తెలివైనది, పెళ్లైనది. వారాంతం బాగానే గడిచిందని తన పనిలోకి దూరిపోయాడు. ఒక అరగంటకు డాలర్ బాబు వచ్చి, “తిందామా అజయ్” అని డాలర్ బాబు అడిగాడు. ఇద్దరు కలిసి తినటానికి అదే భవంతిలో ఉన్న భోజనశాలకు వెళ్ళారు.

“డాలర్ బాబు” డాక్టర్ ఫ్రీగా చూస్తాడని జబ్బులు తెచ్చుకొనే రకం. పేరులోని డాలర్ ని చూస్తేనే అర్ధం అవ్వాలి, బాబుకి అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సంభందం ఉందని. పావుగంట మాట్లాడితే అందులో పది నిముషాలు అమెరికా గురించే మాట్లాడుతుంటాడు. అలా అని చెప్పి మనోడు పుట్టి పెరిగింది అమెరికాలో కాదు. పని మీద వెళ్లి, అమెరికాలో పది వారాల పాటు అక్కడ ఉండి వచ్చాడు. అమెరికా వెళ్ళేదాకా ఒక్కింత బాగానే ఉండేవాడు. వెళ్లి వచ్చాక జనాలు భరించలేనంతగా మారాడు భరత్. ఇప్పుడు కొంత నయం కానీ, అమెరికా నుండి వచ్చిన కొత్తల్లో జనాలకు నరకం చూపించేవాడు.

Posted in 2014, జనవరి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

7 Comments

  1. Naga Muralidhar గారు, మీరు భరత్ ని సరిగా అర్ధం చేసుకున్నట్లు లేదు. :) అతను దోసెలు తింటున్నది ఇండియాలోనే. ఇస్తున్నది రూపాయలే. మాటలు మాత్రమే “డాలర్లలో”.

    అనంతరాం గారూ,
    ఒకపేరాలో “పదకొండు, పన్నెండు గంటల మధ్యలో ఆఫీసుకి రావటం, ఏ అర్ధరాత్రి దాటాకనో ఇంటికి చేరటం అజయ్ కి మామూలే.” అని చెప్పి సరిగ్గా ఆ తర్వాత పేరాలోనే “ఉదయం పది ఇంటినుంచి రాత్రి పన్నెండు దాక పనిచేయటం పరిపాటి.” అని రాస్తే నాలాంటి భూతద్దం పాఠకులకి కొంచెం మింగుడుపడదండీ. ఇలాంటివి ఇంకొన్ని వున్నాయి అక్కడక్కడా.. :)

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.