కినిగె పత్రిక్కి రాయండి - Kinige

రచయితలకు ఆహ్వానం:

Writing
కినిగె మాస పత్రిక మీ నుంచి సాదరంగా రచనలు ఆహ్వానిస్తోంది. మాకు ఏదో ఒక తరహా రచనల్నే ప్రోత్సహించాలనే ప్రణాళికలేవీ లేవు. మంచి రచనలేవైనా సమ్మతమే. ప్రతీ రచనకూ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని చురుకుగా, ధైర్యంగా, రసభరితంగా నెరవేర్చుకోగలిగింది ఏదైనా మంచి రచనే. ఇతివృత్తాలకు పరిమితులు లేవు. ఐతే, ఇతివృత్తం సదాశయం కలదైనంత మాత్రాన సరిపోదు. దాన్ని చెప్పిన తీరు కూడా లెక్కలోకొస్తుంది. సోమరి అనుకరణలు కాకుండా సొంత ప్రపంచాల వైవిధ్యాన్ని పట్టి చూపించగలిగే రచనలకు ప్రత్యేక స్థానం. కథ, కవిత, మ్యూజింగ్, వ్యాసం, సమీక్ష. . . ఇవన్నీ రచనల్ని విడదీసి సర్దే సౌలభ్యం కోసం పెట్టుకున్న పేర్లు మాత్రమే. అవేమీ మీకు పరిమితులు కావు.

రచయితలకు సూచనలు: 

1. మీ రచనల్ని తెలుగు యూనికోడ్ లో టైపు చేసి editor@kinige.com కు పంపాలి.
2. మీ రచనపై కాపీరైట్ మీకే ఉంటుంది.
3. రచన మీ సొంతమై ఉండాలి. అనువాదాలు విషయంలో మూల రచయితల్నించి హక్కులు పొందినవే పంపాలి (పబ్లిక్ డొమైన్ లో ఉన్నవాటికి ఆ అవసరం లేదు).
4. మీ రచన అంతకుముందు వేరే ఎక్కడా (సోషల్‌మీడియా సైట్లలో గానీ, ఇతర వెబ్ సైట్లలో గానీ, బ్లాగుల్లో గానీ, ప్రింటు పత్రికల్లో గానీ) ప్రచురితమైంది కాకూడదు. వేరే ప్రింటు, వెబ్ పత్రికల వద్ద పరిశీలనలో ఉన్న రచనలు కూడా అనర్హమే.
5. రచన నిడివిపై పరిమితులేవీ లేవు.
6. అక్షర దోషాలు మీరే సరి చూసుకుని పంపాలి.
7. రచన అందిన వెంటనే ఆ సంగతి మీకు తెలియజేస్తాం. మీ రచన ఎంపికైందీ లేనిదీ కూడా ఒక నెల లోగా తెలియజేస్తాం. ఈ లోగా మీరు మీ రచనను మరే ఇతర మాధ్యమాలకూ పంపించకూడదు.
8. కినిగె పత్రికలో ప్రచురితమైన మీ రచనను దరిమిలా అంతర్జాలంలో వేరే ఎక్కడన్నా ప్రచురించదలిస్తే అక్కడ పూర్తి రచన ఇవ్వకుండా, కొన్ని భాగాలు మాత్రం ఇచ్చి, పూర్తి రచన కోసం కినిగె పత్రిక లింకు ఇవ్వాలి.
9. కినిగె పత్రికలో వచ్చిన మీ రచనను అటు తర్వాత ప్రింటు పత్రికల్లో ప్రచురణకు పంపదలిస్తే, ఆ రచన ముందే మా పత్రికలో వచ్చిందన్న విషయాన్ని ఆ పత్రికా సంపాదక వర్గానికి తెలియజేయాల్సిన బాధ్యత మీదే. అలాగే అక్కడ మీ రచనతో పాటూ, అది మొదటి సారి కినిగె పత్రికలో ప్రచురితమైన సంగతి కూడా అచ్చులో వేయాలి (సదరు సంచిక కాల వివరాలతో సహా).
10. మీ రచన కినిగె పత్రికలో ప్రచురితమైన నెల తర్వాత సొంత బ్లాగుల్లోనూ, వెబ్‌సైట్లలోనూ ప్రచురించుకోవచ్చు. అప్పటి దాకా, కినిగె పత్రికలో మీ రచన తాలూకు లింకు మాత్రం ప్రచురించుకోవచ్చు.
11. మీ రచనల్లో మీరు వెలిబుచ్చే భావాలకూ, వాటిపై వచ్చే స్పందనలకూ మీదే బాధ్యత. కినిగె పత్రికకు వీటితో సంబంధం లేదు.
12. రచనల పై అంతిమ నిర్ణయం కినిగె పత్రిక సంపాదక వర్గానిదే. ఇందులో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.

వ్యాఖ్యాతలకు సూచనలు: 

రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.

(Image Courtesy: http://www.flickr.com/photos/59668110@N04/5600161625)

రెగ్యులర్ అప్‌డేట్‌ల కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీ లైక్ చేయండి: https://www.facebook.com/KinigePatrika

60 Comments

  • నమస్కారం సార్! నేను ఎంత ప్రయత్నించినా నండూరి రామకృష్ణమాచార్య గారి “కావ్యాలోకము”
   లభించుట లేదు. దయచేసి అందుబాటులోకి తెస్తే కృతజ్ఞుడను.

 1. నేను ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణ కథనాలు రాస్తుంటాను. కొన్ని వెబ్ సైట్లలో అవి క్రమం తప్పకుండా ప్రచురితమవుతున్నాయి. కినిగె పత్రికలో అలాంటి కథనాలు ప్రచురిస్తారా.. మీ పత్రికలో అలాంటివి ఇప్పటివరకూ చూడలేదు. మచ్చుకు కొన్ని పరిశీలిస్తామంటే పంపమంటే పంపుతాను.

 2. కామెంట్స్ చదవాలంటే కళ్ళు చిట్లించో, భూతద్దం సహాయం తోనో చదవాల్సి వస్తోంది. దయచేసి సైజు పెంచండయ్యా.

 3. సర్, తెలుగులో directgaa టైపు చేసి మెయిల్ చెయ్యటం ఈజీ గా వున్నది. టైపు చేసిన దాన్ని మరల యూనికోడ్ లోకి మార్చడం తప్పనిసర? దయచేసి తెలుపగలరు.

  • అను, శ్రీలిపి ఇతర సాఫ్ట్‌వేర్ల ద్వారా డైరెక్టుగా టైపు చేసినవి కాదు, యూనికోడ్ లో పంపినవే పరిశీలించబడతాయి. (అనులోనూ, శ్రీలిపిల్లోనూ టైపు చేసినవాటిని యూనికోడ్ లోకి మార్చే వెసులుబాటు ఉందని విన్నాం.)

 4. కధ రాయటం తేలికే. టైపింగే చాలా కష్టంగా వున్నది.
  మీ పత్రిక్కి రాయటం కుర్రాళ్ళు చేయాల్సినపని.
  నా వంటి వయసైపొయిన వాళ్ళకి తగని పని అనిపిస్తోంది.

 5. నాది కూడా అదే అనుమానం, కాపీరైట్ వుంటుంది అన్నారు కాబట్టి, చదివినవారు గానీ, మరెవరైనా కాపీ చేసి తమదిగా చూపదలిస్తే, కినిగే.కాం ఆధారంగా వారిపై చర్య తీసుకోగలమా? అంటే, రచయితల రచనలకు ఓ రక్షణ కినిగే ద్వారా కలుగుతుందా?

 6. కాపీరైట్ వుంటుంది అన్నారు కాబట్టి, చదివినవారు గానీ, మరెవరైనా కాపీ చేసి తమదిగా చూపదలిస్తే, కినిగే.కాం ఆధారంగా వారిపై చర్య తీసుకోగలమా? అంటే, రచయితల రచనలకు ఓ రక్షణ కినిగే ద్వారా కలుగుతుందా?

 7. నేను వ్యక్తిత్వ వికాసము పైన ఒక చిన్న పుస్తకము రాశాను. పంపించవచ్చా

  [Admin] పంపించండి. పరిశీలిస్తాం. [/Admin]

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.